
హాయ్ సార్..! నేనొక అమ్మాయిని ఫోర్ ఇయర్స్‌గా లవ్ చేస్తున్నాను. తనెప్పుడూ నన్ను ప్రేమించానని చెప్పలేదుగానీ నేను తనని చాలా ఎక్కువగా ప్రేమించాను. ఇప్పుడు తను ఒక అబ్బాయిని లవ్ చేస్తోందని నా ఫ్రెండ్స్ చెబుతున్నారు. అది తెలిసినప్పటి నుంచి నేను అసలు తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు నేనేం చెయ్యాలి సార్? – నాగ్
ఓరీ..! అమాయకుడా..!!ఏమైందన్నా నీ విచక్షణకు!??ఎలా మిస్ అయ్యావన్నా బస్సు!??ప్రేమ పీకడం లేదా మనసు?!?మరెందుకన్నా ఇలా చేసావు!? ఛస్సు!!ఎలా చేసుకున్నావన్నా లవ్వుని తుస్సు!!‘ఏమైంది సార్..!? ఇవాళ ఎందుకీ కస్సు! బుస్సు!?!’చూడు నీలూ..! అబ్బాయిలంతా ఒక్క లుక్కు కోసం చస్తుంటే.. ఫోర్ ఇయర్స్ ఛాన్స్ ఉండి ఇలా ఎలా చేసుకుంటాడు నాగన్న మిస్!?‘దానికేముంది సార్..! ఈ అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయి ఇస్తుంది ఛాన్స్!’లెస్స పలికితివి నీలూ.... లెస్స పలికితివి.!! ఎక్కమను మళ్లీ మరో లవ్ బస్సు!!
ప్రియదర్శిని రామ్‌లవ్ డాక్టర్
lovedoctorram@sakshi.com