Raai Lakshmi Injured: Rai Laxmi Lightly Injured While Shooting Action Sequence In Hyderabad - Sakshi
Sakshi News home page

యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తుండగా ప్రమాదం

Published Mon, Mar 22 2021 4:05 PM | Last Updated on Mon, Mar 22 2021 4:34 PM

Actress Raai Lakshmi Got Injured While Shooting Action Sequence - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : అర్థరాత్రి షూటింగ్‌ చేస్తుండగా అనుకోకుండా తలెత్తిన ప్రమాదంలో నటి రాయ్ లక్ష్మి గాయపడ్డారు. వివరాల ప్రకారం..హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లో జరిగిన సినిమా షూటింగ్‌ చేస్తుండగా ప్రమాదం తలెత్తింది. ఓ యాక్షన్‌ సీన్‌ చిత్రీకరిస్తుండగా, నటి  రాయ్ లక్ష్మి ఒక్కసారిగా కిందపడిపోయారు. దోంతో ఆమె మోకాలికి గాయమైంది. దీంతో వెంటనే స్పందించిన చిత్రయూనిట్ షూటింగ్‌ను నిలిపివేసి, హీరోయిన్‌ రాయ్ లక్ష్మీని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.

షూటింగ్ సమయంలో ప్రమాదం జరిగిందని పేర్కొంటూ నటి రాయ్ లక్ష్మి..దానికి సంబంధించిన ఫోటోలను నటి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. దీంతో ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. గెట్‌ వెల్‌ సూన్‌ మేడమ్‌ అంటూ పలువురు నెటిజన్లు ట్వీట్‌ చేస్తున్నారు. కాగా ప్రస్తుతం ఆమె ఆరోగ్యం మెరుగ్గానే ఉందని వైద్యులు తెలిపారు. శ్రీకాంత్ హీరోగా నటించిన కాంచనమాల కేబుల్ టీవీ సినిమాతో రాయ్ లక్ష్మి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే హీరోయిన్‌గా అంతగా కలిసిరాకపోవడంతో పలు ఐటెం సాంగ్స్‌లో మెరుస్తుంది ఈ భామ. బలుపు, ఖైదీ నెంబర్ 150 మూవీల్లోనూ రాయ్ లక్ష్మి చేసిన ఐటెం సాంగ్స్ ఆమెకు మంచి గుర్తింపు తీసుకొచ్చాయి. 

చదవండి : భార్యకు ఖరీదైన‌ గిఫ్టిచ్చిన ఎన్టీఆర్!‌
ఆ టైంలో డిప్రెషన్‌కు లోనయ్యా : హీరోయిన్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement