ప్రేమలో ఎన్నిసార్లు ఫెయిలయ్యానో? | I Have Had A Lot Of Love Failures: Raai Laxmi! | Sakshi
Sakshi News home page

ప్రేమలో ఎన్నిసార్లు ఫెయిలయ్యానో?

Published Thu, Nov 23 2017 5:32 AM | Last Updated on Thu, Nov 23 2017 5:32 AM

I Have Had A Lot Of Love Failures: Raai Laxmi! - Sakshi

తమిళసినిమా: నేను ప్రేమలో ఎన్నిసార్లు ఫెయిలయ్యానో తెలుసా? అంటోంది నటి రాయ్‌లక్ష్మి. సంచలనాలకు కేంద్రబిందువుగా ముద్ర పడిన ఈ బహుభాషా నటి తరచూ ఏదో ఇక వివాదాస్పద వ్యాఖ్యలతో కలకలం పుట్టిస్తూనే ఉంటుంది. ఆ మధ్య క్రికెట్‌ క్రీడాకారుడు ధోనీతో డేటింగ్‌ అంటూ రాయ్‌లక్ష్మి గురించి హాట్‌ హాట్‌ ప్రచారం జరిగింది. తాజాగా హిందీ చిత్రం జూలీ–2 చిత్ర ట్రైలర్‌లో మోతాదే మించిన అందాలతో మరో సారి వార్తలో నానుతోంది. ఇటీవల ఈ అమ్మడు ఇచ్చిన భేటీ చూద్దాం. జూలీ–2 చిత్రంలో తాను గ్లామరస్‌గా నటించాననే ప్రచారం జరుగుతోందన్నారు.

చిత్ర ట్రైలర్‌ను చూసిన వారు అలా అనుకోవడంలో తప్పులేదని, అయితే చిత్రం పూర్తిగా చూస్తే తన పాత్రను, నటననూ మీరే అయ్యో పాపం అనుకుంటారని అంది. నాన్న చనిపోతాడు. అమ్మ రెండవ పెళ్లి చేసుకుంటుంది.అమ్మ రెండో భర్త తనను బయటకి వెళ్లి సంపాదించకురా అని తరిమేస్తాడని చెప్పింది. అలా ఎంతో కష్టపడి పోరాడి నటిగా నిలదొక్కుకుంటానని చెప్పింది. సినీరంగంలో ఇటీవల అత్యాచారాల గురించి చాలా మంది హీరోయిన్లు బహిరంగంగా వెల్లడిస్తున్నారని అయితే తనకలాంటి అనుభవం ఎదురు కాలేదని చెప్పింది.

తనను దర్శకుడు ఆర్‌వీ.ఉదయకుమార్‌ కర్క కచడర చిత్రం ద్వారా కోలీవుడ్‌కు హీరోయిన్‌గా పరిచయం చేశారని, ఆ తరువాత అవకాశాలు లేక  నాలుగేళ్లు పోరాడానని చెప్పింది. ఆ సమయంలో తనకు లైంగిక సంబంధం గురించి నర్మగర్భంగా అర్థంమైందని చెప్పింది.అనుసరించిపోవాలని కొందరు చెప్పారంది. అలా చేస్తే తానిప్పుడు సూపర్‌ హీరోయిన్‌ అయ్యేదానినని అంది. అప్పట్లో తనకు తమిళ భాషలో ఒక్క పదం కూడా తెలిసేది కాదని, తనగురించి ఎవరెవరో తప్పుతప్పుగా ప్రచారం చేసేవారని చెప్పింది.

ఇక ప్రేమలో తాను ఐదుసార్లు ఓడిపోయానని తెలిపింది. అలా ఓడిపోయిన ప్రతిసారి గదిలో కూర్చుని ఏడ్చేదానిని అంది. మగవారిలో చాలామంది మంచి వాళ్లు, కొందరు చెడ్డవాళ్లు ఉన్నారని చెప్పింది.నటుడు ఆర్య తనకు చాలా కాలంగా మంచి స్నేహితుడని చెప్పింది. ఇంకా చెప్పాలంటే తను ఒక స్నేహితుడు మాత్రమేనని అంది. తనకు రాజకీయాలు తెలియవని, అందువల్ల రాజకీయరంగంలోకి వచ్చే ఆలోచనే లేదని రాయ్‌లక్ష్మీ స్పష్టం చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement