ప్రేమజంట కార్తీక, సతీష్ (ఫైల్)
చెన్నై , తిరువొత్తి యూరు: ఇంటి నుంచి పారిపోయిన ప్రేమజంట ఆత్మహత్యకు యత్నించిన సంఘటనలో ప్రియురాలు అదే స్థలంలో మృతి చెందగా ప్రియుడు కూడా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. ఈరోడ్ జిల్లా గోపిశెట్టిపాళయం ఆది ద్రావిడ కాలనీకి చెందిన కాట్టురాజా భార్య కార్తిక (25). అదే ప్రాంతానికి చెంది న ప్రైవేటు సంస్థలో పని చేస్తున్న నడుపాళయం కు చెందిన సతీష్ (27)తో పరిచయం ఏర్పడి ఇద్ద రి మధ్య వివాహేతర సంబంధానికి దారితీసింది.
ఈ క్రమంలో గత 3వ తేదీ ఇంటి నుంచి బయటకు వచ్చిన జంట పలు ప్రాంతాలలో తిరిగి తరువాత గత 9వ తేదీ మదురైలో ఉన్న ఒక ఆలయంలో వివాహం చేసుకున్నారు. ఇదిలాఉండగా కార్తీ క కనబడలేదని ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసి ఆమె కో సం గాలింపు చేపట్టారు. ఈ క్రమంలో కన్యాకుమారికి వచ్చి ఓ లాడ్జిలో గది తీసుకున్న ప్రేమజం ట మంగళవారం రాత్రి విషం తాగి ఆత్మహత్యకు యత్నించారు. వారి గది తలుపు తెరచుకోకపోవడంతో లాడ్జి ఉద్యోగులు అక్కడికి చేరుకుని గది తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా కార్తీక మృతి చెంది ఉండగా సతీష్ ప్రాణాలకు పోరాడుతున్నాడు. పోలీసులు వచ్చి సతీష్‌ను చికి త్స కోసం ఆచారిపల్లం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సతీష్ గురువారం ఉదయం మృతి చెందారు.
Comments
Please login to add a commentAdd a comment