
హాయ్ సార్..! నేను ఓ ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా పని చేస్తున్నాను. నా కొలీగ్‌ని లవ్ చేస్తున్నాను. ఆ విషయం ఆమెకి చెప్పలేదు. చెబితే ఎలా రియాక్ట్ అవుతుందోనని భయమేసి చెప్పలేకపోతున్నాను. నేను లవ్ చేయడం మొదలుపెట్టి ఒన్ వీక్ అయింది. నేను గ్రూప్స్‌కి ప్రిపేర్ అవుతున్నాను. చదువుపై దృష్టి పెట్టలేకపోతున్నా. సార్..! నాదో స్మాల్ డౌట్.. ఇది లవ్వా? లేక అట్రాక్షనా? సలహా ఇవ్వండి ప్లీజ్.
– సురేంద్ర
ఒన్ వీక్ అంటే అట్రాక్షన్ అనే కన్ఫర్మ్ చేసుకో...!‘సార్.... ఎన్ని వీక్స్ అయితే లవ్ అని కన్ఫర్మ్ చేసుకోవాలి సార్?’లవ్ అని కన్ఫర్మ్ అవడానికి ఒన్ సెకండ్ చాలు...!‘సార్ మళ్లీ... సమ్మర్ ఎఫెక్ట్‌తో ఆన్సర్లు తికమకగా చెబుతున్నారు’తిక లేదు... మక లేదు.. తలా లేదు.. తోకా లేదు..‘సార్ ఇంకా కన్ఫ్యూజ్ చేసేస్తున్నారు’ఏం లేదు నీలూ! ఇంకా లవ్ అని అనిపించలేదంటే అది లవ్ కాదు. ఒన్ వీక్ అయినా హండ్రెడ్ వీక్స్ అయినా అది అట్రాక్షన్ మాత్రమే. లవ్ అంటే ఇన్‌స్టెంట్ కాఫీ లాంటిది.‘ఫిల్టర్ కాఫీలాగా... లవ్ స్లోగా తయారై ఇంకా స్లోగా హార్ట్‌కి ఎక్కితే... రుచిగా ఉండదా సార్?
ఇన్‌స్టెంట్ కాఫీలాగా లవ్ జివ్వుమనదా సార్?’ఫిల్టర్ కాఫీ లాంటి లవ్ కూడా జివ్వుమంటుంది నీలూ.. కానీ లవ్ ఇన్‌స్టెంట్‌గా జరిగిపోతుంది. దానికి వీకులు, మంతులు, ఇయర్లు అంటూ వెయిట్ చేస్తే ఎక్కేది కాదు అని చెబుతున్నా నీలూ..‘పొండి సార్ కొంతమందికి స్లో... స్లోగా లవ్ ఎక్కుతుంది కదా సార్?’ టైమ్ పట్టచ్చు కానీ ఎక్కినప్పుడు మాత్రం లవ్వు జివ్వుమనే ఎక్కుతుంది. సురేంద్రది లవ్ కాదు. కేస్ క్లోజ్డ్!్
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
లవ్ డాక్టర్, సాక్షి ఫ్యామిలీ, సాక్షి టవర్స్, రోడ్ నంబరు 1, బంజారాహిల్స్, హైదరాబాద్–34. lovedoctorram@sakshi.com