Varun Sandesh Gets Leg Injured At Constable Movie Fight Scene Shooting, Details Inside - Sakshi
Sakshi News home page

Varun Sandesh Leg Injury: ఫైట్‌ సీన్‌లో ప్రమాదం.. వరుణ్ సందేశ్‌కు తీవ్రగాయాలు..!

Published Wed, Jun 21 2023 9:27 PM | Last Updated on Thu, Jun 22 2023 11:27 AM

Varun Sandesh Gets Injured Leg At Constable Movie Fight Scene - Sakshi

టాలీవుడ్ యంగ్  హీరో వరుణ్ సందేశ్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ప్రస్తుతం కానిస్టేబుల్ అనే చిత్రంలో వరుణ్ సందేశ్ నటిస్తున్నారు.  ఈ మూవీలోని ఓ ఫైట్ సీన్ చిత్రీకరిస్తుండగా..  హీరో  వరుణ్ సందేశ్ కాలికి బలమైన గాయమైంది. దీంతో వెంటనే వరుణ్ సందేశ్ కాలికి చికిత్స అందించారు. అనంతరం డాక్టర్లు మూడు వారాలు విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచించారు.

(ఇది చదవండి: ఆదిపురుష్ టీం బంపరాఫర్.. భారీగా టికెట్ల ధరలు తగ్గింపు! )

ఊహించని సంఘటనతో  సినిమా షూటింగ్ అర్ధాంతరంగా వాయిదా వేయాల్సి వచ్చిందని చిత్ర దర్శకుడు ఆర్యన్ శుభాన్ అన్నారు. పూర్తిగా పల్లెటూరి వాతావరణంలో నిర్మిస్తున్న ఈ చిత్రం ఒక కానిస్టేబుల్ జీవిత కథ చుట్టూ తిరుగుతుందని ఆయన తెలిపారు. ఇప్పటికే 40 శాతం పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండో షెడ్యూల్ హీరో వరుణ్ సందేశ్ కోలుకున్న తర్వాత మొదలవుతుందని నిర్మాత బలగం జగదీష్ తెలియజేశారు. కాగా.. జాగృతి మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ మూవీని నిర్మిస్తున్నారు.

(ఇది చదవండి: ఆదిపురుష్‌ సినిమా చూడలేదు, నా విజ్ఞప్తి మాత్రం ఇదే!: ‘రామాయణ్‌’ సీత)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement