అక్షయ్‌కుమార్
కొంతకాలంగా నటుడు అక్షయ్‌కుమార్ పౌరసత్వం గురించి బీటౌన్‌లో వివాదం వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. అక్షయ్ కెనడా పౌరసత్వం కలిగి ఉన్నాడన్నది ఆ వివాదాల సారాంశం. ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అక్షయ్ ఓటు వేయకపోవడం విమర్శకు దారి తీసింది. అతని భార్య, నటి, నిర్మాత ట్వింకిల్ ఖన్నా ఓటు హక్కును వినియోగించుకున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అక్షయ్ ఎందుకు లేడనే విషయంపై సోషల్ మీడియాలో భిన్నరకాలుగా చర్చలు సాగాయి. ఆ చర్చ అక్షయ్ కెనడా పౌరసత్వమే ప్రధానాంశంగా సాగింది. ఈ విషయంపై అక్షయ్ కుమార్ ట్వీటర్‌లో వివరణ ఇచ్చారు.
‘‘నా పౌరసత్వం గురించి ఎందుకింత చర్చ, వ్యతిరేక భావనలు వినిపిస్తున్నాయో అర్థం కావడం లేదు. కెనడా పాస్‌పోర్ట్ లేదని నేనెప్పుడూ చెప్పలేదు, దాచలేదన్నది ఎంత నిజమో.. గత ఏడేళ్లగా ఒక్కసారి కూడా కెనడా వెళ్లలేదన్నది అంతే నిజం. నేను ఇండియాలో పని చేస్తున్నాను. ఇండియాలోనే పన్నులు కడుతున్నాను. ఇన్నేళ్లుగా దేశం పట్ల నాకు ఉన్న ప్రేమను ఇప్పుడు ఎవరికీ నిరూపించుకోవాల్సిన అవసరం రాలేదు. కానీ ఇప్పుడు అనవసరంగా నా పౌరసత్వం గురించి వివాదాలు సృష్టించడం సరైంది కాదు. ఏదీ ఏమైనా ఇండియా ప్రగతి పథంలో ముందుకు వెళ్లడానికి నా వంతు ప్రయత్నాన్ని మానుకోను’’ అన్నారు అక్షయ్ కుమార్.
Comments
Please login to add a commentAdd a comment