
తమిళనాడు, అన్నానగర్: పన్‌రుట్టి సమీపంలో సోమవారం ప్రేమ జంట విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. కడలూర్ జిల్లా బన్‌రుట్టి ప్రాంతానికి చెందిన రాజేంద్రన్ (36) కూలీ. ఇతనికి వివాహం జరిగి కుమారుడు, కుమార్తె ఉన్నా రు. అదే గ్రామానికి చెందిన తమిళరసి (35). కూలీ పని చేసే ఈమెకు వివాహం జరిగి కుమా ర్తె ఉంది. పనికి వెళ్లిన సమయంలో రాజేంద్రన్, తమిళరసి మధ్య పరిచయం ఏర్పడి వివాహేతర సంబంధానికి దారితీసింది. విషయం తెలుసుకున్న ఇరు కుటుంబీకులు వారిని మం దలించారు.
దీంతో మూడేళ్ల కిందట రాజేం ద్రన్, తమిళరసి ఇంటి నుంచి బయటకు వెళ్లి కోవై జిల్లా తెన్నూర్ గ్రామంలో ఉంటూ కాపు రం చేస్తున్నారు. కాగా తమిళరసి కుటుంబీకులు ఆమె కోసం గాలించగా రాజేంద్రన్‌తో తెన్నూర్‌లో ఉన్నట్టు తెలిసింది. గత 24న తమి ళరసిని, రాజేంద్రన్ నుంచి విడదీసి ఇంటికి తీసుకొచ్చారు. దీంతో మనస్తాపం చెందిన తమిళరసి సోమవారం జీడిమామిడి తోటలో విషం తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న రాజేంద్రన్ సొంత గ్రామానికి వచ్చాడు. అతను జీడిమామిడి తోటకు వెళ్లి విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment