
నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నా. ఎంతలా అంటే నాకు ప్రతిక్షణం తనే గుర్తొస్తోంది. తనని నేను నాలుగేళ్ల క్రితం కాలేజ్‌లో చూశాను. తనూ నాకు కనెక్ట్ అయింది. మా కాలేజ్ అయిపోయి రెండేళ్లు అయిపోయింది. ఇప్పటికీ తను నాకు టచ్‌లోనే ఉంది. తను మరాఠీ అమ్మాయి. తనకి ప్రపోజ్ చేశా, బట్ నేనంటే తనకి ఇంట్రెస్ట్ లేదని చెప్పింది. కానీ రోజూ నాతో మాట్లాడుతోంది. చాలా క్లోజ్‌గా ఉంటోంది. మా ఇంట్లో ఈ విషయం చెప్పాను. వాళ్లు ఓకే అన్నారు కానీ ఆ అమ్మాయి సైడ్ నుండి నాకు క్లారిటీ రావట్లేదు. తనకి కూడా నేనంటే ఇష్టం అనుకుంటున్నా. కాకపోతే తన ఇంట్లో రెస్పాన్స్ గురించి ఆలోచిస్తుందేమో అని అనిపిస్తోంది. నేను చాలా కన్ఫ్యూజన్‌లో ఉన్నాను. ప్లీజ్ నాకు కొంచెం క్లారిటీ ఇవ్వండి. ఇది లవ్వా? లేక అట్రాక్షనా? చెప్పండి ప్లీజ్. – సాగర్
హికడే ఆ! ‘అంటే ఏంటి సార్?’ తికడే ఝా! ‘సార్ షో అప్ చేయకండి.. మీకు మరాఠీలో రెండే ముక్కలొచ్చని...!’ ఇక్కడికి రా.. ‘వస్తున్నా సార్..’ హికడే ఆ అంటే ఇక్కడికి రా అని.. ‘ఓ.. తికడే ఝా అంటే అక్కడకి పొమ్మనా సార్??’ ఎంత కరెక్ట్‌గా చెప్పావు నీలాంబరీ? ‘దానికి, సాగర్ ప్రేమకు ఏంటి సార్ సంబంధం???’ ఏం లేదు. మరి...! అమ్మాయి మరాఠీలో ఏం చెప్పిందో... సాగర్ ఏమని అర్థం చేసుకున్నాడో.. మనోడు తెలుగులో ఏం చెప్పాడో.. అమ్మాయికి ఏం అర్థమయిందో.. ఇక్కడికి పో అంటే ఇక్కడికి రా అనుకున్నాడేమో... అక్కడికి పో అంటే అక్కడికి రా అనుకున్నాడేమో... ‘సార్.. మీ కుళ్లు జోక్‌కి నాకే నవ్వు రావడంలేదు.. ఏడుస్తున్న సాగర్‌కి ఏం నవ్వు వస్తుంది సార్??? ఏదైనా పనికొచ్చే విషయం ఉంటే తెలుగులో చెప్పండి సార్!’ సాగర్... అమ్మాయికి నువ్వంటే ఇష్టం. ప్రేమలేదు. నీ కంపెనీ అంటే ఇష్టం. నీతో ‘ఆ’ కనెక్షన్ ఇష్టంలేదు... నువ్వు ఫ్రెండ్‌గా మాట్లాడ్డానికి ఇష్టం. ముడులేసుకోవడానికి కష్టం అని చెబుతోంది.
‘దీన్నిబట్టి మనకు అర్థం ఏం అయిందంటే... సాగర్ చాలా మంచివాడు. అమ్మాయిలు సాగర్ మంచితనాన్ని నమ్ముతారు. గ్రేట్! ‘ఇక సాగర్‌కి లవ్ ప్రాప్తం కాదా సార్?? మంచోడూ.. మంచోడూ... అని అమ్మాయిలంతా ఆటాడుకుంటారా సార్? అన్యాయం సార్, మంచితనానికి రోజులే లేవు సార్!’ అట్లేమీ లేదు. చూస్తూ ఉండు.. సాగర్‌కి గ్రేట్ లవ్ దొరుకుద్ది. 100%..!! ‘హికడే ప్రేమ తికడే దొరుకుద్దా సార్..???’ అని నవ్వింది నీలాంబరి.
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
lovedoctorram@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment