
హాయ్ అన్నయ్యా..! నేనొక అమ్మాయిని చిన్నప్పటి నుంచి లవ్ చేస్తున్నాను. తను హ్యాండీక్యాప్‌డ్. పైగా మా నేపథ్యాలు కూడా వేరు. ఇంటర్‌లో ఉండగా తనకు ప్రపోజ్ చేశాను. ఓకే అంది. అయితే వాళ్ల ఇంట్లో వాళ్లకి ఇలాంటివి నచ్చవని చెప్పి బ్రేకప్ చెప్పేసింది. త్రీ ఇయర్స్ తర్వాత మళ్లీ ప్రపోజ్ చేశాను. ఓకే అంది కానీ, ‘మా ఇంట్లో మన పెళ్లికి ఒప్పుకోరు’ అని మళ్లీ చెప్పింది. ఆ తర్వాత చాలా రోజులు బాగానే ఉన్నాం. ఎన్ని గొడవలైనా మళ్లీ కలిసిపోయేవాళ్లం. కానీ కొన్ని రోజుల క్రితం ‘మనం పెళ్లి చేసుకుందామా?’ అని అడిగితే... ‘ఇదంతా జరిగే పని కాదు, మా పేరెంట్స్‌కి వ్యతిరేకంగా ఏం చెయ్యలేను’ అని చెప్పి, మాట్లాడటం మానేసింది. పైగా వాళ్ల ఇంటికి వచ్చి, వాళ్ల పేరెంట్స్‌తో మాట్లాడొద్దని ఒట్టు వేయించుకుంది. తను లేకుండా నేను ఉండలేను అన్నయ్యా. ప్లీజ్ మంచి సలహా ఇవ్వండి.
- రామకృష్ణ
ప్రేమించానని చెప్పడం అన్ని ఒట్లకూ అమ్మ ఒట్టులాంటిది..!‘ఏంటి సార్..? ఒట్టు కంటే ప్రేమ గట్టిదా సార్??’ఏం....ఏం.....ఏం....ఏం...ఏం....ఏం.... కాదు ప్రేమ పవిత్రమైనది!‘కానీ ప్రేమ కంటే ఒట్టు ఒక గట్టు మరో మెట్టు ఎక్కువ కదా సార్?’కాదు.. అమ్మాయికి ముందు లవ్ చెప్పాడు, తర్వాత ఒట్టు వేశాడు.. ప్రేమే చెల్లుతుంది..!!‘అంటే అమ్మాయి ఇంటికి పోయి, లవ్‌స్టోరీ పేరెంట్స్‌కి చెప్పెయ్యాలా సార్?’ప్రేమ వ్యక్తం చేసిన రోజే కమిట్ అయిపోయాడు రామకృష్ణ..! ‘ఒకసారి చెబితే తన మాట తనే వినడా సార్ రామకృష్ణ??’ఎస్!! నీలూ!!
- ప్రియదర్శిని రామ్, లవ్ డాక్టర్
- lovedoctorram@sakshi.com