
మృతి చెందిన కౌసల్య, సోలై గురుస్వామి (ఫైల్)
అన్నానగర్: తమ ప్రేమను తల్లిదండ్రులు వ్యతిరేకించడంతో ప్రేమజంట మంగళవారం రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుంది. వివరాలు.. దిండుక్కల్ జిల్లా కొడైరోడ్డు సమీపం ధర్మపురి ప్రాంతంలో రైలు పట్టాలపై మంగళవారం యువతి, యువకుడి మృతదేహాలు పడిఉన్నాయి. దీనిపై స్థానికులు కొడైరోడ్డు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం కోసం దిండుక్కల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి విచారణ చేపట్టారు.
ప్రాథమిక విచారణలో ఇందులో మృతిచెందిన యువకుడు మదురై జిల్లా సోళవందాన్‌కు చెందిన రాజగురు కుమారుడు సోలైగురుస్వామి (25) అని, యువతి తిరువేడగం సమీపం తచ్చమ్‌పత్తుకి చెందిన జయకుమార్ కుమార్తె కౌసల్య (17)గా తెలిసింది. సోలై గురుస్వామి ఐటీఐ చదివి ఓ ప్రైవేటు సంస్థలో పని చేస్తున్నాడు. కౌసల్య సోళవందాన్‌లో పాఠశాల్లో ప్లస్–2 చదువుతోంది. వీరిద్దరూ ప్రేమించుకున్నట్టు తెలిసింది. వీరి ప్రేమను తల్లిదండ్రులు వ్యతిరేకించడంతో వీరిద్దరూ కొన్ని రోజుల కిందట ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయారు. అనంతరం తిరిగి ఇంటికి రాలేదు. ఈ స్థితిలో ప్రేమజంట మంగళవారం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment