
హాయ్ సార్..! నేనొక అమ్మాయిని ఫోర్ ఇయర్స్‌గా లవ్ చేస్తున్నాను. తను కూడా నన్ను ఇష్టపడుతుందనిపిస్తోంది. ప్రపోజ్ కూడా చేశాను కానీ, అ అమ్మాయి బయటపడ్డంలేదు. ఎందుకు లవ్ చెయ్యడంలేదని అడిగితే.. ‘‘నేను చదువుకోవాలి’’ అని చెబుతోంది. సో నేను ఏం చెయ్యాలి? లవ్ చెయ్యాలా..??? వదిలెయ్యాలా..???? – రాజ్
వదిలెయ్యి! ‘సార్ రాజ్ గుండె మీద తుపాకీతో కాల్చినట్టు ఏంటి సార్ ఆ సమాధానం?’ గురి పెట్టి కాల్చడానికి రాజ్ ఏమైనా పిట్టా??? ‘అది తెలిసి కూడా.. డిష్యూం అని ఎలా కాల్చారు సార్?’ రాజ్ కాల్చలేదా? ‘ఏంటి సార్ కాల్చింది?’ తన గుండెలో భావాన్ని తీసుకుని.. దాన్ని బుల్లెట్లా సాన పెట్టి... నోటి పండ్ల మధ్య బిగబెట్టి.. మాటల తూటా పేల్చలేదా??? ‘ప్రేమించానని చెప్పడం కూడా పేల్చడమేనా సార్?’ అమ్మాయి పిట్ట కాదు. బడేల్మని రాలి మనోడి కాళ్లదగ్గర పడ్డానికి..? షీ ఈజ్ ఎ కంప్లీట్ ఉమెన్.
రిమెంబర్ దట్!! ‘ఎందుకు సార్ అంత కోపం మీకు!!!?!!!’అరే.. ప్రేమించాను అనగానే అమ్మాయి పడాలా? రాజ్ తన మనసులో మాట చెప్పుకున్నాడు. అమ్మాయికి ఇష్టం ఉంటే ఒప్పుకుంటుంది. తెలియక పోతే టైమ్ తీసుకుని చెబుతుంది. అప్పుడు కూడా పాజిటివ్‌గా చెప్పాలనేంలేదు. తనకు కూడా కరెక్ట్ అనిపిస్తేనే కదా.. అమ్మాయి మనసును గౌరవించకుండా రాజ్ లాంటి మంచి వాళ్లు కూడా రెచ్చిపోతే ఎలా నీలాంబరీ!?!‘కరెక్ట్‌గా చెప్పారు సార్..! రాజ్.... ప్లీజ్ రెస్పెక్ట్ ఉమెన్ యార్!’
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment