స్టార్ హీరో అక్షయ్ కుమార్... 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారతీయ పౌరసత్వం అందుకున్నాడు. అదేంటి... గత 30 ఏళ్లకు పైగా మన సినిమాల్లో హీరోగా చేస్తున్నాడు. మన దేశస్తుడు కాకపోవడం ఏంటని మీరు అనుకోవచ్చు. కానీ అదే నిజం. ఇంతకీ అక్షయ్ పౌరసత్వం సంగతేంటి? అతడు ఇన్నాళ్లు ఏ దేశ పౌరుడు అనేది ఇప్పుడు కాస్తంత వివరంగా చెప్పుకొందాం.
నటుడు కాకముందు మార్షల్ ఆర్ట్స్ నిపుణుడిగా పనిచేసిన అక్షయ్ కుమా.. 1987లో 'ఆజ్' అనే సినిమాలో సహాయ పాత్రలో నటించి కెరీర్ ప్రారంభించాడు. 1991లో 'సౌగంధ్' మూవీతో హీరోగా మారాడు. ఇక అప్పటి నుంచి మెల్లమెల్లగా సినిమాలు చేస్తూ స్టార్‌గా ఎదిగాడు. ప్రస్తుతం బాలీవుడ్ లోనే అత్యధిక రెమ్యునరేషన్ అందుకున్న స్టార్ హీరోల్లో అక్షయ్ ఒకడని చెప్పొచ్చు.
(ఇదీ చదవండి: కులాలంటే నాకు అసహ్యం: నటుడు మోహన్‌బాబు)
ఇన్నాళ్లుగా హిందీ సినిమాలు చేస్తున్నప్పటికీ అక్షయ్‌కి కెనడా పౌరసత్వం ఉండేది. దీంతో చాలామంది ఈ విషయమై ఇతడిని విమర్శించేవారు. గతంలో ఓసారి ప్రధాని మోదీని, అక్షయ్ కుమార్ ఇంటర్వ్యూ చేశాడు. అప్పుడు కూడా పౌరసత్వం విషయమై ట్రోల్ చేశారు. దీంతో 2019లో భారతీయ పౌరసత్వం కోసం దరఖాస్తు పెట్టుకున్నాడు. కొవిడ్ వల్ల అది ఇన్నాళ్లు పాటు ఆలస్యమైంది.
తాజాగా 77వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా తాను భారతదేశ పౌరసత్వ అందుకున్నట్లు ఓ ఫొటో పోస్ట్ చేసి ఆనందం వ్యక్తం చేశాడు. ఇదిలా ఉండగా ఈ మధ్య 'ఓ మై గాడ్ 2' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన అక్షయ్.. త్వరలో 'ద గ్రేట్ ఇండియా రెస్క్యూ' చిత్రంతో రాబోతున్నాడు. వీటితో పాటు మరో నాలుగు మూవీస్ చేస్తూ బిజీగా ఉన్నాడు.
Dil aur citizenship, dono Hindustani.
— Akshay Kumar (@akshaykumar) August 15, 2023
Happy Independence Day!
Jai Hind! 🇮🇳 pic.twitter.com/DLH0DtbGxk
(ఇదీ చదవండి: ఆ హీరోయిన్‌కి క్షమాపణలు చెప్పిన రానా)
Comments
Please login to add a commentAdd a comment