
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌కు గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన 'బడే మియాన్ చోటే మియాన్'చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం స్కాట్లాండ్‌లో జరుగుతోంది. ఫుల్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు. అయితే షూటింగ్ జరుగుతున్న సమయంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ గాయపడినట్లు సమాచారం.
(ఇది చదవండి: తీవ్ర అస్వస్థతకు గురైన ప్రముఖ సింగర్)
ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ తొలిసారిగా టైగర్ ష్రాఫ్‌తో జతకట్టాడు. తాజా నివేదిక ప్రకారం యాక్షన్ సీక్వెన్స్ సీన్లు చేస్తున్నప్పుడు గాయపడినట్లు తెలుస్తోంది. ఓ ఫైట్ కోసం స్టంట్ చేస్తుండగా అతని మోకాలికి గాయమైనట్లు సమాచారం. గాయపడినప్పటికీ షూటింగ్ కొనసాగించారని చిత్ర యూనిట్ సభ్యులు వెల్లడించారు. కాగా.. అక్షయ్ కుమార్ మూవీలో సోనాక్షి సిన్హా, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దీంతో పాటు అక్షయ్ కుమార్ 'ఓఎంజీ 2', 'క్యాప్సూల్ గిల్', 'సూరరై పొట్రు', 'హేరా ఫేరి' చిత్రాల్లో నటించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment