
డీప్.. డీప్.. డిప్రెషన్
- ఒత్తిడికి చిత్తవుతున్న యువతరం
- చదువు, కెరీర్, ప్రేమ వైఫల్యాలు, సోషల్ మీడియానే కారణం
- ఒంటరితనం.. ప్రతికూల ఆలోచనలతో తీవ్ర ఒత్తిడిలోకి..
- నిస్పృహలోకి వెళ్లి ఆత్మహత్యలకు పాల్పడుతున్న కొందరు
- ‘కాస్మోస్’ సంస్థ తాజా అధ్యయనంలో వెల్లడి
- దేశవ్యాప్తంగా 500 కళాశాలల్లో సర్వే
- బాధితుల్లో 18–25 ఏళ్ల మధ్య వయసు వారు.. 64%
- 25–44 ఏళ్ల వయసు వారు 50%
- సామాజిక మాధ్యమాల్లో గంటల తరబడి గడపడం.
- మార్కుల రేస్‌లో తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యాలు ఒత్తిడి చేయడం.
- తెలిసీతెలియని వయసులో డ్రగ్స్, తాగుడు, పోర్న్ సైట్స్ వంటివాటికి అలవాటుపడటం.
- టీనేజ్‌లో ఆకర్షణకు లోనుకావడం. వన్‌సైడ్ లవ్.
- మంచి కళాశాలలో సీటు సాధించలేకపోవడం.
- కెరీర్‌పరంగా ఒడిదుడుకులు. చదువును నిర్లక్ష్యం చేయడం.
- చదువుకు అనుగుణంగా ఉద్యోగం దొరక్కపోవడం.
- తాము ఎదుర్కొంటున్న సమస్యలపై ఇంట్లో వారి నుంచి సరైన మార్గదర్శనం లభిం చకపోవడం.
- సామాజిక మాధ్యమాల్లో రోజుకు అరగంటకు మించి గడపరాదు.
- చదువు, మార్కులు, ర్యాంకులు, కెరీర్ ఎంచుకునే విషయంలో పిల్లలపై తల్లిదండ్రులు, యాజమాన్యాలు ఒత్తిడి చేయరాదు.
- యువతరంతో తల్లిదండ్రులు, టీచర్లు స్నేహితుల్లా మెలిగి.. వారు ఎదుర్కొంటున్న మాన సిక సమస్యలను పరిష్కరించేందుకు తోడ్పాటును అందించాలి.
- దురలవాట్లు, డ్రగ్స్‌కు దూరంగా ఉండటం. చెడు స్నేహాలను వదిలేయడం.
- నెగెటివ్ ఆలోచనలకు దూరంగా ఉండాలి. ఎప్పుడూ పాజిటివ్‌గా ఆలోచించాలి.
- ఎంచుకున్న రంగం, కెరీర్‌లో అత్యుత్తమ విజయాలు సాధించిన వారి విజయగాథలను తెలుసుకోవాలి. వాటి నుంచి స్ఫూర్తి పొందాలి.
- వివిధ రకాల ఆకర్షణలకు దూరంగా ఉండాలి.
- ప్రతి రోజూ వ్యాయామం, యోగా, నడక, మార్షల్ ఆర్ట్స్, ధ్యానం వంటిలో ఏదో ఒకదానికి నిర్ణీత సమయం కేటాయించాలి.
- మానసిక విశ్రాంతికి అధిక ప్రాధాన్యతనివ్వాలి. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాలు, గార్డెనిం గ్ వంటి కార్యకలాపాలతో బిజీగా ఉండాలి.
- ఇష్టమైన పుస్తకాలు చదవాలి.
- నలుగురితో సరదాగా మాట్లాడటం, నవ్వడం, నిర్ణీత వేళకు ఆహారం తీసుకోవడం, నిద్రపో వడం వంటి సూత్రాలను విధిగా పాటించాలి.
సాక్షి, హైదరాబాద్ : ‘‘సెంచరీలు కొట్టే వయస్సు మాదీ.. బౌండరీలు దాటే మనస్సు మాదీ..’’అని పాడు కోవాల్సిన యువతరం ఇప్పుడు తీవ్ర ఒత్తిడితో చిత్తవుతోందట. మార్కులు, ర్యాంకులు.. కెరీర్, ఉద్యోగం.. టీనేజ్ లవ్, వైఫల్యాలు ఇలా సవాలక్ష సవాళ్లతో సతమతమవుతోందట. ఏకా గ్రత కోల్పోయి.. ఏ పనిమీదా మనసు లగ్నం చేయలేక.. ఒంటరితనం.. నెగెటివ్ ఆలోచనలు చుట్టుముట్టి డిప్రెషన్‌కు లోనవుతోందట.
ఒత్తిడి శ్రుతిమించితే కొందరు బలహీన మనస్కులు ఆత్మహత్యకు సైతం పాల్పడటం వంటి విపరిణామాలు చోటుచేసుకుంటున్నాయని తాజా అధ్యయనంలో తేలింది. ఢిల్లీకి చెందిన ప్రముఖ మానసిక వైద్యశాల ‘కాస్మోస్’దేశవ్యాప్తంగా 500 కళాశాలల్లో నిర్వహించిన అధ్యయనంలో యువత ఒత్తిడితో కుంగిపోతున్నట్లు వెల్ల డైంది. ఈ జాబితాలో మన నగరానికి చెందిన సుమారు 20 కళాశాలలు ఉన్నాయి. ఇటీవలి కాలంలో సామాజిక మాధ్యమాల్లో గంటల తరబడి గడుపుతున్న కుర్రకారు ఆత్మీయ సంబంధాలు, స్నేహితులతో ఆటపాటలకు దూరమవుతూ ఒత్తిడి అనే ఉపద్రవంలో చిక్కుకుంటోందని మాన సిక శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ప్రధానంగా 18–25 ఏళ్ల మధ్యనున్న యువతరంలో ఏకంగా 64 శాతం మంది ఇలాంటి పరిస్థితితో బాధపడుతుండటంతో ఆందోళన కలిగిస్తోందంట ున్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో మంచి కళాశాలలో సీటు సాధించడం మొదలుకుని మార్కులు, ర్యాంక్‌లు తెచ్చుకోవడం.. అత్యుత్తమ కెరీర్ ఎంచుకోవడం.. క్యాంపస్ సెలక్షన్స్‌లో మంచి ఉద్యోగం సాధించడం.. ఆ మధ్యలో టీనేజ్ లవ్‌లు.. ప్రేమ వైఫల్యాల వంటి సవాళ్లు యువతరాన్ని చుట్టుముడుతున్నాయని పేర్కొంటున్నారు.
యువతలో ఒత్తిడికి కారణాలివే..
25–44 ఏళ్ల మధ్య వయసు వారిలో ఇలా..
ఇక 25–44 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారిలో ఆర్థిక సమస్యలు, ఉద్యోగానికి సంబంధించి అధిక పని ఒత్తిడి, కొన్నిసార్లు ఉద్యోగం కోల్పోవడం, దాంపత్య సమస్యలు, కుటుంబ సంబంధాలు విచ్ఛిన్నమవ్వడం వంటి కారణాలతో సుమారు 50 శాతం మంది ఒత్తిడితో సతమతమవుతున్నట్లు సర్వేలో తేలింది.
ఇలా చేస్తే ఒత్తిడిమాయం..
– డాక్టర్ అనిత,
సైకియాట్రిస్ట్, అసోసియేట్ ప్రొఫెసర్, రిమ్స్