
హాయ్ సార్! మీరు లవర్స్‌కి ఇచ్చే సలహాలు చాలా బాగుంటాయి. నేను ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ఆమె కూడా నన్ను ఇష్టపడుతోంది. లైఫ్‌లో సెటిల్ అయ్యాక ఇంట్లో ఒప్పించి, పెళ్లి చేసుకుందాం అనుకున్నాం. బట్ నాకు తను రోజూ గుర్తుకొస్తోంది. చదువు మీద ధ్యాస పెట్టలేకపోతున్నా. ఏ పనీ సరిగ్గా చెయ్యలేకపోతున్నా. తను కూడా అదే ప్రాబ్లమ్‌ని ఫేస్ చేస్తోందట. ఏం చెయ్యాలో అర్థంకావడంలేదు. మీ సలహా కోసం ఎదురు చూస్తున్నా. – ప్రకాశ్
మీది చాలా అందమైన ప్రాబ్లమ్.. ‘ప్రాబ్లమ్ కూడా అందంగా ఉంటుందా సార్..???’ ప్రేమ అందంగా ఉంటే, ప్రేమ ప్రాబ్లమ్ కూడా అందంగానే ఉంటుంది నీలాంబరీ..! ‘ప్రేమ ఎప్పుడూ అందంగానే ఉంటుంది సార్.. కానీ, మీకు అబ్బాయిల ప్రేమే అసహ్యంగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకో అంత వివక్ష మీకు... అర్థం కాదు సార్!’ అబ్బాయి ప్రేమ దొరకకపోయినా బతకడం నేర్చుకున్నాడు... చాలా ఈజీగా డిస్ట్రాక్ట్ అయిపోతాడు.. ‘డిస్ట్రాక్ట్ అంటే ఏంటి సార్??’ ఆంక్షలు తక్కువ ఉంటాయి కాబట్టి, ఏదో ఒకటి చేస్తూ ప్రేమ లేని లోటు.. ఆ లోటు కలిగించే విపరీతమైన బాధను కొద్దిగా తప్పించుకోగలుగుతాడు. కానీ, అమ్మాయికి ప్రేమే ప్రపంచం అయిపోతుంది. ఇంటా బయటా ఆంక్షలు కూడా ఎక్కువ అవడంతో... ఒక ట్రాప్‌లో ఉండిపోతుంది. కుమిలిపోతుంది. కృంగిపోతుంది. అందుకే, అమ్మాయిల పక్షం తీసుకుంటాను. అబ్బాయిలు చెడ్డవారని కాదు. ‘చాలా తెలివిగా తప్పించుకుంటారు సార్ మీరు... ప్రకాశ్‌కి సమాధానం చెప్పండి.’ ప్రేమను గుర్తు చేసుకోవడం కంటే... ‘కంటే...?’ ప్రేమను గురిగా మార్చుకుని... రాబోయే రోజుల్లో కలసి ఉండే అందమైన జీవితాన్ని తలుచుకుంటూ.. గొప్ప వాళ్లు అవ్వండి ప్రకాశ్..! గాడ్ బ్లెస్ యు..!!
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
ప్రేమ, ఆకర్షణ, టీనేజ్ అనుబంధాల్లోని అయోమయం మిమ్మల్ని గందరగోళపరుస్తుంటే ప్లీజ్ ఈ అడ్రస్‌కు మాత్రం అస్సలు రాయకండి.లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment