
హాయ్ సార్..! నేనొక అమ్మాయిని టూ ఇయర్స్‌గా లవ్ చేస్తున్నాను. తను కూడా ఓకే చెప్పింది. అయితే లాస్ట్ ఇయర్ నాకు జాబ్ రావడంతో వేరే స్టేట్‌కి వచ్చాను. నేను దూరమైన కొన్ని రోజులకి తనలో చాలా మార్పు వచ్చింది. సరిగ్గా మాట్లాడం మానేసింది. కారణం అడిగితే.. ‘నేను అంతకుముందే.. మా బావని లవ్ చేశాను. ఈ విషయం నీకు చెప్పకపోవడం నాదే తప్పు, సారీ..’ అని చెప్పింది. నాకు ఏం చెయ్యాలో తెలియలేదు. నా నంబర్ కూడా బ్లాక్ చేసింది. కొన్ని రోజులకి మళ్లీ కాల్ చేసి, మాట్లాడటం మొదలుపెట్టింది. మళ్లీ గుడ్‌బై అంది. ఇప్పటికీ తను ఫోన్ చేసి మాట్లాడ్డం చేస్తుంటుంది. నాతో ఏమైనా అవసరం ఉంటే చాలా ప్రేమగా మాట్లాడుతోంది. లేదంటే అసలు మాట్లాడదు. నంబర్ బ్లాక్‌లో పెడుతోంది. ఎటూ తేల్చుకోలేకపోతున్నాను. తనంటే నాకు ప్రాణం. చాలా బాధ కలుగుతోంది సార్. మంచి సలహా ఇవ్వండి ప్లీజ్. – సురేష్
నువ్వూ బ్లాక్ చేసెయ్యి!!‘అమ్మాయి ఫోన్నా సార్?’ఎస్..!!మరి హార్ట్‌లో పెయిన్‌ని ఏం చెయ్యాలి సార్?’బ్లాక్ ఇట్!!‘మరి కడుపులోనుంచి తన్నుకొస్తున్న ఉద్వేగాన్ని ఏం చెయ్యాలి సార్?’బ్లాక్ ఇట్ టూ!!‘జ్ఞాపకాలు?’బ్లాక్ ఇట్ టూ ఐ సే!!‘ఇలాంటి ఆన్సర్లు ఇస్తే మిమ్మల్ని బ్లాక్ చేస్తారు సార్. ఆ తర్వాత, అమ్మా ఆకలి, తల్లీ అరటిపండు.. అని తిరగాలి సార్!’అమ్మాయి బ్లాక్ చేస్తే కన్నీళ్లు కార్చడం.. ఓపెన్ చేస్తే చొంగ కార్చడం, వాట్ ఈజ్ దిస్.. అబ్బాయిలకు సెల్ఫ్ రెస్పెక్ట్ లేదా..? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ తెలియదా? ఇలా అమ్మాయిలకు, అబ్బాయిలు చీప్ అయిపోతూ ఉంటే... సమాజం ఏం కావాలి?అందుకే ‘యు బ్లాక్.. ఐ బ్లాక్’ సిద్ధాంతాన్ని పాటించడం అబ్బాయిలకు చాలా అవసరం.‘ఏడిసినట్టుంది. అప్పుడు ఆ అమ్మాయి, బావను చేసుకుంటుంది. మనోడు కన్నీళ్ల కడలిలో నావ నడుపుకుంటాడు. ఇంకేదయినా చెప్పండి సార్!’ఊరూరికే ఫోన్ చెయ్యకు, బిజీగా ఉన్నానని చెప్పు సురేష్. నీ వాల్యూ అర్థమౌతుంది. నీకు బాధ తగ్గుతుంది. బావకు బాధ మొదలవుతుంది!
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హెదరాబాద్–34.lovedoctorram@sakshi.com