
హాయ్ అన్నయ్యా.! నేను ఆరేళ్లుగా ఒక అబ్బాయిని లవ్ చేస్తున్నాను. ఆ అబ్బాయి లాస్ట్ ఇయర్ నాకు ప్రపోజ్ చేశాడు. నేను ఓకే అన్నాను. తనకి చాలా ప్రపోజల్స్ వచ్చేవి. బట్, అన్నీ రిజెక్ట్ చేసేవాడు. మొదట్లో మేము చాలా ప్రేమగా ఉండేవాళ్లం. తనకి కోపం ఎక్కువ. నాకు క్వశ్చన్స్ ఎక్కువ. దాంతో చిన్నదానికే గొడవపడుతున్నాం. కానీ.. ‘నువ్వు ఎలా ఉన్నా.. నిన్ను నేను పెళ్లి చేసుకుంటా’ అంటున్నాడు, అంత ఇష్టం ఒకరంటే ఒకరికి. తను నా వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాడన్నయ్యా. నా వల్ల తను ఇబ్బంది పడటం నేను చూడలేకపోతున్నా. అలా అని తను లేకుండా నేను బతకలేను. మళ్లీ మేమిద్దరం ప్రేమగా ఉండాలంటే ఏం చెయ్యాలి. ‘నువ్వు తనకి కొంచెం గ్యాప్ ఇవ్వు’ అంటున్నారు నా ఫ్రెండ్స్. కానీ నాకేం అర్థం కావడంలేదు. ప్లీజ్ మంచి సలహా ఇవ్వండి?– హనీ
అర్జున్ రెడ్డి సినిమా చూసిన ప్రతి అమ్మాయీ.. కోపంగా ఉండే అబ్బాయిలను తెగ ప్రేమిస్తున్నారు నీలూ!‘అవును సార్.. అన్నీ అర్జున్ రెడ్డి పోలికలున్న బాయ్ ఫ్రెండ్స్ ఎక్కువైపోయారు సార్!’ఇదొక జబ్బు అయిపోయింది..!‘అవును సార్..! అబ్బాయిలు కూడా కోపంగా ఉంటేనే అమ్మాయిలు పడతారని, తెగ కోపం నటించేస్తున్నారు సార్!’ఏడిచారు..!‘అంటే??!!’అమ్మాయిలు ఒక చిన్న ఝలక్ ఇస్తే.. కొడుకులు తోకలు ఆడిస్తూ వెనకాలే తిరుగుతారు.‘అయితే.. ఇప్పుడు హనీ ఏం చెయ్యాలి సార్?’అంజాన్ కొట్టాలి నీలూ!!‘అంజాన్ అంటే..?’పట్టించుకోకూడదు నీలూ...!!‘అంటే కోల్డ్‌గా ఉండాలా సార్?’అబ్బా ఏం పట్టుకున్నావు ఐడియాని నీలూ!‘అప్పుడు ఆ కోల్డ్ ఐస్.. అబ్బాయి హాట్ కోపం మీద పడి తుస్సుమంటుంది!!’అబ్బబ్బబ్బా...... నీలూ యు ఆర్ స్మార్ట్.‘మంట తగ్గి... పంట పండుద్ది కదా సార్!?!’అబ్బబ్బబ్బా.. అబ్బబ్బబ్బా... అబ్బబ్బబ్బా...
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
lovedoctorram@sakshi.com