హాయ్ అన్నయ్యా..! నేనొక అబ్బాయిని ఫోర్ ఇయర్స్‌గా లవ్ చేస్తున్నాను. తనకి కూడా నేనంటే చాలా ఇష్టం. కానీ నేను తనకి నచ్చినట్లే ఉండాలంటాడు. తను కూడా నాకు నచ్చినట్లే ఉంటాడు. పైగా తనకి కోపం ఎక్కువ. కోపమొస్తే రోడ్డు మీదే కొడతాడు. కనీసం ఫ్రెండ్స్‌తో కూడా మాట్లాడనివ్వడు. ఇప్పుడు పెళ్లి చేసుకుంటే నా జీవితం ఎలా ఉంటుందోనని భయంగా ఉంది. వదిలెయ్యాలని ఉంది కానీ వాడు లేకుండా నేను ఉండలేను. వాడు కూడా ఉండలేడు. వదిలేస్తానంటే ఏడుస్తాడు. ఏం చెయ్యాలో కొంచెం చెప్పండి అన్నయ్యా ప్లీజ్! – దివ్య
వెంటనే..... ‘ఏం చెయ్యాలి సార్?????’నీలూ... వెంటనే......‘చెప్పండి సార్..!! చెప్పండి ప్లీజ్..!!!’ వెంటనే.......‘థ్యాంక్యూ, గుడ్ బై, సియూ లేటర్ ఇన్ ద నెక్ట్స్ లైఫ్. మనది జన్మజన్మల సంబంధమే కానీ ఈ జన్మ నుంచి స్టార్ట్ కాదు. నెక్ట్స్ జన్మ నుంచి స్టార్ట్ అవుతుంది. నేను పువ్వునైతే నువ్వు ముళ్లు. నేను పండునైతే నువ్వు తొక్క. నేను మార్నింగ్ అయితే నువ్వు నైట్. ముళ్లు లేనిదే పువ్వు ఉండదు, తొక్క లేనిదే అరటిపండు ఉండదు, నైట్ లేనిదే మార్నింగ్ ఉండదు. కానీ రెండూ వేరువేరు. స్వభావాలు సెపరేట్. ఆటిట్యూడ్ డిఫరెంట్. విడిగా ఉంటే హ్యాపీగా ఉంటాం. సో థ్యాంక్యూ, గుడ్ బై, సియూ లేటర్ ఇన్ ద నెక్ట్స్ లైఫ్. మనది జన్మజన్మల సంబంధమే కానీ ఈ జన్మ నుంచి స్టార్ట్ కాదు.
నెక్ట్స్ జన్మ నుంచి స్టార్ట్ అవుతుంది... అని చెప్పాలా సార్???’అమ్మో..! అమ్మమ్మో...!! ఓరి నాయనో..!!! నీలూ నువ్వు చాలా ఎదిగిపోయావు. ఎంత ఫిలాసఫీ పీకావు. అది కూడా ఎంత సింపుల్‌గా చాలా కరెక్ట్‌గా చెప్పావు..!!దివ్యా..! ఇప్పుడే ఇంత భయం, బాధ ఉంటే పెళ్లి చేసుకున్నాక వాడు రాక్షసుడిలా ప్రవర్తించడం మొదలుపెడతాడు. తాళి కట్టాను కాబట్టి తన సొంతం అనుకుంటాడు. ఇక అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలు ఏవీ ఉండటానికి వీలు లేకుండా షంటుతాడు. వద్దే వద్దు. ఈ సంబంధం మనకు వద్దు దివ్యా!!
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
నన్నడగొద్దు ప్లీజ్
Published Wed, Aug 22 2018 2:26 AM | Last Updated on Wed, Aug 22 2018 2:26 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment