
హాయ్ అన్నయ్యా..! నాదొక సమస్య...!! రెండేళ్లుగా ఒక పెళ్లైన అమ్మాయిని ప్రేమిస్తున్నాను. తనకి ఈ మధ్య ఒక పాప కూడా పుట్టింది. మొదట్లో ‘నువ్వంటే నా ప్రాణం’ అనేది. ఎప్పుడైనా గొడవ జరిగితే నేనే ముందు ఫోన్ చేసే వాడిని. ఈ మధ్య ఆ అమ్మాయి ‘నన్ను వదిలెయ్యి. నువ్వంటే నాకు ఇష్టం లేదు’ అంటోంది. కానీ నేను ఎదురుపడితే నా వైపు చూసి నవ్వుతోంది. ఈ పెళ్లైన అమ్మాయిని నేనెలా నమ్మాలి..? నేను మానసికంగా చాలా బాధను అనుభవిస్తున్నాను. ఆ అమ్మాయిని ఎలా మర్చిపోవాలి? ప్లీజ్ అన్నయ్యా.. నాకు మంచి సలహా ఇవ్వండి. నేను మీరు చెప్పిందే పాటిస్తాను. – గిరి
మంచి ప్రేమ.. మంచి కోరుతుంది.అది ఎదగాలి, పెరగాలి, వెలగాలి, పంచాలి.తగ్గాలి, ఒగ్గాలి, నెగ్గాలి..!!కానీ దేన్నీ ధ్వంసం చెయ్యకూడదు..!!పెళ్లైన అమ్మాయి..! బిడ్డ ఉన్న తల్లి...!కుటుంబం ఉన్న కోడలు...!
బాధ్యత ఉన్న చెల్లి...!ఒకసారి ఇమాజిన్ చెయ్యి.. నీకే పెళ్లి అయ్యిందనుకో...వేరెవరైనా నీ భార్యతో అలాంటి ఆలోచన పెట్టుకుంటే...నువ్వు ఆ మగాడిని అసహ్యించుకోవా??చాలు గిరి..! ఇప్పటిదాకా నువ్వు చేసిన తప్పు ఇక చాలు..!!మంచితనాన్ని గెలవనివ్వు.మదమాత్సర్యాలను అణిచివెయ్యి.‘సార్..! మదమా..త్సర్యా...లు... అంటే ఏంటి సార్??’ఏదో ఫ్లోలో అన్నాను, నాకూ తెలియదు నీలూ! ‘నాకు తెలుసు సార్! ప్రేమ లేని వాంఛ... డర్టీ థింగ్. ప్రేమను అవమానించే ఆలోచన... దట్ ఈజ్ మదమాత్సర్యాలు. గిరి..! స్టాప్ ఇట్!! బీ ఏ గుడ్ మ్యాన్!!’ ఇంకోసారి ఇంత కాంప్లికేటెడ్ క్వశ్చన్స్‌కి నువ్వే ఆన్సర్ ఇవ్వు నీలూ! నా ముందు అసలు ప్రవేశపెట్టకు ప్లీజ్!!
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
Comments
Please login to add a commentAdd a comment