
‘‘ఏమండీ.. చూడండి.. చూడండి.. అబ్బాయి నడుస్తున్నాడు..అచ్చం మీలాగే ఎంత ఠీవిగా నడుస్తున్నాడో..’’ఏ తల్లి అయినా బిడ్డ అడుగులు వేస్తుంటే ముచ్చటగా చూస్తుంది.నడకలో.. నడతలో పోలికలు వెతుక్కుంటూ మురిసిపోతుంది.అలా మనిషి నడుస్తాడు.. నాన్న కోసం, అమ్మ కోసం, కుటుంబం కోసం,తన కోసం నడుస్తాడు.కానీ కొందరు తమ కోసం కాకుండా సమాజమనే పెద్ద కుటుంబం కోసం నడుస్తారు.ఆ పెద్ద కుటుంబాన్ని నిలబెట్టడానికి, మళ్లీ నడిపించడానికి నడుస్తారు.
దగాల పాలనలో దిగాలుపడి..యుగాల పీడనకు సొమ్మసిల్లి..బతుకు బాధల బంధనంలో పడి ఉన్న.. బడుగు జీవులను భుజానికెత్తుకొని నడిచే నడక అది.అన్యాయాలకు, అక్రమాలకు బలవుతున్న అసహాయులను నడిపించే నడక అది.నిర్జీవంగా పడి ఉన్న ఆశలను సైతం.. ఆ నడక సవ్వడి మళ్లీ గుండె చప్పుడుగా మారుస్తుంది.అబద్ధాలు, మోసాలు, కుయుక్తుల వ్యవస్థపై తాండవం చేస్తుంది ఆ నడక. ఆ పాదం పాట పాడుకునే ఊళ్లను చూసి ఓర్వలేక..పునర్జన్మించిన జనస్థైర్యాన్ని చూడలేక..కాకులు, గద్దలు వాలుతాయి..ఎక్కిరిస్తాయి.. అరుస్తాయి.. పొడుస్తాయి..తోవలో తుమ్మ ముళ్లు వేస్తాయి.
కానీ.. ప్రతి ఊరినీ ‘మహా’ రాజ్యంగా చెయ్యాలని..ప్రతి ఊరిబిడ్డలో మళ్లీ రాజన్నను చూడాలనే పాదానికి..ఆశయం ఉంటుంది కానీ సంశయం ఉండదు.పరుగు ఉంటుంది కానీ బెరుకు ఉండదు.నడత ఉంటుంది కానీ బెదురు ఉండదు.అడుగు ఉంటుంది కానీ మడమ తిరగదు.యాత్రలో గమ్యం కనబడుతుంది కానీ కష్టం కనబడదు.పాదం కింద ముళ్లు పడతాయి కానీ ముళ్లమీదినడక అనిపించదు.గుచ్చుకుంటుంది కానీ నొప్పి తెలియదు.రక్తం చిమ్ముతుంది కానీ కసి తరగదు. ధైర్యం వెరవదు. దీక్ష చెదరదు. సంకల్పం సడలదు.
Comments
Please login to add a commentAdd a comment