akshay kumar news
-
షూటింగ్లో ప్రమాదం.. అక్షయ్ కుమార్‌కు గాయాలు!
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్‌కు గాయాలైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన 'బడే మియాన్ చోటే మియాన్'చిత్రంలో నటిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం స్కాట్లాండ్లో జరుగుతోంది. ఫుల్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ తెరకెక్కిస్తున్నారు. అయితే షూటింగ్ జరుగుతున్న సమయంలో బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ గాయపడినట్లు సమాచారం. (ఇది చదవండి: తీవ్ర అస్వస్థతకు గురైన ప్రముఖ సింగర్) ఈ చిత్రంలో అక్షయ్ కుమార్ తొలిసారిగా టైగర్ ష్రాఫ్‌తో జతకట్టాడు. తాజా నివేదిక ప్రకారం యాక్షన్ సీక్వెన్స్ సీన్లు చేస్తున్నప్పుడు గాయపడినట్లు తెలుస్తోంది. ఓ ఫైట్ కోసం స్టంట్ చేస్తుండగా అతని మోకాలికి గాయమైనట్లు సమాచారం. గాయపడినప్పటికీ షూటింగ్ కొనసాగించారని చిత్ర యూనిట్ సభ్యులు వెల్లడించారు. కాగా.. అక్షయ్ కుమార్ మూవీలో సోనాక్షి సిన్హా, పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దీంతో పాటు అక్షయ్ కుమార్ 'ఓఎంజీ 2', 'క్యాప్సూల్ గిల్', 'సూరరై పొట్రు', 'హేరా ఫేరి' చిత్రాల్లో నటించనున్నారు. -
దేశ పౌరసత్వాన్ని వదులుకున్న అక్షయ్‌కుమార్
బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఆయనకు భారత్‌తో పాటు కెనడా పౌరసత్వం ఉన్న విషయం తెలిసిందే. దీనిపై కొన్నాళ్లుగా ఆయనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో తాజాగా అక్షయ్ కుమార్ స్పందించారు. తాను భారతీయుడినన్న అక్షయ్.. తన సర్వస్వం భారతదేశమేనని స్పష్టం చేశాడు. కెనడా పౌరసత్వం తీసుకోవడానికి గల కారణాలను వెల్లడించాడు. ‘ఆజ్ తక్’లో ప్రసారమవుతున్న ‘సీదీ బాత్' కార్యక్రమంలో పాల్గొన్న అక్షయ్ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ''1990లలో నాకు వరుసగా 15 ప్లాఫులు వచ్చాయి. ఇక ఇండస్ట్రీలో కంటిన్యూ అవడం అసాధ్యం అని భావించాను. ఆ సమయంలోనే కెనడాలో ఉండే నా ఫ్రెండ్.. అక్కడికి వచ్చి ఏదైనా పని చేసుకోమని ఆఫర్ ఇచ్చాడు. దీంతో కెనడా పాస్పోర్టుతో పాటు అక్కడి పౌరసత్వం కోసం కూడా ధరఖాస్తు చేసుకున్నా. అదే సమయంలో నేను నటించిన రెండు సినిమాలు అదృష్టం కొద్దీ సూపర్ హిట్ అయ్యాయి. దీంతొ నా ఫ్రెండ్.. వెళ్లి నీ పని చూసుకో అని చెప్పడంతో తిరిగి ఇండియాకు వచ్చాను. ఇది తెలుసుకోకుండా ప్రజలు నాపై విమర్శలు చేస్తుంటే చాలా బాధేస్తుంది. ఇప్పటికే కెనడా పాస్‌పోర్ట్ మార్చుకునేందుకు దరఖాస్తు చేసుకున్నా'' అంటూ అక్షయ్ చెప్పుకొచ్చారు. -
ఆ సినిమా చూసి ప్రతి భారతీయుడు గర్విస్తాడు!
ముంబై: యాక్షన్ సూపర్ స్టార్ అక్షయ్‌కుమార్ తాజా చిత్రం 'ఎయిర్‌లిఫ్ట్'. 1990లో కువైట్‌పై ఇరాక్ నియంత సద్దాం హుస్సేన్ దండయాత్ర జరిపినప్పుడు.. భారత్ విరోచితంగా వ్యవహరించి.. అక్కడ చిక్కుకుపోయిన 1.70 లక్షలమందిని తరలించింది. ప్రపంచంలోనే శరణార్థుల అతిపెద్ద వైమానిక తరలింపు ఇదేనని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా గుర్తించింది. ఆనాటి విరోచిత ఘట్టాన్ని పాఠ్యపుస్తకంలో చేర్చాలని అక్షయ్‌కుమార్ కోరారు. ఆ ఘటనను వెలుగులోకి తీసుకురావడానికే 'ఎయిర్‌లిఫ్ట్' చిత్రంలో తాను నటించినట్టు ఆయన తెలిపారు. 'గిన్నిస్ బుక్‌ను తెచ్చుకొని అందులో అతిపెద్ద వైమానిక తరలింపు ఏదని చూస్తే భారతే కనిపిస్తుంది. దీనిని అందరి దృష్టికి తీసుకురావాలనే దృష్టితోనే ఈ కథను నేను ఎంచుకున్నాను' అని ఆయన చెప్పారు. ఎన్ఎంఐఎంఎస్ కాలేజీ వాయు ఫెస్టివల్లో ఆయన సోమవారం మాట్లాడారు. 'ఇది మన పాఠ్యపుస్తకాల్లో చేర్చాల్సిన పెద్ద అధ్యాయం. కీలకమైన అధ్యాయం. దీనిని చేర్చాల్సిందిగా నేను ఇప్పటికే కోరాను. షాజహన్, అక్బర్ ఏం చేశారో మనందరికీ తెలుసు. ఇప్పుడు మనం ఏం చేశామో కూడా తెలుసుకోవాలి' అని ఆయన అన్నారు. '1990లో కువైట్‌పై సద్దాం హుస్సేన్ దాడి చేశాడు. దీంతో అక్కడున్న 1.70 లక్షలమంది భారతీయులు చిక్కుకుపోయారు. ఎక్కడికి పోవాలో తెలియదు. ఏం చేయాలో తెలియదు. అప్పుడు ఏం జరిగిందన్నదే మేం ఈ కథలో చూపించబోతున్నాం. ఇలాంటి ఘటనలు మరుగన ఉంచడంలో రాజకీయ కారణాలు కూడా ఉన్నాయి' అని ఆయన పేర్కొన్నారు. 1.70 లక్షలమంది శరణార్థులను 488 విమానాల్లో 59 రోజులపాటు ఎలా సురక్షితంగా తరలించారనే విషయాన్ని వారి సహాయకుడిగా అక్షయ్ వివరించడం ఈ సినిమాలో కనిపిస్తుంది. ఇది ప్రతి ఒక్క భారతీయుడు గర్వించేలా ఉండే ప్రత్యేకమైన సినిమా అని, అందరూ దీనిని చూడాలని ఆయన కోరారు.