హాయ్ సార్..! నేను టెన్త్ క్లాస్‌లో ఒక అమ్మాయిని లవ్ చేశాను. కానీ అప్పుడు ఆ విషయం ఆమెకు చెప్పలేదు. టెన్త్ తర్వాత కొన్ని రోజులకి ఆమెకు ఫేస్‌బుక్‌లో రిక్వస్ట్ పెట్టాను. ఓకే చేసింది. బాగా క్లోజ్ అయిన తర్వాత ప్రపోజ్ చేశాను. ఓకే చెప్పింది. కొన్ని రోజులు బాగానే ఉన్నాం. తనని కాలేజ్ దగ్గర డ్రాప్ చేసేవాడిని. అయితే ఎవరో తనని బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడట. బాగా బెదిరిపోయి.. ఫేస్‌బుక్‌లోకి రావడం మానేసింది. ఈ తర్వాత ‘నువ్వంటే నాకు ఇష్టం లేదు’ అని మెసేజ్ చేసింది. ఎందుకు అని అడిగితే.. ‘ఏం లేదు, ఇక్కడితో ఆపేద్దాం. నువ్వంటే నాకు ఇష్టం లేదు’ అని అంటోంది. మంచి సలహా ఇవ్వండి ప్లీజ్. – బాషా
ఏం సలహా ఇవ్వాలి బాషా?‘ఏంటి సార్...! మిమ్మల్ని సలహా అడిగితే... ఏ టైప్ సలహా ఇవ్వాలని మీరే అడుగుతున్నారు!? బాషాకి మీ మీద చాలా పూర్ ఒపీనియన్ వచ్చేస్తుంది సార్. ఆ బాషాకు వచ్చిన ఒపీనియన్ మిగితా లవర్స్‌కి కూడా వచ్చేస్తుంది. దాంతో వాళ్లందరూ మీకు ఉత్తరాలు రాయరు. ఎవరూ ఉత్తరాలు రాయకపోతే మీరు ఇక్కడ కూర్చుని ఈగలు తోలుకుంటూ ఉంటారు. సారీ, ఈగలు కూడా ఉండవు. ఎందుకంటే అరటిపండ్లు లేకపోతే ఈగలేందుకు వస్తాయి సార్? అరటిపండ్లు ఎందుకు ఉండవనుకుంటున్నారా? దానికేముంది సార్.. మీకు ఒక్క లెటర్ కూడా రాకపోతే మీరు బోర్డ్ తిప్పెయ్యాలి కదా సార్. బోర్డ్ తిప్పేస్తే పేపర్ వాళ్లు... ‘వాట్ ఈజ్ ద యూజ్ ఆఫ్ దిస్ ఫెలో?’ అని అనుకుని మీ కాలమ్ ఆపేస్తారు కదా సార్. అప్పుడు పాపులారిటీ ఉండదు. చేతిలో చిల్లి గవ్వ ఉండదు. నా దగ్గర ఉన్న సేవింగ్స్ గట్రా అంతా నేను ఖర్చు పెట్టేస్తాను. మా మమ్మీ వాళ్లు పెట్టిన బంగారం అమ్మేస్తాను.
ఈ స్టెతస్కోప్ కూడా ఇచ్చి లాస్ట్ డజన్ అరటిపండ్లు ఇద్దరం మెక్కుతాం. ఆ తర్వాత ఇంకేముంది సార్ అంతా శూన్యమే. అందుకే నా మాట విని ఏదో తెలిసిన స్మార్ట్ ఫెలోలా సలహా ఇవ్వండి. అంతే కానీ ‘‘ఏం సలహా ఇవ్వమంటావ్?’’ అని బాషాని అడగకండి సార్!!’బాషా బ్రో..! టెన్త్ క్లాస్ అమ్మాయిని ప్రేమిస్తే ప్రేమించావు. అనవసరంగా ఇంకో సారి అలాంటి పసి ప్రేమను కెలక్కు. కన్నీళ్లు పెట్టకు. నిన్ను అర్థం చేసుకుని రిటర్న్ ప్రేమించే అమ్మాయిని, ఫ్రెష్‌గా ఎవరినైనా ఒకరిని వెతికి... ప్రపోజ్ చేసే ముందు నాకే రాయి.. ఓకే!?!‘అప్పుడు కరెక్ట్ సలహా ఇస్తారా సార్? అబ్బా మీరు మేధావులు సార్..!! క్లయింట్ మిమ్మల్ని వదిలి పోకుండా భలే బిజినెస్ ఐడియా పెట్టారు సార్. ఫ్యూచర్లో ఇలాగే సలహాకి ఒక చిన్న ఫిటింగ్ పెట్టండి. మన బిజినెస్ త్రీ గెలలు, ఆరువందల పండ్లుగా అభివృద్ధి చెందుద్ది సార్’ అని నవ్వింది నీలాంబరి.
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
lovedoctorram@sakshi.com
నన్నడగొద్దు ప్లీజ్
Published Fri, May 25 2018 12:27 AM | Last Updated on Fri, May 25 2018 12:27 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment