
హాయ్ సార్, నేను ఒక అమ్మాయిని లవ్ చేశాను. తనంటే నాకు ప్రాణం. అలా అని తను లేకుండా బతకలేనని చెప్పలేను. ఎందుకంటే.. నాకు నా ఫ్యామిలీ కూడా ముఖ్యమే. తను నాతో లేకపోతే నేను హ్యాపీగా మాత్రం ఉండలేనన్నది నిజం. విషయం ఏంటంటే... మేమిద్దరం స్కూల్‌మేట్స్. బట్ ఎప్పుడూ స్కూల్లో కలవలేదు, మాట్లాడుకోనూలేదు. రీసెంట్‌గా తనని చూశాను. చూడగానే లవ్ చేశాను. తరువాత ఫ్రెండ్‌గా బాగా క్లోజ్ అయ్యాను. నిజానికి నేను చాలా మంది అమ్మాయిలతో చాట్ చేస్తాను కానీ, ఎప్పుడూ అలాంటి ఫీలింగ్ రాలేదు. ఇప్పటిదాకా లవ్ చేస్తున్నానని చెప్పలేదు. బట్ నా లవ్ ఫీలింగ్ తనకు అర్థమయ్యేలా చేశాను. దాంతో లవ్ అయితే నాతో మాట్లాడకు.. ఫ్రెండ్‌లా అయితే మాట్లాడు అంటోంది. సో, నేను ఏం చెయ్యాలో చెప్పండి ప్లీజ్! – రూపేశ్
లవ్ అమ్మా... చాలా కాంప్లికేటెడ్!‘అది తెలిసే కదా సార్ మీకు రాసింది..!?’ కాంప్లికేటెడ్ మాత్రమే కాదు! ‘ఏంటి సార్??? లవ్ కంటే మీ ఆన్సర్ కాంప్లికేటెడ్‌గా ఉంది!’ నీలాంబరీ... నన్ను మాట్లాడనిస్తే.... ‘ఏంటి సార్ మాట్లాడేది...?? నాకు మీరు ఏమి చెబుతారో ఆల్రెడీ తెలుసు..!’ సరే నువ్వే చెప్పు... ‘ఓరి బడుద్దాయ్...! ఇలా కాదు రా లవ్వేది..’ అబ్జెక్షన్ నీలాంబరి. ‘దేనికి సార్ అబ్జెక్షన్?’ బడుద్దాయ్‌కి అండ్ లవ్వేదికి అబ్జెక్షన్...!! ‘బడుద్దాయ్ అంటే లవ్‌ని అర్థం చేసుకోలేని పసివాడు అని సార్!’ అవునా? అబ్బో నాకు తెలియదే...! మరి.. లవ్వేది..?!? ‘అది ఒక ప్రక్రియ సార్.. లవ్ చేసే ప్రక్రియను లవ్వేది అంటారు సార్!’ లవ్ దోమ కుడితే వచ్చే ప్రేమ జ్వరాన్ని లవేరియా అన్నట్టు.. మలేరియా లాగ.. అంతేనా?? ‘డిస్టర్బ్ చెయ్యకండి సార్ ఫ్లో దెబ్బ తింటుంది..’ కానియ్యి.. నీ లవ్ ఫ్లో.... ‘స్నేహాన్ని ప్రేమగా అబ్బాయిలు కన్ఫ్యూజ్ అవుతారు..’ మరి అమ్మాయిలు?? ‘సార్.. అమ్మాయిలూ.. మీ బుజ్జి బంగారాలు.. ప్రేమను స్నేహం అని కన్ఫ్యూజ్ అవుతారు సార్!’
మరి రూపేశ్ ఏం చెయ్యాలి?? ‘అదే సార్ పాయింట్.. రూపేశ్ ఏమీ చెయ్యకూడదు. అసలు అమ్మాయిని పట్టించుకోకూడదు. అంజాన్ కొట్టాలి.. ముందు నుంచి అమ్మాయి వస్తుంటే వెనక నుంచి తుర్రుమని జారుకోవాలి. మాట్లాడితే చెవిటి వాడిలా యాక్టింగ్ చెయ్యాలి. ఫోన్‌లో మెసేజ్ పెడితే గుడ్డివాడిలా యాక్ట్ చెయ్యాలి. రా.. నా వెంట రా అని పిలిస్తే.. కుంటి వాడిలా యాక్ట్ చెయ్యాలి.’ అర్థమయ్యింది నీలాంబరీ.. ఇవన్నీ చేస్తే రూపేశ్‌కి లవ్ దొరుకుద్దా?? ‘ఎందుకు దొరకదు సార్... అమ్మాయిని పట్టించుకోకపోతేనే లవ్ బిక్ష దొరుకుతుంది సార్..’ నిజంగా ఏదైనా రాంగ్ అనుకుని.. ఓ రూపాయి బిచ్చమేస్తే రూపేశ్ తట్టుకోలేడేమో నీలాంబరీ..? ‘పొండి సార్.. రూపేశ్‌ని నేను చెప్పినట్లు ట్రై చేయమనండి. లవ్ బిక్ష దొరకకపోతే అప్పుడు మీరు ఆన్సర్ ఇద్దురుగానీ, అప్పటి దాకా ఇంద అరటిపండు తినండి!’
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34.lovedoctorram@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment