హాయ్ సార్..! నేనొక అమ్మాయిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. తనకి ఇప్పటికే ఫోర్ టైమ్స్ ప్రపోజ్ చేశాను. కానీ తను రిప్లై ఇవ్వలేదు. వాళ్ల ఫాదర్.. తనకు పెళ్లి చెయ్యడానికి గవర్నమెంట్ జాబ్ చేసేవాళ్లకోసమే చూస్తున్నారట. కానీ నేను చదువుకోలేదు. తను నన్ను ప్రేమించకపోతే నేను చనిపోతాను. ప్లీజ్ హెల్ప్ మీ సార్. – ఆనంద్ కుమార్
చదువుకున్నవాడు గొప్పవాడు కాదు.చదువుకోనివాడు మనసు లేనివాడు కాదు.కానీ ప్రేమ, పెళ్లి రెండు డిఫరెంట్..!!ప్రేమించడానికి అర్హతలు అక్కర్లేదు.పెళ్లి చేసుకోవడానికి బాధ్యత నింపే శక్తి అవసరం..!!ఓటమి.. ప్రేమించి పెళ్లి చేసుకో లేకపోవడంలో లేదు.ఓటమి.. కులంలో, పేదరికంలో లేదు.ఓటమి.. బతకలేకపోవడంలో లేదు.‘మరి ఎక్కడ సార్ ఓటమి ఆనంద్‌కి??’తన మీద తనకు భరోసా లేకపోవడంలో ఉంది.‘అవును అమ్మాయి ఓకే చెప్పలేదు, మనకు నచ్చిన వాళ్లు మనకు ఓకే చెప్పాలనేం లేదు. అలాగని మనం ఎవరికీ తక్కువ కాదు. మన మనసుకు నచ్చింది మనం చెప్పగలిగాం. అది గ్రేట్. ఆనంద్‌కి ధైర్యం ఉంది కాబట్టి చెప్పాడు. తిరస్కారం నుంచి భయపడి చెప్పకుండా ఉంటే దాన్ని ఓటమి అనుకోవాలి. ఆనంద్ కూడా ట్రై చేశాడు. ఫ్యూచర్‌లో తనకు తప్పకుండా మంచి లవ్ దొరుకుతుంది!’
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
నన్నడగొద్దు ప్లీజ్
Published Wed, Nov 7 2018 12:57 AM | Last Updated on Wed, Nov 7 2018 12:57 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment