
హాయ్ సార్..! నేను, మా మామ కూతురు ఇద్దరం ఇష్టపడ్డాం. ఒకరంటే ఒకరికి ప్రాణం అనుకున్నాం. కానీ మేము వాళ్లకన్నా ఆస్తిలో చాలా తక్కువని, వాళ్ల ఇంట్లో ఒప్పుకోలేదు. మేము ఇద్దరం ఓకే అనుకున్నాం. కానీ, ఇప్పుడు మరిచిపోలేకపోతున్నాం. ఏం చెయ్యాలి సార్? మంచి సలహా ఇవ్వండి. – మహేష్
సంపాదించన్నా...!మీ కాబోయే మామ కళ్లు తిరిగేంత సంపాదించన్నా...!మీ కాబోయే అత్త కళ్లు తిరిగేంత సంపాదించన్నా...!మీ కాబోయే బామ్మర్ది సొల్లు కార్చుకునేంత సంపాదించన్నా...!మీ కాబోయే మరదలు... దిమ్మ తిరిగేంత సంపాదించన్నా...!మీ కాబోయే ఆవిడ(మరదలు) ఫ్రెండ్స్ అంతా ‘తను నన్ను చేసుకోవచ్చుగా?’ అంటూ ఆఫర్లపై ఆఫర్స్ ఇచ్చే అంతగా సంపాదించన్నా...!మీ కాబోయే అత్తగారి ఊరు ఊరంతా ‘మైండ్ బ్లాక్’ అయ్యేంత సంపాదించన్నా...!‘సార్ ఏంటి సార్ డబ్బు ఒకటేనా సార్... లవ్‌కి సక్సెస్?’ప్రేమ సంపాదించాడు మహేష్. డబ్బు సంపాదించమని అడుగుతున్నాడు మామ. ఆ మాత్రం చెయ్యలేడా ప్రేమను గెలవడానికి? ‘ఓ..! ప్రయోజకుడు అయితే వర్కౌట్ అవుతుందంటున్నారా...!? విన్నావా మహేష్.. సంపాదించెయ్!’
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
lovedoctorram@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment