
హాయ్ అన్నయ్యా..! నేను టెన్త్ అయిపోయాక ఒక అమ్మాయిని లవ్ చేశాను. ఇప్పుడు నా ఇంజనీరింగ్ కూడా పూర్తి చేశాను. కానీ తను నా లవ్‌ని ఇంకా యాక్సెప్ట్ చెయ్యలేదు. ఇంకో విషయం ఏంటంటే తను నాకంటే వన్ ఇయర్ సీనియర్. లాస్ట్ సిక్స్ మంత్స్ నుంచి తనకు రెగ్యులర్‌గా మెసేజ్ చేస్తున్నాను. తను మాత్రం ఇంకా రిప్లై ఇవ్వడం లేదు. తనంటే నాకు చాలా ఇష్టం అన్నయ్యా. మీరు ఏదైనా çసజెషన్ ఇవ్వండి ప్లీజ్. – రోహిత్
ఏజ్ ఏదైతే ఏంటి?‘అలా ఎలా కుదురుద్ది సార్...?’లవ్వుకు ఏజ్ ఏంటి? గేజ్ ఉండాలి గానీ...‘అదేంటి సార్ అలా అనేశారు..? అల్మారాలు చేసే రేకులకు గేజ్ ఉంటుంది.. ఎంత ఎక్కువ గేజు ఉంటే అంత బలమైన అల్మారా తయారవుతుంది కదా సార్?’భలే కనిపెట్టావు నీలూ..!‘ఆ గేజుకి రోహిత్ లవ్ చేసే అమ్మాయి ఏజ్‌కి ఏంటి సార్ కనెక్షన్?’అమ్మాయి ఏజ్ కాదు ఆమె హృదయం చుట్టూ ఉన్న గేజు కూడా ఎక్కువే. తొందరగా మనోడి ప్రేమ ఆ బలమైన రేకును దాటి వెళ్లలేకపోయింది.‘అంటే అమ్మాయిది ఇనుము లాంటి హృదయమా సార్?’రోజులు బాగోలేవు.. మగాళ్లను నమ్మేటట్టు లేదు. అమ్మాయికి నమ్మకం కుదిరినప్పుడు...‘ఇనుములో హృదయం మొలిచెనే.. అని రోబో సినిమా పాట పాడుకోవచ్చు కదా సార్?’ అని నవ్వింది నీలాంబరి.
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
lovedoctorram@sakshi.com