హాయ్ డాక్టర్..! నేను బీటెక్‌లో ఉన్నప్పుడు ఒక అమ్మాయిని లవ్ చేశాను. తను కూడా నన్ను ఇష్టపడింది. కొంతకాలం చాలా హ్యాపీగా ఉన్నాం. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకున్నా. అయితే మేం థర్డ్ ఇయర్‌లో ఉన్నప్పుడు మా ఇద్దరి మధ్య గొడవ జరిగి, ఏడాది పాటు మాట్లాడుకోలేదు. ఆ తర్వాత సారీ చెప్పాను. బట్ తను పట్టించుకోలేదు. చాలా రిక్వెస్ట్ చేశాను. కానీ తను మారలేదు. చివరికి నాకు తెలిసిన విషయమేంటంటే.. తను ఇంకొకరిని లవ్ చేస్తోందట. ఆ విషయం తెలిసి చాలా బాధపడ్డాను. ఎంత మరచిపోవడానికి ప్రయత్నించినా నా వల్ల కావట్లేదు. ఏం చెయ్యాలో చెప్పండి డాక్టర్..? – శ్రీకాంత్
‘సార్... పాపం ఈ యంగ్ బాయ్ మిమ్మల్ని నిజంగా డాక్టర్ అనుకుంటున్నాడు. మీరిచ్చే సలహా సీరియస్‌గా తీసుకుంటాడో ఏమోనని నాకు టెన్షన్ వస్తుంది. ఎందుకైనా మంచిది. మీరు ఆన్సర్ ఇవ్వకుండా తప్పించుకుంటే.. కొంపలు మునగకుండా తప్పుకుంటాం. అయినా వీళ్లేంటి సార్.. మీ వంకర టింకర సమాధానాలు చూశాక కూడా మిమ్మల్ని ఇంత సీరియస్‌గా ఎలా తీసుకుంటున్నారో నాకైతే అర్థమే కావట్లేదు. అయినా ఈ ప్రశ్నకు మీరేం సమాధానం ఇస్తారో నాకు తెలియదా సార్. ఎలాగూ మీరు సమాధానం ఇవ్వకుండా ఉండలేరు. మీరు ఇచ్చిన సమాధానం తను సీరియస్‌గా తీసుకోకుండా ఉండడు. అందుకే నేనే చెప్పేస్తా సార్. ఇదిగో.. గుడ్ బాయ్..! ఆ అమ్మాయికి నువ్వు ప్చ్.. ప్చ్.. ప్చ్..! అది సంగతి!!’
అబ్బబ్బబ్బబ్బా... నీలూ ఏం చెప్పావు..!‘నిజం కాదా సార్..? అమ్మాయి ఇంకొకరిని ఇంకా ఎక్కువగా ఇష్టపడి మనోడిని ప్చ్.. ప్చ్.. ప్చ్.. అని వదిలెయ్యలేదా సార్?’ప్రేమలో ఉన్నప్పుడు గొడవపడితే ప్రేమ గాఢంగా మారాలి. అలాకాకుండా తేలిపోయిందంటే... అమ్మాయి ఎప్పుడూ మనోడితో సీరియస్ కాదని అనిపిస్తుంది. కానీ హార్ట్ అయితే చాలా డీప్‌గా హర్ట్ అయ్యిందిమనోడికి. నా మాట విను బ్రో! లవ్ స్ట్రాంగ్ కానప్పుడు మనం స్ట్రాంగ్ అవ్వాలి. స్మైల్ చేసి ముందుకు నడవాలి. కొత్త జీవితానికి ఊపిరి పోసుకుని చలాకీగా అడుగులు వెయ్యాలి. బాధను నెమరేసుకుంటూ దానిలోని తియ్యదనాన్ని చూయింగ్ గమ్‌లాగా ఎంజాయ్ చెయ్యాలి.‘దున్నపోతులు.. ముందు మింగి, తర్వాత నములుతూ కూర్చుంటాయి అలాగా సార్ బాధను చూయింగ్ చూయింగ్ చెయ్యాల్సింది???’ఆడపిల్లవి నీకేం తెలుసు మగాడి ప్రేమ బాధ ఎలాంటిదో..? నువ్వు జోకులేసుకో.. ఇంకేమైనా చేసుకో..! చూస్తూ ఉండు మనోడు బాధను మెడిసిన్‌గా మార్చుకున్నాక సూపర్ హీరో అయిపోతాడు. ప్చ్.. ప్చ్.. ప్చ్.. అమ్మాయి ఇలాంటి హీరోని పోగొట్టుకున్నందుకు ఎప్పటికైనా షి విల్ రియలైజ్!!
ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
-lovedoctorram@sakshi.com
నన్నడగొద్దు ప్లీజ్
Published Wed, Jun 27 2018 12:42 AM | Last Updated on Wed, Jun 27 2018 12:42 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment