
హాయ్ సార్! మీరెప్పుడూ ఎందుకని అమ్మాయిలనే సపోర్ట్ చేస్తారు? నాకొకటి అనిపిస్తోంది. బహుశ ఒక ఆర్గనైజేషన్ నేమ్‌తో మీరు సమాధానాలు ఇస్తున్నారు కాబట్టి అమ్మాయిలు తప్పు చేసినా ఏం అనట్లేదనిపిస్తోంది. ఇప్పుడు నాకు న్యాయంగా సమాధానం చెప్పండి. తనే నన్ను ‘లవ్ చేశాను’ అంది. తనే ‘మా వాళ్లు ఒప్పుకోరు సారీ’ అంది. ఈ మధ్యలో నన్ను పిచ్చోడిని చేసి తన అవసరాలు, ఆశలు అన్నీ తీర్చుకుని వాళ్ల పేరెంట్స్ చూసిన సంబంధం చేసుకుని వెళ్లిపోయింది. అంటే తనకో క్లారిటీ ఉందనేగా అర్థం. అదే విషయం నాకు చెప్పి ఉంటే.. నేను హ్యాపీగా తిరిగి, హ్యాపీగా మరిచిపోయి ఉండేవాడినిగా? సార్ మాట మార్చకండి. న్యాయం చెప్పండి. ఆ అమ్మాయిది తప్పేనని ఒప్పుకోండి. కనీసం నా మనసు సంతోషిస్తుంది.– రఘు
అమ్మాయిదే తప్పు...
అమ్మాయిదే తప్పు...
అమ్మాయిదే తప్పు...
అమ్మాయిదే తప్పు...
అమ్మాయిదే తప్పు...
‘సార్... రామకోటి లాగ.. తప్పు కోటి రాస్తున్నారు. ఎందుకో మీరు అలా రాస్తుంటే మీరు లెంపలేసుకుంటున్నారేమోనన్న ఫీలింగ్ రఘుకి వచ్చి చాలా.. చాలా.. చాలా.. చాలా... చాలా... సంతోషిస్తాడు సార్!’ అని కడుపు పట్టుకుని నేల మీద దొల్లుతూ నీలాంబరి నవ్వుతూ.. నవ్వుతూ.. నవ్వుతూ.. నవ్వుతూ ఉండిపోయింది!!
lovedoctorram@sakshi.com
ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్