
భువనగిరి అర్బన్ (తెలంగాణ) : ప్రేమజంట పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ సంఘటన తెలంగాణలోని భువనగిరి రైల్వేస్టేషన్‌లో మంగళవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం కోపల్లె గ్రామానికి చెందిన యువకుడు ధనుంజయ్, మైనర్ బాలిక కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. వీరిద్ద రూ పశ్చిమగోదావరి జిల్లా నుంచి హైదరాబాద్‌కు అక్కడి నుంచి భువనగిరికి బస్సులో వచ్చారు. భువనగిరి రైల్వేస్టేషన్‌కు చేరుకుని రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడాలని భావించారు.
ధైర్యం చాలకపోవడంతో.. పురుగుల మందు తాగారు. తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా ముందే బాలిక తన బంధువులకు ఫోన్ ద్వారా తెలియజేసింది. దీంతో బంధువులు వెంటనే బీబీనగర్ మండలంలోని రాఘవాపురంలోని పౌల్ట్రీఫామ్‌లో పనిచేస్తున్న పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వారికి సమాచారం అందించారు. వారు వెంటనే భువనగిరి రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. రైల్వేస్టేషన్‌లోని ప్లాట్‌ఫామ్ కింద పడిపోయి ఉన్న వీరిద్దరినీ గుర్తించారు. వెంటనే చికిత్స కోసం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు.
గాంధీ ఆస్పత్రికి తరలింపు
మెరుగైన చికిత్స కోసం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. విష యం తెలుసుకున్న రైల్వే పోలీసులు గాం ధీ ఆస్పత్రికి వెళ్లి వివరాలను తెలుసుకున్నారు. ప్రస్తుతం వారు కోలుకుంటున్నట్టు బంధువులు తెలిపారు. ఆత్మహత్యాయత్నానికి గల కారణాలు తెలియరావాల్సి ఉంది.
వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం
కాళ్ల: మండలంలోని కోపల్లె గ్రామానికి చెందిన పంపురెడ్డి ధనుంజయ్, అదే గ్రామానికి చెందిన మైనర్ బాలిక వ్యవసాయ పనులు చేస్తుంటారు. ధనుంజయ్ అత్తిలికి చెందినవాడు కాగా తల్లిదండ్రులు మరణించడంతో కోపల్లెలో తాత ఇం టి వద్ద ఉంటూ వ్యవసాయ పనులు చేస్తున్నాడు. ప్రేమికులిద్దరూ భువనగిరిలో ఆ త్మహత్యకు యత్నించడంతో స్థానికంగా కలకలం రేగింది. అయితే దీనిపై తమకు ఎటువంటి సమాచారం లేదని కాళ్ల పోలీసులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment