
హలో రామ్ సార్..! ఒన్ ఇయర్ పాటు కాల్ సెంటర్‌లో పని చేశాను. అక్కడొక అమ్మాయితో పరిచయమైంది. ఫ్రెండ్ అయ్యాక తనకి ప్రపోజ్ చేస్తే నవ్వింది. మనం బెస్ట్ ఫ్రెండ్స్‌లా ఉందామని చెప్పింది. తనకి యశోద హాస్పిటల్‌లో సీట్ వచ్చిందని, కాల్ సెంటర్‌లో రిజైన్ చేసింది. తనని చూడకుండా ఉండలేక నేను కూడా రిజైన్ చేశాను. గుర్తొచ్చినప్పుడల్లా యశోద హాస్పిటల్‌కి వెళ్లి తనను కలుస్తుంటాను. మొన్న షాపింగ్ చేయించాను. ‘థాంక్యూ సో మచ్, లవ్యూ రా’ అంది. ఒకసారి తనకి ఏవో బుక్స్ కావాలంటే మూడు వేలకు పైనే ఇచ్చాను. తనని నేను లవ్ చేస్తున్నానని తనకి తెలిసి కూడా యాక్ట్ చేస్తోంది. వాట్సాప్‌లో తన పిక్స్ పంపిస్తోంది. లవ్ సాంగ్స్ కూడా సెండ్ చేస్తోంది. అసలు తను నన్ను లవ్ చేస్తోందా లేదా? దయచేసి చెప్పండి సార్? – రెహ్మత్ అలీ
నిన్ను ఇంట్లో వాడిగా చూస్తోంది.‘అంటే ఏంటి సార్?’ఇంట్లో వాడిలా అంటే కూడా తెలియదా నీలూ.. నువ్వు అంత స్మార్ట్ అయ్యుండి కూడా.. ఇంట్లో వాడు అంటే అర్థం చేసుకోకపోవడం వెరీ సర్‌ప్రైజింగ్‌నీలూ..!!‘అంటే ఫాదర్.. బ్రదర్.. అంకుల్ లాగానా సార్!!?!!’మనమేదైనా కొనుక్కోవాలనుకుంటే.. మన దగ్గర డబ్బులు లేకపోతే.. ఇంట్లో వాళ్లను కాకుండా ఇంకెవరిని అడుగుతాం నీలూ?
‘పొండి సార్!! టూ మచ్!! అంతా తొండి సార్!! డబ్బులు తీసేసుకోవడమే కాకుండా ఫ్యామిలీ మెంబర్‌లాగ చూసుకుంటుందని అలీ భాయ్‌ని జింతాక చితాచితా చేస్తారా సార్!?! మేకను కోసినట్లు కోస్తోంది. ఆవును పిండినట్లు పిండుతోంది. అలీ లాంటి సాధుజీవిని ఫుల్‌గా వాడుకుంటోంది. మీరేమో చెల్లెలి ఇమేజ్ కాపాడటానికి అన్నీ తొండి మాటలు చెబుతున్నారు సార్! వెరీ బ్యాడ్ సార్!’ నాకలా అనిపించింది. నీకు ఇలా అనిపించింది. అలీ భాయ్‌కి ఎలా అనిపిస్తే అలా చెయ్యమంటున్నాను నీలూ!
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
lovedoctorram@sakshi.com