హాయ్ సార్! ఎలా ఉన్నారు? నేను మాత్రం హ్యాపీగా లేను. తన పేరు ప్రశాంతి. తను నాతో చాలా క్లోజ్‌గా ఉండేది. ఒక రోజు తనే ప్రపోజ్ చెయ్యమంటే.. నేను ప్రపోజ్ చేశాను. తీరా ప్రపోజ్ చేశాక సరదాగా అన్నానంది. ఆ తర్వాత ఫ్రెండ్లీగానే ఉన్నాం. అప్పుడప్పుడు లవ్ సింబల్స్ పెట్టేది. ఈ మధ్య తను వేరే అబ్బాయిని లవ్ చేస్తున్నానంటోంది. ఆ అబ్బాయి తనని పెళ్లి చేసుకుంటే నేను హ్యాపీనే. కానీ వాడు మోసం చేసే రకం. అందుకే ప్రశాంతి పరిస్థితి ఏమవుతుందోనని భయంగా ఉంది. తనకి చెబుతున్నా అర్థం చేసుకోవడం లేదు. మీరే ఏదైనా సలహా ఇవ్వండి సార్. – కృష్ణ
ఇంకో అబ్బాయిని చూసిపెట్టు కృష్ణా!!‘అదేంటి సార్ అంత మాట అనేశారు?’నీలూ! ఈ అబ్బాయి మంచోడు కాదు, చీటింగ్ టైప్ అని చెబుతున్నాడు కదా..! అందుకే ఒక మంచివాడిని చూడమని చెబుతున్నాను..!!‘ఎట్లా కనపడుతున్నాడు సార్ మీకు కృష్ణ????’పేపర్లో, టీవీల్లో, ఫేస్‌బుక్‌లో అడ్వర్టయిజ్‌మెంట్లు వేసేవాడిలా కనబడుతున్నాడు నీలూ!!‘ఎలాంటి అడ్వర్టయిజ్‌మెంట్లు సార్????’గుణవతి, శీలవతి, భాగ్యవతి, ‘అంద’వతి, ప్రశాంతి.. ఒక మంచి లవర్ అండ్ మొగుడు కావలెను! అని అడ్వర్టయిజ్‌మెంట్ వేసేవాడిలా కనబడుతున్నాడు.
‘అయ్యో.. పాపం కృష్ణ కంటే మంచివాడు ఎక్కడ దొరుకుతాడు సార్ ప్రశాంతికి???’అది చెప్పలేకే.. ఉన్నవాడు మంచివాడు కాదని మొర పెట్టుకుంటున్నాడు కదా నీలూ!‘అయితే కృష్ణా..! అర్జెంట్‌గా వెళ్లి అమ్మాయికి నువ్వే కరెక్ట్’ అని గట్టిగా చెప్పు. ఒప్పుకోకపోతే ఈ జన్మలో తనకి కృష్ణలాంటి లవర్ దొరకడని చెప్పి.. అబౌటర్న్ కొట్టి సినిమా హీరోలా దుమ్ము లేపుతూ వెళ్లిపో కృష్ణా!!’
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
నన్నడగొద్దు ప్లీజ్
Published Wed, Oct 17 2018 12:51 AM | Last Updated on Wed, Oct 17 2018 12:51 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment