
హాయ్ అన్నయ్యా! నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్. నేను ఒక అబ్బాయిని సిక్స్ ఇయర్స్ నుంచి లవ్ చేశాను కానీ, ఇద్దరి నేపథ్యాలు వేరు. వాళ్ల ఇంట్లో వాళ్లకి నేను అసలు ఇష్టంలేదు. దాంతో నన్ను మరిచిపో అని చెప్పడం స్టార్ట్ చేశాడు. ఈ మధ్యలో నాకు ఇద్దరు ఫ్రెండ్స్ పరిచయం అయ్యారు. వాళ్లు కూడా నన్ను ఇష్టపడుతున్నారట. నేను నో చెబితే చచ్చిపోతాం అని బెదిరిస్తున్నారు. నాకు భయం వేసి వాళ్లతో తప్పక మాట్లాడాల్సి వస్తోంది. కానీ నాకు ఇవన్నీ వదిలేసి హ్యాపీగా అమ్మానాన్న చూసిన వాళ్లనే చేసుకోవాలనుంది. ఇదే విషయం వాళ్లకి చెబితే.. ఏం చేస్తారో, ఏం చేసుకుంటారోనని భయంగా ఉంది. అన్నయ్యా.. ఈ లైఫ్ నాకు చాలా అనీజీగా అనిపిస్తోంది. వాళ్లకి అసలు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. మీరే ఏదో ఒక సలహా ఇవ్వండి అన్నయ్యా ప్లీజ్.
– అనన్య
చెప్పాల్సింది వాళ్లకు కాదు!!‘అబ్బాయిలకు చెప్పండి ఏమి చెప్పాలో.. అని అడుగుతుంటే, చెప్పనంటారేంటి సార్??’చెప్పాల్సింది వాళ్లకు కాదు...!!‘సార్... అమ్మాయి అడిగింది కాకుండా మీకిష్టమైంది చెబుతానంటే ఎలా సార్??’నా కాలమ్ నా ఇష్టం...!‘కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు సార్!! కాలం మారుతుంది! మారుద్ది!! టైమ్ విల్ ఛేంజ్ సార్! ఇతరులకు కూడా టైమ్ వస్తుంది!! టైమ్‌ని ఎవరు పట్టుకుని కూర్చోలేరు సార్!! ప్రతీ సెకండ్ టైమ్ పారిపోతూనే ఉంటుంది!! దేనికైనా అడ్డుగోడ వేయొచ్చు కానీ, టైమ్‌కి డామ్ కట్టలేం సార్! టైమ్ అనే అల కొట్టిందంటే.. సామ్రాజ్యాలే కూలిపోతాయి!! కోటలు కూడా తుడుచుకుపోతాయి!! టైమ్ కన్నెర్ర చేస్తే......’నీలాంబరీ...! ఏమైంది అలా ఊగిపోతున్నావ్...???‘కాలం నాదంటారా సార్..??? ఎంత టెక్కు సార్ మీకు...? టైమ్ కన్నెర్ర చేస్తే.. అంతా చిందర వందరే సార్..! టైమ్ అనే సింహం.. జూలు విదిలిస్తే అంతా జులుమే సార్!’నీలాంబరీ.. ఆపు.. ఆపు.. ఆపు..!! నేనేమన్నాను నీలాంబరీ..??? లవ్ డాక్టర్ కాలమ్ నాది, నా ఇష్టమైంది రాస్తా అంటే.. కాలమ్ అంటే టైమ్ అనుకుని ఏం బాదుడు బాదావ్?? ఏంటా ఉద్రేకం? ఏంటా తిక్కా?
ఏంటా ఊగిపోవడం.......????‘సారీ సార్! నేను వేరే కాలం అనుకుని కొంచెం తొక్క మీద కాలు వేశాను. రయ్..రయ్.. మీరు ప్రొసీడ్ సార్!’ చెప్పాల్సింది అబ్బాయిలకు కాదు అనన్య! చెప్పాల్సింది నీకు..!! వాళ్ల తలకాయ.. నిన్ను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారు! నువ్వు ఎమోషనల్‌గా ఉంటావని తెలిసి.. ఒక సారి లవ్‌లో దెబ్బతిన్నావని తెలిసీ.. ఆడుకుంటున్నారు. నీకేం కావాలో నువ్వు అదే చెయ్యి. వాడి చెయ్యి పట్టుకుని, వీడి చెయ్యి పట్టుకుని.. వాళ్లందరినీ నడిపించాల్సిన అవసరం నీకు లేదు. నువ్వు వాళ్లను జాగ్రత్తగా హైవే మీద నడిపిద్దామనుకున్నా ఈ ప్రయత్నంలో.. నువ్వు నీ గమ్యాన్ని పోగొట్టుకుంటావు!! స్టాప్ థింకింగ్ వాళ్ల గురించి!! హ్యాపీగా నీకు నచ్చింది చెయ్యి.. శభాష్ బంగారం!!
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment