
హాయ్ సార్..! నేనొక అమ్మాయిని సిన్సియర్‌గా లవ్ చేస్తున్నాను. తను కూడా నన్ను చాలా ఇష్టపడుతోంది. తను నా కోసం చనిపోవడానికి కూడా సిద్ధపడింది. అలాంటి అమ్మాయిని వదులుకోవడం నాకు ఇష్టం లేదు సార్. బట్ వాళ్ల డాడీ మాత్రం మా పెళ్లికి ఒప్పుకోవట్లేదు. నాకు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. మీరే మంచి సలహా ఇవ్వండి ప్లీజ్! – శివ
నువ్వు టోటల్ సిన్సియర్..! అమ్మాయి ఫుల్‌గా కమిటెడ్..!! డాడ్ కంప్లీట్‌గా కంపు చెయ్యడానికి రెడీ..!!‘సార్ ఆన్సర్ ఇవ్వమంటే క్వశ్చన్ చెబుతున్నారేంటి సార్????’వాళ్ల డాడ్ అంటే అమ్మాయికే కాదు అబ్బాయికి కూడా...‘అబ్బాయికి కూడా... ఏంటి సార్???’లవ్..!!‘ఏంటి సార్..!? అమ్మాయి వాళ్ల డాడీని అబ్బాయి లవ్ చేస్తున్నాడా? వాట్ ఆర్ యు టాకింగ్ సార్?????!?’చేసుకోకపోతే అమ్మాయి బాధపడుతుందనీ.. చేసుకుంటే డాడీ బాధపడతారనీ.. ఇద్దరినీ లవ్ చేస్తున్నాడు నీలూ!!‘అయితే ఇప్పుడు శివ ఏం చెయ్యాలి సార్????’చక్కగా అమ్మాయి ఇంటికి వెళ్లి ‘డాడీ గారండీ.. మీ అమ్మాయిని నేను లవ్వాడుతున్నానండీ’ అని చెప్పి ధైర్యంగా అమ్మాయి హ్యాండ్ అడగొచ్చు. ఆ డాడీ ఎక్కడ ఫీల్ అయిపోతాడోనని మనకు ఉత్తరం రాస్తే ఎలా????‘డాడీ ఒకటి పీకితే అప్పుడు ఎకో సౌండ్‌లో శివ..శివ..శివ... అని వినపడుతుందేమో సార్??’ప్రేమించడానికే కాదు గుండె ఉండాల్సింది, ప్రేమను నిలబెట్టుకోవడానికి కూడా గుండె కావాలి...!!
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
lovedoctorram@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment