Love Couple Commits Suicide In Mysore Detail In Telugu - Sakshi
Sakshi News home page

ప్రియునికి ప్రియురాలి తండ్రి షరతు.. లాడ్జ్‌లో రూం తీసుకొని..

Published Thu, Dec 2 2021 6:41 AM | Last Updated on Thu, Dec 2 2021 8:48 AM

Love Couple Commits Suicide In Mysore - Sakshi

ప్రతకాత్మకచిత్రం

మైసూరు: పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని విరక్తి చెందిన ప్రేమికులు ఉరి వేసుకుని తనువు చాలించారు. ఈ విషాద ఘటన మైసూరులో జరిగింది. చామరాజనగర జిల్లా గుండ్లుపేట తాలూకా బొమ్మలాపుర గ్రామానికి చెందిన బీజీ సతీశ్‌ (21), వరలక్ష్మి (20) అనే ఇద్దరు మృతులు. వీరు గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సతీశ్‌తో పెళ్లికి వరలక్ష్మి కుటుంబం అంగీకరించలేదు. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించిన తర్వాతనే తమ కూతురును ఇచ్చి పెళ్లి చేస్తామని తెలిపారు.

బీఏ చదివిన సతీశ్‌ పోలీసు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. యువతి నర్సింగ్‌ చదువుతోంది. కాగా, సతీశ్‌ మరోసారి పెళ్లి ప్రస్తావన తీసుకురాగా, మొదట ఉద్యోగం తెచ్చుకో అని ప్రియురాలి తండ్రి సిద్ధలింగ తేల్చి చెప్పడంతో ప్రేమ జంట మనస్తాపానికి గురైంది. మైసూరుకు వచ్చిన జంట మంగళవారం సాయంత్రం లాడ్జ్‌లో రూం తీసుకున్నారు. బుధవారం ఉదయం ఎంతకీ బయటకు రాకపోవడంతో సిబ్బంది కిటికీ నుంచి చూడగా గదిలో కొక్కీకి ఉరి వేసుకుని చనిపోయి ఉన్నారు. లాడ్జ్‌ యజమాని లష్కర్‌ ఏరియా పోలీసులకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసుకున్నారు.

చదవండి: (జైళ్లో నేత్ర.. నిర్మానుష్య బంగ్లాలో చోరీ)

 నదిలో దూకిన మరో ప్రేమజంట 
మైసూరు: తమ ప్రేమను ఇంట్లో పెద్దవాళ్లు అంగీకరించలేదని ప్రేమజంట కపిలా నదిలోకి దూకింది. నంజనగూడు తాలూకా ముడికట్టె వద్ద జరిగింది. చామరాజనగర జిల్లా సోమవారపేట గ్రామ నివాసి అభి (19), చామరాజనగరకు చెందిన 17 ఏళ్ల బాలిక ప్రేమించుకున్నారు. బాలిక కాలేజీలో చదువుకుంటుండగా, అభి పెట్రోల్‌ బంక్‌లో పనిచేస్తున్నాడు. వీరి ప్రేమను తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. బుద్ధిగా ఉండాలని మందలించారు. దీంతో యువ జంట ఆవేదనకు గురై కపిలా నదిలోకి దూకి ఆత్మహత్యకు యత్నించారు. నదిలో తెప్పలు  నడుపుతున్నవారు ప్రేమ జంటను రక్షించడంతో గండం తప్పింది. ఇద్దరిని నంజనగూడు ఆస్పత్రిలో చేర్పించారు. పట్టణ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదు అయింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement