
వేలూరు: బావిలో దూకి ప్రేమజంట ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన వాలాజ సమీపంలో మంగళవారం చోటుచేసుకుంది. వేలూరు జిల్లా వాలాజ తాలుకా అమ్మన్ తాంగల్ గ్రామంలో అక్కడున్న వ్యవసాయ బావిలో ఇద్దరి మృతదేహాలు తేలుతుండడంతో దిగ్భ్రాంతి చెందిన గ్రామస్తులు వెంటనే వాలాజ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బావిలో నుంచి ఇద్దరి మృతదేహాలను బయటకు తీసి విచారణ జరిపారు.
పోలీసులు బావి సమీపంలోని బైకుపైన ఉన్న బ్యాగులో పరిశీలించగా అందులో ఆధార్ కార్డు, ఓటర్లు గుర్తింపు కార్డు ఉండడాన్ని గుర్తించారు. వాటిని పరిశీలించగా మృతురాలు వేలూరు సమీపంలోని వూసూరు చిన్నసేకనూర్ గ్రామానికి చెందిన మణి కుమార్తె ఎయిలరసి(21), మృతిచెందిన యువకుడు రాణిపేట పులియమరం తోపు వీధికి చెందిన సెల్వరాజ్ కుమారుడు సుకుమారన్(23) అని తెలిసింది. వీరిద్దరూ ప్రేమికులని అనుమానించిన పోలీసులు మృతుల కుటుంబసభ్యులకు సమాచారం అందజేశారు. అనంతరం మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు వృతుల కుటుంబసభ్యుల వద్ద విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment