హాయ్ అన్నయ్యా! నేనొక అబ్బాయిని ఆరేళ్లుగా లవ్ చేస్తున్నాను. తను ఇప్పుడు యూఎస్‌లో ఉంటున్నాడు. ఇద్దరం హ్యాపీగానే ఉన్నాం. కానీ ప్రాబ్లమ్ ఏమిటంటే... నేను వాళ్ల ఫ్యామిలీకి అంతగా నచ్చలేదు. మా మతాలు వేరు. ‘మా ఫ్యామిలీ కోసం నువ్వు మారాలి’ అంటున్నాడు. ఇంకా మా విషయం మా ఇంట్లో తెలియదు. తను చాలా మంచివాడు అన్నయ్యా. బట్ ఇప్పుడు యూఎస్ వస్తేనే పెళ్లి చేసుకోవడానికి కుదురుతుందని అంటున్నాడు అన్నయ్యా. నాకు ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. ఏం చెయ్యాలో మీరే చెప్పండి ప్లీజ్. – కీర్తి
మారడానికి, మార్చుకోవడానికి ఇదేమైనా చున్నీనా తల్లీ..!? జీవితం. ఎన్నో ఏళ్లుగా... అసలు నువ్వు పుట్టకముందు నీ తల్లి కడుపులో ఉన్నప్పుడు... ధరించిన అభిమానం తల్లీ!! నువ్వు అన్నది ఒక మనిషి కాదు.. ఒక ఫిలాసఫీ.. ఒక జీవన విధానం.. ఒక నమ్మకం.. ఎన్నో ఏళ్లు మన ఇంట్లో వ్యవస్థ మనకు ఉగ్గు పాలతో పట్టిన మన ఉనికి... మారకూడదు.. ఎప్పుడూ ఇంకొకరి కోసం మారకూడదు. నువ్వు ఎలా ఉన్నావో అలా నచ్చే కదా నిన్ను ఇష్టపడింది. నువ్వు మారిన మరుక్షణం నీ మీద ప్రేమ తగ్గిపోతుంది. నిజానికి రిలేషన్‌షిప్‌లో నువ్వు తగ్గిపోతావు.‘సార్ ఇంత ఉపన్యాసం యూత్‌కి అవసరమా సార్? వాళ్లకు తలపోటు వస్తుంది. ఏదో పుస్తకంలో నీతుల్లాగా చెప్పుకుంటూనే పోతున్నారు. అన్నీ బౌన్సర్లలాగ నెత్తి మీద నుంచి వెళ్లిపోతున్నాయి. కొంచెం సింపుల్‌గా చెప్పండి ప్లీజ్!’కీర్తీ! నువ్వు నమ్మిన దాన్ని వదులుకున్న రోజు.. అది ఏదేమైనా కావచ్చు... నీలో ఒక భాగం కట్ అయిపోయినట్టే...! నువ్వు ఫుల్‌గా అనిపించవు. ప్రేమించుకున్నది మీరిద్దరూ. పెళ్లి చేసుకోవలసింది మీరిద్దరూ. వాడికి ప్రేమ ఉంటే చేసుకుంటాడు. వాడికి డౌట్స్ ఉంటే నువ్వే చేసుకోవద్దు. బీ స్ట్రాంగ్!!
lovedoctorram@sakshi.com
ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
నన్నడగొద్దు ప్లీజ్
Published Thu, Feb 21 2019 12:29 AM | Last Updated on Thu, Feb 21 2019 12:29 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment