
హాయ్ సార్..! నేనొక అమ్మాయిని లవ్ చేస్తున్నా. తను నా యూకేజీ నుంచి ఫ్రెండ్ (ఇంచుమించు సెవెంటీన్ ఇయర్స్). తనంటే నాకు చాలా ఇష్టం. బట్ నేనెప్పుడు ఈ విషయం తనకి చెప్పలేదు. తనకి నేను చాలా బెస్ట్ ఫ్రెండ్‌ని. నాకు జాబ్ వచ్చాక, మ్యారేజ్ చేసుకుంటానని చెబుదామనుకున్నా. అయితే ఒకరోజు తనకి ఇంట్లో ఏదో పెళ్లి సంబంధం వచ్చిందని ఒక ఫ్రెండ్‌గా షేర్ చేసుకుంది. దాంతో నాకు భయమేసి.. తను నిద్రపోయిన తర్వాత ‘నేను నిన్ను పెళ్లి చేసుకుందామనుకున్నా’ అని మెసేజ్ చేశాను. త్రీ డేస్ మాట్లాడలేదు. తర్వాత చాలా రిక్వెస్ట్ చేస్తే చాట్ చేస్తోంది. తనకీ నేను ఇష్టమే కానీ, ఫ్యామిలీ బాధపడకూడదని ఫీల్ అవుతోంది. అయితే, ప్రాబ్లమంతా నా జాబ్ సెటిల్‌మెంట్ మీద ఆధారపడి ఉంది. తను నాకంటే బాగా చదువుతుంది. ఎలాగో కష్టపడి జాబ్ తెచ్చుకుంటా. బట్ తనకి నాకంటే పెద్ద ప్యాకేజ్ ఉంటే, ఎలా మేనేజ్ చెయ్యాలో తెలియట్లేదు. ప్లీజ్ సార్ మంచి సలహా ఇవ్వండి. – చైతన్య
సెవెంటీన్ ఇయర్స్ నుంచి దోస్తీ...అప్పటి నుంచి వేస్తున్నాడు ఇంటి చుట్టూ గస్తీ...కానీ ఫ్యామిలీ చేస్తుంది అమ్మాయిని జబర్దస్తీ...చైతన్య కంటే ముందు ఎవరో వేస్తారు దస్తీ..ఎలా చెయ్యాలి లవ్లో కుస్తీ..శాలరీ అమ్మాయిది సూపర్ మస్తీ...మనకు ఉద్యోగమే లేదు అది దుస్థితి... లవ్‌కు చేస్తుంది సుస్తీ...‘సార్ ఆపండి సార్... మీ కుస్తీ...పలకండి చైతన్య ప్రాబ్లమ్‌కి స్వస్తి...! లేకుంటే అవుతుంది మన బిజినెస్‌కి తగిన శాస్తి.అప్పుడవుతుంది మనిద్దరికీ సూపర్ సుస్తి...!’ అసలు ప్రాబ్లమే లేదు నీలాంబరి!! ‘ఏంటి సార్ ప్రాబ్లమ్ లేదంటారు? లవ్ కోసం సెవెంటీన్ ఇయర్స్ నుంచి వెయిటింగ్..! బాబు వస్తే జాబు వస్తుందని... చైతన్య ఫోర్ ఇయర్స్ నుంచి వెయిటింగ్..! ఇన్ని ప్రాబ్లమ్స్ ఉంటే ప్రాబ్లమ్ లేదంటారేంటి సార్???’ మంచి రోజులు వస్తున్నాయి. జాబ్ వస్తుంది.. అమ్మాయి ఓకే అంటే మనకు పప్పన్నం పెడతాడు నీలూ!! ‘సార్ మరి అమ్మాయి ప్యాకేజ్ కంటే మనోడి ప్యాకేజ్ చిన్నదయితే???’ లవ్ స్టేటస్‌కి ఉండాల్సింది పెద్ద హార్ట్.. ప్యాకేజ్ కాదు నీలూ!!!
ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
- lovedoctorram@sakshi.com