![Love doctor returns - Sakshi](/styles/webp/s3/article_images/2018/05/31/Untitled-1.jpg.webp?itok=gjRotBG6)
హలో అన్నయ్యా..! నేనొక అబ్బాయిని ఫోర్ ఇయర్స్‌గా లవ్ చేస్తున్నా. తనూ నన్ను ఇష్టపడ్డాడు. ఇద్దరం బాగా ఉండేవాళ్లం. ఉన్నట్లుండి బ్రేకప్ అనేశాడు. ఎందుకని అడిగితే... ‘నా గోల్స్ (లక్ష్యాలు) గుర్తుకొచ్చాయ్’ అన్నాడు. ఆ కోపంతో, వాడి బెస్ట్ ఫ్రెండ్ నాకు ప్రపోజ్ చేస్తే, ఓకే చెప్పాను. దాంతో ఆ అబ్బాయి మళ్లీ లవ్ అంటున్నాడు. ఏం చెయ్యాలో చెప్తారా? ప్లీజ్ అన్నయ్యా! – జాను
‘ఏంటి సార్..? బంతిని గోడకు కొట్టి పట్టుకుంటున్నారు?’కొడితే అటేపోవాలి కానీ, వెనక్కు ఎందుకు వస్తోందా...??? అని చూస్తున్నా నీలూ!‘సార్ జోక్ చెయ్యకండి. గోడకు కొడితే.. ఎలాపోతుంది సార్?? వస్తుంది కానీ...!!’వై? ఎందుకు? క్యూమ్...???????‘బంతి సాఫ్ట్‌గా ఉంటుంది కదా సార్!!’అయితే????‘గోడ స్ట్రాంగ్‌గా ఉంటుంది కదా సార్!!’సో..????‘సాఫ్ట్‌గా ఉన్న బంతి, స్ట్రాంగ్‌గా ఉన్న గోడను పగల కొట్టి ముందుకు పోలేదు కదా సార్.. అందుకే వెనక్కి వస్తోంది సార్!!’జాను గోడలాగ స్ట్రాంగ్ నీలాంబరి!!‘అబ్బాయిలంతా బంతులా సార్?’మొదటివాడు ఖచ్చితంగా బంతే...!స్ట్రాంగ్‌గా ఉన్న జానుని లవ్‌తో పగలగొడదాం అనుకున్నాడు!పొరబాటున నువ్వెంతా, నీ లవ్వెంతా అని బంతిని పంక్చర్ చేసేసింది.జానుతో గేమ్స్ వర్కౌట్ కాదని తెలిసి.. ఇప్పుడు కాళ్ల బేరానికి వచ్చాడు.‘మరి ఇప్పుడు జాను ఏం చెయ్యాలి సార్???’గోడలా ఉండాలి. పట్టించుకోకూడదు. వాడి నాటకపు ప్రేమను ఒప్పుకోకూడదు..!!వాడు కాదన్నాడని, తాను బంతిలా ఇంకొకడికి చులకన కాకూడదు..!!‘కరెక్ట్ సార్.. గోడ గోడలాగే ఉండాలి స్ట్రాంగ్‌గా. బంతిలా సాఫ్ట్ అవ్వకూడదు.!!’
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
Comments
Please login to add a commentAdd a comment