హాయ్ సార్! నేనొక అబ్బాయిని లవ్ చేశాను. మా ఇద్దరి మధ్య అనుమానం అనే చిన్న గొడవ మొదలైంది. తను నన్ను చాలా అనుమానిస్తున్నాడు. నేను అబ్బాయిలతో మాట్లాడతానని, అది తనకు నచ్చడం లేదని, నన్ను అనుమానిస్తున్నాడు. అసలు తనని ఎలా మార్చుకోవాలో తెలియడం లేదు. ప్లీజ్ హెల్ప్ మీ! సలహా ఇవ్వండి. చాలా టార్చర్‌గా ఉంది. నన్ను తను అనుమానిస్తుంటే బాధగా ఉంది. ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. తనే ప్రాణంగా ప్రేమించా. తను ఇష్టం లేదని చెప్పినా మాట్లాడను కానీ, చాలా నీచంగా ఆలోచిస్తున్నాడు సార్! ఓపికతో ఇంకా మాట్లాడుతున్నాను సార్. ప్లీజ్ సార్. హెల్ప్ మీ! – ఊహ
మార్చేసెయ్యి!‘మార్చడం రాక కాదు సార్ మీకు రాసింది!?’అందుకే చెబుతున్నా కదా, మార్చేసెయ్యి!‘ఏంటి సార్! గానుగ ఎద్దులా అక్కడే తిరుగుతున్నారు. చెప్పిందే చెబుతున్నారు. మార్చడానికి సలహా అడిగితే... మార్చేసెయ్యి అని ఈజీగా అనేస్తున్నారు?’కరెక్ట్‌గానే చెబుతున్నా నీలూ. అలాంటోడిని మార్చేస్తే పోలా?‘ఓ.. ఓహో.. ఓహో.. ఓహోహోహో... ఓహో.. ఓహోహోహోహో... క్యాండిడేట్‌నే మార్చేసి ఇంకొకడిని ప్రేమించమంటున్నారా మహాప్రభో?!’ఎగ్జాట్లీ!‘ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తోంది సార్ మీ చెల్లెలు!
ప్రాణం తీసేసే అంత జెలసీ, ఇన్ఫీరియర్ కాంప్లెక్స్ ఉన్న క్యాండిడేట్‌ని ఎంత తొందరగా వదిలించుకుంటే అంత తొందరగా సుఖపడుతుంది!‘మరి ప్రేమా?’ప్రేమ, నమ్మకం జోడెద్దులు! రెండూ కరెక్ట్‌గా నడిస్తేనే బతుకుబండి హ్యాపీగా ఉంటుంది.‘అబ్బ.. అబ్బబ్బా.. అబ్బబ్బబ్బా.. ఏం చెప్పారు సార్!! లవ్ అండ్ ట్రస్ట్ జీవితం అనే బండిని లాగే రెండు ఎద్దులని. అబ్బ.. అబ్బబ్బబ్బా...!’ వెటకారం ఆపి అరటిపండు ఇవ్వు నీలూ!!
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హెదరాబాద్–34. lovedoctorram@sakshi.com
నన్నడగొద్దు ప్లీజ్
Published Wed, Jul 18 2018 12:59 AM | Last Updated on Wed, Jul 18 2018 12:59 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment