
హాయ్ అన్నయ్యా..! నాది అందరితోనూ ఈజీగా కలిసిపోయే మనస్తత్వం. టెన్త్ క్లాస్‌లో నాకొక అబ్బాయి ప్రపోజ్ చేశాడు. తనంటే ఇష్టంతో ఓకే చెప్పాను. ఆ తర్వాత మళ్లీ తను టూ ఇయర్స్ కనిపించలేదు. టూ ఇయర్స్ తర్వాత ఫేస్‌బుక్‌లో చాట్ చేశాడు. తనకి ఒక అమ్మాయి ప్రపోజ్ చేసిందని, ఓకే చేశానుని, కిస్ చేశానని కూడా చెప్పాడు. ఫస్ట్ కోపమొచ్చింది. కానీ మనం ఇష్టపడిన వాళ్లు మనల్ని ఇష్టపడాలనేం లేదుకదా అనుకుని, లైట్ తీసుకున్నా. దాంతో మా ఇద్దరి మధ్య చాలా గ్యాప్ వచ్చింది. రీసెంట్‌గా ఫేస్‌బుక్‌లో నాకో అబ్బాయి పరిచయమయ్యాడు. అభిప్రాయాలు కలిశాయి. నేను అడగకుండానే ‘మన పెళ్లికి మా పేరెంట్స్ ఒప్పుకోరు’ అని చెప్పాడు. కానీ నాకు తనతో ఉంటే లైఫ్ చాలా బాగుంటుందనిపిస్తోంది. అయితే ఇప్పుడు టెన్త్ ఫ్రెండ్ తిరిగి నన్ను కలుసుకుని నువ్వంటే ప్రాణం, ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకుందాం, లేదంటే వెళ్లిపోయి పెళ్లి చేసుకుందాం అంటున్నాడు. నాకు ఫేస్‌బుక్‌లో పరిచయమైన అబ్బాయి మీదే చచ్చేంత ప్రేముంది. పైగా, నా పేరెంట్స్‌ని మోసం చేసి మొదటి అబ్బాయితో వెళ్లాలని కూడా లేదన్నయ్యా. నిజానికి టెన్త్‌లో నాది ప్రేమ కాదు ఆకర్షణ అనిపిస్తోంది. కానీ, తను నన్ను కావాలంటున్నాడు. ఇప్పుడు నేనేం చెయ్యాలి? ప్లీజ్ మంచి సలహా ఇవ్వండి అన్నయ్యా. – సంధ్య
ఒక్క గుద్దు గుద్దు...!!‘ఎవరిని సార్?’ఆ ముద్దు అబ్బాయిని!‘ముద్దు పెడితే గుద్దు గుద్దాలా సార్?’ఎంగిలబ్బాయి మనకెందుకురా అంటున్నా..!‘ఆ అబ్బాయి మంచోడు కాబట్టి చెప్పాడు. ఫేస్‌బుక్ అబ్బాయి ఏం చేసాడో... ఏం చెప్పలేదో మనకెలా తెలుసు సార్??’వీడి ఫేస్‌కి అంత లేదులే.‘ఫేస్‌బుక్ అబ్బాయికి ముద్దు పెట్టే ఫేస్ లేదంటున్నారు. ముద్దు పెట్టుకుంటూ ఆంబోతులా తిరుగుతున్నోడిది.. నమ్మే కేస్ కాదంటున్నారు. మరి ఎవరికి ఓకే చెప్పాలి సార్ మీ ముద్దుల చెల్లెలు?షీ ఈజ్ నాట్ రెడీ ఫర్ ఎ రిలేషన్‌షిప్!!‘అంటే ఈ కన్ఫ్యూజన్‌లో ఎవరికీ ఓకే చెప్పకుండా కొంచెం లైఫ్‌ని అర్థం చేసుకునే దాకా వెయిట్ చెయ్యమంటున్నారు కదా సార్!?!’అబ్బా..! నువ్వు ఎంత ముద్దుగా చెబుతావు నీలాంబరీ!!బరీ!!
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
lovedoctorram@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment