నన్నడగొద్దు ప్లీజ్‌ | love doctor solve the problems | Sakshi
Sakshi News home page

నన్నడగొద్దు ప్లీజ్‌ 

May 16 2018 12:47 AM | Updated on May 16 2018 12:47 AM

love doctor solve the problems - Sakshi

హాయ్‌ సార్‌..! నాకొక అమ్మాయి అంటే చాలా ఇష్టం. కానీ ఆ అమ్మాయికి నేనంటే ఇష్టంలేదు. ఆ అమ్మాయి గురించి ఆలోచించి, ఆలోచించి పిచ్చివాణ్ని అయిపోతానేమోనని భయంగా ఉంది సార్‌. ఒకవేళ నా ప్రేమను తనకి అర్థమయ్యేలా చెబుదామని పిలుస్తుంటే... పట్టించుకోకుండా వెళ్లిపోతోంది. ఇక ఆ అమ్మాయికి నా ట్రూ లవ్‌ని ఎలా ఎక్స్‌ప్రెస్‌ చేయాలి సార్‌? మంచి సలహా ఇవ్వండి. – ప్రదీప్‌
నువ్వు రాసిన ఉత్తరం...పేపర్లో ప్రింట్‌ అవ్వగానే...చెంగు చెంగున...గంతులేసుకుంటూ....అమ్మాయి దగ్గరకు వెళ్లి...ఐ లవ్‌ యూ’ దీనికి నువ్వే సాక్షి...అని చెప్పి నీ ప్రేమను వ్యక్తం చేసుకో...!
‘అమ్మాయి ఫుల్‌గా కోటింగ్‌ ఇస్తే... ఏం చెయ్యాలి సార్‌?’తాడో.. పేడో... అటో... ఇటో... వాడో... వీడో... తేలిపోతుందిగా నీలాంబరీ!‘మధ్యలో... ఆ ‘వాడో’ ఎవడు సార్‌???’అమ్మాయి ఆల్రెడీ కమిట్‌ అయ్యుంటే చెప్పేస్తుందిగా నీలూ! ‘బెస్ట్‌ ఆఫ్‌ లక్‌ ప్రదీప్‌...!! తాడో..పేడో... ఆటో..ఇటో..వాడో..వీడో... తేలిపోతుందిగా!’
- ప్రియదర్శిని రామ్‌ లవ్‌ డాక్టర్‌ 

Advertisement
 
Advertisement
Advertisement