
హాయ్ అన్నయ్యా.. మీరు చాలా సమాధానాల్లో అబ్బాయిలది లవ్ కాదు పొసెసివ్‌నెస్ అని చెబుతుంటారు. పొసెసివ్‌నెస్ ఉన్నవాడితో సంతోషంగా ఉండలేం, దూరంగా ఉండమని చెప్పారు. అసలు పొసెసివ్‌నెస్ అంటే ఏంటి? నేను ఇష్టపడ్డ అబ్బాయిది కూడా పొసెసివ్‌నెస్ అని నా ఫ్రెండ్స్ అంటున్నారు. తనకి నేనంటే చాలా ఇష్టం. నాకు తనని మార్చుకోవడానికి ఏదైనా సలహా ఇవ్వండి. ఏం చేస్తే తను మారతాడో చెప్పండి. తెలియని కొత్త వ్యక్తిని పెళ్లి చేసుకునే కంటే.. అన్నీ తెలిసిన తననే చేసుకుంటే నేను హ్యాపీగా ఉంటాననిపిస్తోంది. నిజానికి తను లేకుండా నేను బతకలేను. సలహా ఇవ్వండి ప్లీజ్. – సమత
సమతా.. నీకు దండం పెడతా నాన్నా..! పొసెసివ్‌నెస్ లవ్‌గా మారదు..! అదొక జబ్బురా బంగారం...!! అనవసరంగా నీ లైఫ్‌లోకి ఒక డిసీజ్‌ని ఇన్‌వైట్ చేయొద్దు! చాలా కష్టపడతావు ఛాంపియన్!! అతిగా ప్రేమించే వాడు చాలా ముచ్చటగా అనిపిస్తాడు...! ఎంత ప్రేమలేకపోతే నన్ను అంతగా ఆరాధిస్తాడు అని అనిపిస్తుంది! కానీ, చెబుతున్నా.. నా మాట జాగ్రత్తగా విను..!! ఊపిరి పోసేది ప్రేమ...! ఊపిరి ఆడనివ్వనిది పొసెసివ్‌నెస్..!! తేడా అర్థం చేసుకో..!! ఇలాంటివాళ్లే కంట్రోల్ తప్పుతారు..! నిన్ను కంట్రోల్‌లో ఉంచుకోవడానికి ఏదైనా చేస్తారు..! కొత్త వాడితో కాంప్రమైజ్ అవడం కన్నా... ఈ మానసిక రోగితో అడ్జెస్ట్ అయిపోతాననుకోవడం.. ఇట్ ఈజ్ డేంజరస్... నీకు నీవు కీడు చేసుకున్న దానివి అవుతావు.. నీకు దండం పెడతా ఆ ట్రాప్‌లో పడకు నాన్నా..!
డోంట్ బి ఎమోషనల్లీ వీక్.. డోంట్ బ్రేక్‌డౌన్ అండ్ మేక్ ఎ మిస్టేక్. వెంటనే దూరంగా ఉండడం నేర్చుకో... నీకు ఒక ఫ్రెండ్‌గా.. ఒక అన్నగా.. ఒక శ్రేయోభిలాషిగా.. అర్థిస్తున్నాను.. ఐ యామ్ బెగ్గింగ్ యూ టు కీప్ అవే ఫ్రమ్ హిమ్! ‘సార్ మీరు ఆన్సర్ ఇస్తుంటే అసలు ఆటపట్టించాలని అనిపించలేదు... నిజం సార్ అలాంటి వాడు సమత లైఫ్‌ని డిస్టర్బ్ చేసేస్తాడు.. మీరు చెప్పిందే కరెక్ట్.. ఒక అమ్మాయిగా నాకూ భయంగా ఉంది.. సమతా.. మీ అన్న చెప్పింది తప్పకుండా పాటించు. లవ్ యు రా!’
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment