
హాయ్ రామ్ అన్నయ్యా! నేనొక అబ్బాయిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను. తను కూడా ఫస్ట్‌లో ‘లవ్ చేస్తున్నాను... పెళ్లి చేసుకుంటాను’ అని చెప్పాడు. ఎందుకంటే మొదట తనే నాకు ప్రపోజ్ చేసాడు. ఇప్పుడు పెళ్లి చేసుకుందామంటే ‘మా పేరెంట్స్ ఒప్పుకోరు. వాళ్లకి క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువ’ అంటున్నాడు. నాకు చచ్చిపోవాలనిపిస్తోంది. తన మనసు మార్చాలంటే ఏం చెయ్యాలో సలహా ఇవ్వండి అన్నయ్యా ప్లీజ్..? – అవంతిక వాణి
ఏంటీ మార్చేది??‘మనసు మారితే మళ్లీ లవ్ చేస్తాడు కదా సార్..!!???’ ఏంటీ చేసేది????‘పెళ్లి చేసుకుంటాడు కదా సార్..!!??’ ఏంటీ చేసుకునేది????? ‘ఏంటి సార్?? అప్పటి నుంచి చూస్తున్నాను, క్వశ్చన్‌కి క్వశ్చన్ ఆన్సర్ ఇస్తున్నారు???’ వాడు దొంగ...! సింగిల్ లెగ్ మీద నిలబడి లవ్ చేస్తున్న కొంగ..!! ఏబ్రాసి... దూబ్రాసి... సచ్చినోడు..! డర్టీ ఫెలో..! పెంటగాడు..!! అబద్ధాలకోరు..! ఛీటర్!!‘అంటే వాడు మారడు. మారినట్లు యాక్టింగ్ చేసినా మళ్లీ అవంతికకి టోకరా ఇస్తాడన్నమాట. కరెక్ట్‌గా చెప్పారు సార్. అవంతికా..! లక్కీగా ఆ దరిద్రుడి గుణం ముందే తెలిసిపోయి మనం సేఫ్ అయిపోయాం. డోంట్ వర్రీ. ఇంతకంటే మంచివాడే నీకు దొరుకుతాడు!!’
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్