హాయ్ సార్! నేనొక అమ్మాయిని త్రీ ఇయర్స్ లవ్ చేశాను. తనకి ఎనిమిది నెలల క్రితమే ప్రపోజ్ చేశాను. తను ఒప్పుకుంది. కానీ తనకి అంతకు ముందే ఒకరితో బ్రేకప్ అయ్యిందని చెప్పింది. ‘నువ్వు ఆ అబ్బాయిని పూర్తిగా మరిచిపోతేనే నన్ను లవ్ చెయ్యి. లేకపోతే వద్దు’ అని చెప్పాను. తనని పూర్తిగా మరిచిపోయానంది. ‘సరే అయితే ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుందాం’ అని చెప్పాను. ఓకే అంది. అయితే రెండు నెలలు తర్వాత అతను కాల్ చేసి.. ‘మనం మళ్లీ లవ్ చేసుకుని పెళ్లి చేసుకుందాం’ అన్నాడట. ఆ విషయం నాకు పదిరోజుల తర్వాత చెప్పింది. ‘ఇది సరికాదు.. అతనికి నో అని చెప్పెయ్’ అన్నాను. తను మాత్రం ‘అతడిని వదులుకోవాలని అనిపించట్లేదు’ అంది. ‘నేను నీ లైఫ్‌లోకి రాక ముందు ఏం జరిగినా నాకు సంబంధం లేదు కానీ ఇప్పుడు అలా ఎలా కుదురుతుంది?’ అని అడిగాను. దాంతో మా విషయం ఆ అబ్బాయికి చెప్పిందట. ‘సరే గుడ్ బై’ అని చెప్పి వెళ్లిపోయాడట. ఆ తర్వాత ఇప్పటివరకూ బాగానే ఉన్నాం. కానీ ఇప్పుడు మన పెళ్లికి మా పేరెంట్స్ ఒప్పుకోరు, మనం విడిపోదాం’ అంటోంది. నాకు తను కావాలి. తన ప్రేమ కావాలి. ఒక్క వన్ ఇయర్ ఆగితే నేను లైఫ్‌లో సెటిల్ అవుతాను. ఆ తర్వాత మీ పేరెంట్స్‌ని ఒప్పిస్తాను’ అని చెబుతున్నా తను వినట్లేదు. ఇప్పుడు నేనేం చెయ్యాలి సార్?
– ఆంజనేయులు
అమ్మాయి జంపు కొట్టేసింది అన్నా!‘శుభం పలకరా పెళ్లికొడకా అంటే... ‘పెళ్లికూతురు లవ్ స్టేటస్ ఏంటి?’ అని అడిగాడట మునుపటికి ఓ ప్రబుద్ధుడు. అలా మిమ్మల్ని ఆంజనేయులు కలపమని సలహా అడుగుతుంటే.. అమ్మాయి జంపు గింపు అంటారేంటి సార్?’అమ్మాయి ఇంకా పాత లవ్వులోనే కూరుకుపోయి ఉంది. ఆంజనేయులు ప్రేమ చూసి అక్కడ నుంచి రీబౌండ్ అయ్యి ఆంజనేయులు హార్ట్‌లో పడింది. మళ్లీ ఆ అబ్బాయి కనపడేటప్పటికి...‘మళ్లీ రీబౌండ్ అయ్యి హార్ట్ అక్కడ పడిందా సార్ అమ్మాయిది?’అవును నీలూ! అమ్మాయి ఎమోషనల్ కండిషన్ చాలా వీక్‌గా ఉంది. ఇలాంటప్పుడు మనంఇన్‌వాల్వ్ అయితే...‘హార్ట్ ముక్కలు ముక్కలు అయిపోతుంది కదా సార్!?’అబ్బా ఏం క్యాచ్ చేశావు నీలూ! ఆంజనేయులు మెయిన్‌టెయిన్ డిస్టెన్స్. అలాంటి స్టేజ్‌లో ఉన్న అమ్మాయితో రిలేషన్ కోరుకోవడం....‘కొరివితో కాపురంలాంటిదే కదా సార్?’అబ్బబ్బబ్బా నీలూ.....! యూ ఆర్ వెరీ స్మార్ట్!!
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
- lovedoctorram@sakshi.com
నన్నడగొద్దు ప్లీజ్
Published Thu, Dec 13 2018 12:39 AM | Last Updated on Thu, Dec 13 2018 12:39 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment