
హాయ్ అన్నయ్యా!! నేనొక అబ్బాయిని ఫోర్ ఇయర్స్ నుంచి లవ్ చేస్తున్నాను. తను కూడా నన్ను ప్రేమించాడు. ఎందుకో.. తనకి జాబ్ వచ్చాక చాలా మారిపోయాడు. సడన్‌గా ఒకరోజు ఫోన్ చేసి, ‘నేను వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నాను’ అన్నాడు. కొన్ని రోజులకి మళ్లీ ఫోన్ చేసి, ‘మాకు బ్రేకప్ అయ్యింది’ అని చెప్పి, నాతో మాట్లాడటం మొదలుపెట్టాడు. మళ్లీ కొన్ని రోజులకి ఇంకో అమ్మాయికి ప్రపోజ్ చేశాడు. తను రిజెక్ట్ చేసిందట. ఇప్పుడు ఒక పెళ్లైన అమ్మాయితో ఫ్రెండ్‌షిప్ అంటున్నాడు. తన కోసం మంచి జాబ్ ఆఫర్ వదిలేసుకున్నాడు. నాతో ఇంకా మాట్లాడుతున్నాడు కానీ ఎప్పుడూ తిడుతూనే ఉంటాడు. నేనంటే ఇష్టం లేనప్పుడు ఇంకా ఎందుకు నాతో మాట్లాడుతున్నావని అడిగితే... ‘నువ్వు ఏమైపోతావోనని జాలితో మాట్లాడుతున్నాను’ అంటున్నాడు. తన ప్రవర్తన ఏంటో నాకు అర్థం కావట్లేదన్నయ్యా. తనతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. దయచేసి మంచి సలహా ఇవ్వండి ప్లీజ్. – గీత
గీతా.. తియ్యి వాడి తాట..!వాడు తిరుగుతాడు ఎవ్రీ పేట..!లవ్‌ని అనుకుంటున్నాడు ఒక తోట..!ప్రతి ఫ్లవర్‌కీ వేస్తున్నాడు పీట..!‘ఇక్కడిదాకా అర్థమయ్యింది సార్. కానీ ఈ ‘పీట’ అంటే ఏంటి సార్?’
ప్రతి అమ్మాయికీ అదే చెబుతున్నాడు కదా నీలూ..!!‘ఓ.. ఓహో.. ఓహోహో.. పెళ్లి పీట వేస్తానంటున్నాడు కదా సార్?’అబ్బబ్బబ్బా... ఎంత ఫాస్ట్‌గా క్యాచ్ చేసేస్తావు నీలూ..!?!‘గీతను ట్రాక్‌లో పెట్టుకుని, ఊరంతా ప్రపోజల్స్ పంచుతున్న సుంఠ కదా సార్ వాడు?’గీత అమాయకంగా ఒక మోసగాడితో అనవసరంగా కనెక్షన్ పెట్టుకుని, ఇంకా వాడు మాట్లాడితే చాలన్నట్టు ఉంది. ఏమైంది నా బంగారు చెల్లికి.. వేర్ ఈజ్ హర్ సెల్ఫ్ వర్త్?‘అవును సార్! ఈ అమ్మాయిని బ్యాక్ అప్‌లో పెట్టుకుని, వెర్రి వేషాలు వేస్తున్నాడు. నెక్ట్స్ టైమ్ ఫోన్ చేస్తే... వాడు తిరుగుతాడు ఎవ్రీ పేట..!లవ్‌ని అనుకుంటున్నాడు ఒక తోట..!ప్రతి ఫ్లవర్‌కీ వేస్తున్నాడు పీట..!గీతా.. తియ్యి వాడి తాట.. అని నేనే చెబుతాను సార్!!’
- lovedoctorram@sakshi.com