
ఆత్మహత్య చేసుకున్న సాయికుమార్
సాక్షి, మహబూబ్‌నగర్: పెళ్లికి పెద్దలు నిరాకరించారని ఓ ప్రేమజంట పురుగు మందు తాగిన సంఘటన నాగర్‌కర్నూల్ జిల్లాలోని కోడేరు మండలం ఎత్తంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామస్తుల కథనం ప్రకారం.. ఎత్తం గ్రామానికి చెందిన గోలగుంట సాయికుమార్(22) అదే గ్రామానికి చెందిన ఓ యువతి రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. విషయం తెలియడంతో అమ్మాయి తరపు కుటుంబీకులు పెళ్లికి నిరాకరించారు. దీంతో యువతి ఇంట్లో పురుగు మందు తాగి అపస్మారక స్థితికి చేరుకుంది.
గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే కొల్లాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతుంది. విషయం తెలుసుకున్న సాయికుమార్ ఆందోళన చెంది పురుగు మందు తాగాడు. కుటుంబీకులు కొల్లాపూర్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ విషయంలో రెండు కుటుంబాల వారు వివరాలు తెలిపేందుకు నిరాకరించారు. ఎస్‌ఐ నరేందర్‌రెడ్డిని వివరణ కోరగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని చెప్పారు.
చదవండి: ఆమె ప్రవర్తన భయపెట్టింది.. మంత్రి కేటీఆర్ ట్వీట్
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి.
ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com
Comments
Please login to add a commentAdd a comment