బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఆయనకు భారత్‌తో పాటు కెనడా పౌరసత్వం ఉన్న విషయం తెలిసిందే. దీనిపై కొన్నాళ్లుగా ఆయనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తాజాగా అక్షయ్ కుమార్ స్పందించారు. తాను భారతీయుడినన్న అక్షయ్.. తన సర్వస్వం భారతదేశమేనని స్పష్టం చేశాడు. కెనడా పౌరసత్వం తీసుకోవడానికి గల కారణాలను వెల్లడించాడు.
‘ఆజ్ తక్’లో ప్రసారమవుతున్న ‘సీదీ బాత్' కార్యక్రమంలో పాల్గొన్న అక్షయ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ''1990లలో నాకు వరుసగా 15 ప్లాఫులు వచ్చాయి. ఇక ఇండస్ట్రీలో కంటిన్యూ అవడం అసాధ్యం అని భావించాను. ఆ సమయంలోనే కెనడాలో ఉండే నా ఫ్రెండ్.. అక్కడికి వచ్చి ఏదైనా పని చేసుకోమని ఆఫర్ ఇచ్చాడు. దీంతో కెనడా పాస్‌పోర్టుతో పాటు అక్కడి పౌరసత్వం కోసం కూడా ధరఖాస్తు చేసుకున్నా.
అదే సమయంలో నేను నటించిన రెండు సినిమాలు అదృష్టం కొద్దీ సూపర్ హిట్ అయ్యాయి. దీంతొ నా ఫ్రెండ్.. వెళ్లి నీ పని చూసుకో అని చెప్పడంతో తిరిగి ఇండియాకు వచ్చాను. ఇది తెలుసుకోకుండా ప్రజలు నాపై విమర్శలు చేస్తుంటే చాలా బాధేస్తుంది. ఇప్పటికే కెనడా పాస్‌పోర్ట్ మార్చుకునేందుకు దరఖాస్తు చేసుకున్నా'' అంటూ అక్షయ్ చెప్పుకొచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment