
హాయ్ సార్..! నేను ఏ అమ్మాయిని లవ్ చేసినా ‘ఫ్రెండ్’ అని సైడ్ అయిపోతున్నారు. కొందరు చాలా క్లోజ్ అవుతున్నారు. ఎంతగా అంటే చూసేవాళ్లంతా లవర్స్ అనుకునేంతగా క్లోజ్ అవుతున్నారు. కానీ ‘ఫ్రెండ్’ అంటున్నారు. నేను ఇప్పటికే ఇద్దరిని లవ్ చేశాను. ఫస్ట్ ఒక అమ్మాయిని త్రీ ఇయర్స్ లవ్ చేశాను కానీ, తను వెళ్లిపోయింది. ప్రస్తుతం ఇంకో అమ్మాయిని లవ్ చేస్తున్నాను. బట్ తనేమో ‘నాకు లవ్ అంటే గిట్టదు, ఫ్రెండ్స్‌లా అయితే ఉందాం’ అంటోంది. నా వల్ల కావడం లేదు. లోపల ఒకలా బయట ఒకలా ఎలా నటిస్తూ ఉండాలి? అలా నావల్ల కావట్లేదు. తనని మరిచిపోలేకపోతున్నా. స్టడీస్‌పై దృష్టి పెట్టలేకపోతున్నా. ప్లీజ్ సార్ నాకో మంచి సలహా ఇవ్వండి.– – అనుదీప్
ఫ్రెండ్‌గా ఉండటం కూడా సూపర్ బ్రదర్!‘ఏంటి సార్ అనుదీప్ లైఫ్ అంతేనా?’ఏమైంది బ్రో జీవితానికి??‘లవ్వు జివ్వు లేకుండా అలా..?’అలా అంటే???‘అంటే మ్యారేజ్ లేకుండా ఇలా... అని సార్!’ఇలా అంటే అలా... అలా అంటే ఇలా... ఎలా నీలూ..?????‘ఏంటి సార్ ఈ తికమక మాటలు..? అక్కడ అనుదీప్ లైఫ్‌లో.. అణువంత లవ్‌దీపం వెలగడం లేదుసార్!’అంతా ఒక పరీక్ష నీలూ!‘ఏంటి సార్ ప్రేమించినప్పుడల్లా తెడ్డు చూపించడం కూడా ఎగ్జామేనా సార్?’తెడ్డు చూపించకపోతే... ప్రేమగుడ్డు పెడతారా నీలూ?‘మరి ఎలా సార్ అనుదీప్ లవ్‌లైఫ్????’అమ్మాయి ప్రేమను పట్టుకోవడం గొప్ప కాదు నీలూ!‘మరి ఏంటి సార్ గొప్పా?!!?’ప్రేమించే అమ్మాయిని పట్టుకోవడం గ్రేట్! ‘అలాంటి అమ్మాయి ఎక్కడ దొరుకుతుంది సార్?’టైమ్ వచ్చినప్పుడు పుటుక్కున ఒడిలో పడుతుంది నీలూ!! నడ్డి విరుగుద్దేమో సార్?’ అని నవ్వింది నీలాంబరి!
- ప్రియదర్శిని రామ్ లవ్ డాక్టర్
lovedoctorram@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment