varalakshmi
-
ఆత్మహత్య చేసుకుంటా
సాక్షి, టాస్క్‌ఫోర్స్: తిరుపతి జిల్లా సత్యవేడు టీడీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తనపై లైంగిక దాడి చేయడమే కాకుండా.. తన వర్గీయులతో వేధిస్తున్నారంటూ కేవీబీ పురం మండల టీడీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరలక్ష్మి ఆరోపించింది. బాధిత మహిళ పట్ల సానుభూతి చూపించకుండా.. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిస్తున్నారంటూ వాపోయింది. ఫిర్యాదు చేసినా చంద్రబాబు, లోకేశ్ న్యాయం చేయకపోవడంతో.. ఇక ‘ఆత్మహత్య చేసుకుంటున్నా’నంటూ సోషల్ మీడియాలో ఆమె పోస్టు చేసింది. దీంతో నియోజకవర్గ టీడీపీలో తీవ్ర దుమారం రేగింది. చంద్రబాబు, లోకేశ్ వల్లే..వరలక్ష్మికి టీడీపీలోని యాదవ సామాజికవర్గ నాయకులు మద్దతుగా నిలిచారు. వరలక్ష్మికి న్యాయం చేయడం మానేసి.. తిరిగి ఆమెనే వేధింపులకు గురిచేస్తున్నారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో అసభ్యకర భాషతో నీచాతినీచంగా తిడుతూ.. ఫోన్‌కాల్స్ చేసి వేధిస్తుంటే ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రభుత్వంపై మండిపడ్డారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ వెంటనే స్పందించి.. కఠిన చర్యలు తీసుకొని ఉంటే పరిస్థితి ఇంత వరకు వచ్చేది కాదన్నారు. బలవంతపు మరణానికి దారితీసేలా వ్యవహరిస్తున్నారంటూ మండిపడుతున్నారు. బాధితురాలి ప్రాణానికి హాని జరిగితే ఊరుకునేది లేదని వారు హెచ్చరిస్తున్నారు.దళిత ఎమ్మెల్యేపై కుట్ర చేశారంటూ ఆందోళనటీడీపీలోని అగ్రకుల నాయకులు కుట్ర పన్ని ఎమ్మెల్యే ఆదిమూలాన్ని ఈ కేసులో ఇరికించారంటూ స్థానిక దళిత సంఘాల నాయకులు, కార్యకర్తలు ఆదివారం సత్యవేడులోని అంబేడ్కర్ విగ్రహం వద్ద ధర్నా చేశారు. వరలక్ష్మిపై కేసు నమోదు చేసి, ఆమె వెనుక ఎవరున్నారో విచారించి.. శిక్షించాలని డిమాండ్ చేశారు. అలాగే నారాయాణవనం మండలంలో కూడా ఆదిమూలం వర్గీయులు రెండు రోజులుగా ధర్నా చేస్తున్నారు. దళిత ఎమ్మెల్యేతో రాజీనామా చేయించి ఓ మాజీ ఎమ్మెల్యేను ఇన్చార్జ్గా నియమించి పెత్తనం చెలాయించేందుకు కుట్రలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఆదిమూలం వర్గీయులు కొందరు టీడీపీ జిల్లా అధ్యక్షుడు నరసింహయాదవ్‌కు ఫోన్ చేసి.. వరలక్ష్మి కేసు ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసినట్లు సమాచారం. -
వరలక్ష్మి పెళ్లి వేడుకలో సినీతారల సందడి (ఫొటోలు)
-
డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకోనున్న 'హనుమాన్' నటి..?
-
అయినవాళ్లు సహకరిస్తలేరని.. తల్లీకూతుళ్ల విషాదం!
మహబూబ్‌నగర్: వారసత్వ భూమి విక్రయించగా వచ్చిన డబ్బుల్లో వాటా ఇచ్చి.. తమ బిడ్డ పెళ్లి, కుమారుడి చదువుకు సహకరించాలని అయిన వాళ్లను ప్రాధేయపడినా పట్టించుకోకపోవడంతో ఓ కుటుంబం తీవ్ర మనస్తాపానికి గురైంది. కూతురితో సహా భార్యాభర్తలిద్దరూ ఆత్మహత్య చేసుకునేందుకు సిద్ధపడ్డారు. మొదట తల్లీకూతురు పురుగు మందు తాగగా.. తండ్రి భయపడి మిన్నంకుండిపోయాడు.విషయం తెలుసుకున్న స్థానికులు తల్లీకూతురిని ఆస్పత్రికి తరలిస్తుండగా.. మార్గమధ్యలోనే కన్నుమూసిన విషాదకర ఘటన జోగుళాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం ఏ బూడిదపాడు గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు.. ఏ బూడిదపాడుకు చెందిన మాల హరన్నకు నలుగురు కుమారులు ఉండగా.. ఎకరా పట్టా పొలం, 30 గుంటల అసైన్డ్ (సీలింగ్) పొలాన్ని అన్నదమ్ముళ్లకు పంచారు.పట్టా పొలం రెండవ, మూడవ కుమారుడికి పంపకాల్లో రాగా.. పెద్ద కుమారుడైన నర్సింహులు, చిన్న కుమారుడికి 30 గుంటల సీలింగ్ భూమి వచ్చింది. కొన్నేళ్ల కిందట ఇద్దరు అన్నదమ్ములు పట్టా పొలాన్ని అమ్ముకున్నారు. సీలింగ్ పొలాన్ని ఎవరూ కొనుగోలు చేయకపోవడంతో నర్సింహులు కుటుంబ సభ్యులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. కూతురి పెళ్లి, కుమారుడి చదువు వారికి భారంగా మారింది. ఈక్రమంలో ఆర్థిక ఇబ్బందులు తోడయ్యాయి. దీంతో అమ్మిన పట్టా పొలం డబ్బులను అందరికీ సమానంగా పంచాలని అన్నదమ్ముళ్లతో గొడవ పెట్టుకోవడంతోపాటు పెద్దలను ఆశ్రయించారు.తన బిడ్డ పెళ్లి, కుమారుడి చదువు కోసం డబ్బులు అవసరమని.. పట్టా పొలంలో తనకూ వాటా ఇవ్వాలని ప్రాధేయపడినా ఫలితం లేకపోయింది. దీంతో నర్సింహులు, అతడి భార్య వరలక్ష్మి (39), కూతురు అనురాధ(18) పురుగు మందు తాగి, చనిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈక్రమంలో మొదట వరలక్ష్మి, ఆమె కూతురు పురుగు మందు తాగారు. నరసింహులు పురుగుల మందు తాగడానికి భయపడి విరమించుకున్నాడు. విషయం తెలుసుకున్న స్థానికులు.. తల్లీకూతురిని చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు.కళ్ల ముందే భార్య, కూతురు చనిపోవడంతో నర్సింహులు కుప్పకూలిపోయాడు. తల్లీ కూతురి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నర్సింహులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు జరుపుతున్నట్లు శాంతినగర్ ఏఎస్ఐ అయ్యన్న తెలిపారు. గ్రామంలో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. -
నార్సింగ్ డ్రగ్స్ కేసు రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు
-
నకిలీ దందా.. దామచర్ల చుట్టూనే..!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: జిల్లాలో సంచలనం సృష్టించిన నకిలీ డాక్యుమెంట్లు, నకిలీ రబ్బరు స్టాంపుల కుంభకోణం టీడీపీ నాయకుల కనుసన్నల్లోనే సాగాయి. సిట్ దర్యాప్తులో వెలుగుచూస్తున్న విషయాలను పరిశీలిస్తే టీడీపీ ప్రభుత్వ హయాంలోనే ఈ దందా సాగినట్లు తెలుస్తోంది. ప్రధానంగా 2014 నుంచి 2019 వరకు పచ్చ పార్టీ నేతల కనుసన్నల్లోనే మూడు డాక్యుమెంట్లు...ఆరు రబ్బరు స్టాంపుల చందంగా విరాజిల్లింది. ఈ దందా అంతా టీడీపీ మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దామచర్ల జనార్దన్ అండదండలతోనే ఒంగోలు నగరంతో పాటు జిల్లాలో వేళ్లూనుకుపోయింది. దామచర్ల నకిలీ డాక్యుమెంట్లు, స్టాంపుల కుంభకోణానికి రింగ్ లీడర్‌గా అవతారమెత్తాడు. ఈ కేసులో ఇప్పటికే కీలక వ్యక్తిగా ఉన్న టీడీపీకి చెందిన మహిళా నాయకురాలు, దామచర్ల ప్రధాన అనుచరురాలు పెరంమూరు వరలక్ష్మి అలియాస్ పెద్దిశెట్టి వరలక్ష్మికి 2012లో స్టాంప్ వెండర్ లైసెన్స్‌ను ఇప్పించాడు. అప్పటి నుంచే ఆమె దస్తావేజులను కేవలం నకిలీ డాక్యుమెంట్ల తయారీకి విక్రయిస్తూ ఈ రాకెట్‌కు తెరతీసింది. 2014లో ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత దామచర్ల తన అనుచరులను శాఖకు బదిలీ చేయించుకోవడంతో నకిలీ డాక్యుమెంట్ల కుంభకోణానికి అడ్డే లేకుండా పోయింది. నకిలీల చేతిలో 1100 దస్తావేజులు జిల్లా కోర్టు ప్రాంగణానికి సమీపంలో దస్తావేజులు విక్రయించేందుకు వరలక్ష్మికి ఒక దుకాణం కూడా ఏర్పాటు చేయించి దాన్ని దామచర్ల ప్రారంభించాడు. అప్పటి నుంచి దస్తావేజులను నకిలీ దందాలు చేసే ముఠాలకు మాత్రమే విక్రయిస్తూ భారీగా ఆర్జించింది. నకిలీ డాక్యుమెంట్లు, రబ్బరు స్టాంపుల కుంభకోణం వెలుగు చూడటంతో ఎస్పీ మలికాగర్గ్ సిట్‌ను ఏర్పాటు చేసింది. రంగంలోకి దిగిన సిట్ బృందం లోతైన దర్యాప్తు ప్రారంభించింది. దర్యాప్తులో స్టాంప్ వెండర్ వరలక్ష్మి అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. రిజిస్ట్రేషన్ శాఖ నిబంధనలను ఉల్లంఘించిన ఆమె నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసే వారికి, సంతకాలు ఫోర్జరీ చేసే వాళ్లకు మాత్రమే విక్రయించి సొమ్ము చేసుకుంది. సిట్ దర్యాప్తులో ఇప్పటి వరకు దాదాపు 1100 దస్తావేజులు నిబంధనలకు విరుద్ధంగా విక్రయించినట్లు తేలింది. వరలక్ష్మికి పార్టీ పదవులెన్నో... నకిలీ డాక్యుమెంట్లు, స్టాంపుల కుంభకోణంలో కీలక పాత్ర పోషించిన వరలక్ష్మికి రాష్ట్ర స్థాయిలో అంగన్వాడీ విభాగం అసోసియేషన్‌కు కార్యదర్శి పదవిని కూడా ఇప్పించాడు. ఆ తరువాత ఒంగోలు నగరపాలక సంస్థ ఎన్నికల్లో 29వ డివిజన్ పార్టీ అభ్యర్థిగా పార్టీ కోసం పనిచేసిన ముఖ్యులు నలుగురిని కాదని వరలక్ష్మికి టిక్కెట్ ఇప్పించాడు. టిక్కెట్ ఇప్పించటంతో పాటు ఎన్నికల ఖర్చు కూడా దామచర్లే పెట్టుకున్నాడన్న ప్రచారమూ అప్పట్లో జరిగింది. ఇవన్నీ పరిశీలిస్తే దామచర్ల ఆమెను ఎంతగా ప్రోత్సహించారో అర్థం చేసుకోవచ్చు. ఎల్లో మీడియాను అడ్డంపెట్టుకుని.. సిట్ దర్యాప్తులో టీడీపీ నాయకుల పాత్రలు వెలుగుచూస్తుడడంతో అధికార పార్టీపై నెపం వేసేందుకు దామచర్ల ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకున్నారు. నిత్యం అధికార పార్టీపై బురద జల్లుతూ వాస్తవాలను వక్రీకరిస్తూ పబ్బం గడుపుకుంటున్నారు. అసలు ఈ దర్యాప్తును కోరిందే ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి. దోషులు ఎవరున్నా వదిలిపెట్టవద్దని సీఎంఓలో ఉన్న కీలక అధికారులను సైతం ఆయన కోరిన విషయం తెలిసిందే. ఇవన్నీ పక్కన పెట్టి ఎల్లో మీడియా ప్రతి రోజూ ఒక కథనాన్ని వండి వారుస్తోంది. రూ.100 దస్తావేజు రూ.10 వేలకు విక్రయం... ఒంగోలు కేంద్రంగా దస్తావేజులు అక్రమ విక్రయాలకు పెద్దిశెట్టి వరలక్ష్మి కేంద్ర బిందువుగా మారింది. సాధారణంగా రూ.100 విలువైన దస్తావేజును అదే ధరకు అమ్మాలి. అయితే ఒక్కో చోట స్టాంపు వెండర్లు రూ.100 విలువ చేసే దస్తావేజుకు అదనంగా రూ.20 నుంచి రూ.40 వరకు వసూలు చేసుకుంటారు. ఈ విషయం రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు తెలిసినా పెద్దగా పట్టించుకునే వారు కాదు. అయితే వరలక్ష్మి మాత్రం రూ.100 దస్తావేజును రూ.10 వేలకు విక్రయించి భారీ స్థాయిలో సొమ్ము చేసుకుంది. దానికి ప్రధాన కారణం అప్పటి ఎమ్మెల్యేగా దామచర్ల అండదండలే. టీడీపీ నాయకుల కనుసన్నల్లోనే.. నకిలీ డాక్యుమెంట్ల వ్యవహారం మొత్తం టీడీపీ నాయకుల కనుసన్నల్లోనే సాగినట్లు ఇప్పటి వరకు సిట్ దర్యాప్తులో తేటతెల్లమైంది.. ఇప్పటి వరకు 18 కేసులు నమోదు చేసి దాదాపు 25 మంది వరకు అరెస్టు చేశారు. వారిలో టీడీపీ నాయకులు దాదాపు ఏడెనిమిది మంది ఉన్నారు. మిగతా వాళ్లలో టీడీపీ సానుభూతి పరులే అధికం. టీడీపీ నాయకుడు బాపట్ల వెంకటేశ్వర్లు, అసదుల్లా, రాయపాటి ఏలియా, రాయపాటి అచ్యుత్, కారాని దుర్గాతో పాటు పలువురు ఉన్నారు. రాజాపానగాలరోడ్డుకు చెందిన డాక్యుమెంట్ రైటర్ సురేష్ కూడా 10 రోజుల నుంచి పరారీలో ఉన్నాడు. ఈ కేసులో డాక్యుమెంట్ల రైటర్ల పాత్ర సైతం ఉన్నట్లు సిట్ దర్యాప్తులో తేలినట్లు సమాచారం. దీంతో నగరానికి చెందిన పలువురు డాక్యుమెంట్లు రైటర్లు పరారీలో ఉండగా పోలీసులు గాలిస్తున్నారు. వరలక్ష్మి కోసం పోలీసుల ముమ్మర గాలింపు... దస్తావేజుల కుంభకోణంలో వరలక్ష్మి పాత్ర వెలుగుచూడడంతో ఆమె అజ్ఞాతంలోకి వెళ్లిపోయింది. రాజాపానగాలరోడ్డులో నివాసం ఉంటే వరలక్ష్మి కోసం పోలీసులు ముమ్మరంగా గాలిస్తున్నారు. ఎస్పీ మలికాగర్గ్ నేతృత్వంలోని సిట్ బృందం ఆమె కదలికలపై నిఘా పెట్టింది. అయితే టీడీపీలోని ప్రధాన నాయకులు ఆమెను తమ సంరక్షణలో ఉంచుకొని కాపాడుతున్నట్లు సమాచారం. సెల్ఫోన్లు, ఫోన్ నంబర్లు మారుస్తూ ఇతర ప్రాంతాలకు వెళుతున్నట్లు పోలీసులు గుర్తించారు. వరలక్ష్మితో పాటు ఆమెకు ఆశ్రయం కల్పించిన వారి కదలికలపై కూడా సిట్ నిఘా ఉంచినట్లు విశ్వసనీయ సమాచారం. వరలక్ష్మి విక్రయించిన దస్తావేజులు కోర్టుల్లో కేసుల రూపంలో కొనసాగుతున్నట్లు కూడా సిట్ బృందానికి సమాచారం వచ్చింది. అనేక సమస్యలకు, ఆస్తులు వివాదాల్లోకి వెళ్లటానికి కూడా వరలక్ష్మి విక్రయించిన దస్తావేజులు ప్రధానంగా ఉన్నటు దర్యాప్తులో వెలుగులోకి వస్తున్నాయి. జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయంలో రికార్డుల పరిశీలనలో 1100 దస్తావేజులను నిబంధనలకు విరుద్ధంగా విక్రయించినట్లు పోలీసుల దర్యాప్తులో తేలినట్లు సమాచారం. ఇంకా వేల సంఖ్యలో దస్తావేజులను అక్రమార్కులకు విక్రయించినట్లు తెలుస్తోంది. -
ఉమెనిఫెస్టో ప్లీజ్!
హక్కులు, అవకాశాల్లో మహిళలకు సమాన భాగస్వామ్యం ఎండమావిగానే మిగిలింది. ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో రాజకీయపార్టీలు హామీల వర్షం కురిపిస్తూనే ఉన్నాయి. ప్రభుత్వాలు వస్తున్నాయి..పోతున్నాయ్. కానీ మహిళల సంక్షేమం, సమగ్ర అభివృద్ధి, సామాజిక భద్రత ఇప్పటికీ నినాదాలకే పరిమితమవుతున్నాయి. ఇల్లు, బడి, కార్యాలయంతో పాటు రోడ్డు ఇతర బహిరంగ ప్రదేశాల్లో.. ఎప్పుడూ ఏదో ఒక చోట ఏదో రకమైన వివక్ష, వేధింపులు, అణచివేత నిత్యకృత్యంగానే ఉంటున్నాయి. మహిళల రక్షణ కోసం గృహహింస చట్టం, నిర్భయ చట్టం వంటివి ఎన్ని వచ్చినా, షీటీమ్స్, భరోసా కేంద్రాలు, సఖి వంటి ప్రత్యేక రక్షణ బృందాలు ఎన్ని ఉన్నా లైంగిక దాడులు, హింస కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కోటి దాటిన గ్రేటర్ హైదరాబాద్ జనాభాలో సగం మంది మహిళలే. కాగా ప్రస్తుత ఎన్నికల వేళ.. రాజకీయ పార్టీలు ఏ మేరకు మహిళల ఆకాంక్షలకు, మహిళా సంబంధిత అంశాలకు పెద్ద పీట వేస్తున్నాయనేది చర్చనీయాంశంగా మారింది. పలు మహిళా సంఘాలు, హక్కుల సంఘాలు, వివిధ విభాగాల్లో మహిళల సంక్షేమం కోసం పని చేసే స్వచ్ఛంద సంస్థలు ‘మహిళా మేనిఫెస్టో’పై దృష్టి సారించాయి. మహిళల సంక్షేమం లక్ష్యంగా అన్ని రాజకీయ పార్టీలు మహిళా మేనిఫెస్టోను రూపొందించాలని డిమాండ్ చేస్తున్నాయి. సమాన అవకాశాలు లభించాలి.... స్త్రీలపై జరుగుతున్న అన్ని రకాల హింసను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని రంగాల్లో మహిళలకు 50 శాతం అవకాశాలు లభించాల్సిందేనని మహిళా సంఘాలు కోరుతున్నాయి. ‘అన్నిచోట్లా స్త్రీల ప్రాతినిధ్యం పెరగాలి. విద్య, ఆరోగ్యం, జీవితబీమా, బ్యాంకింగ్, పోలీసు, రవాణా, న్యాయ, వైద్య, ఎయిర్‌ఫోర్స్, నావిక, తదితర అన్ని రంగాల్లో మహిళలు రాణించే విధంగా సమాన అవకాశాలను కల్పించి ప్రోత్సహించాలి. సమాజంలో మహిళలపై హింసకు మద్యపానం కూడా ఒక కారణమే. మద్యాన్ని ఆదాయ వనరుగా భావించే ప్రభుత్వాల దృక్పథం పూర్తిగా మారాలి. మద్యం దుకాణాలను తగ్గించాలి. కచ్చితమైన నియంత్రణ పాటించాలి. ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల లోపే మద్యం షాపులు తెరిచి ఉంచాలి. ప్రధాన హైవేలు, బస్టాపులు, ఆలయాలు, బడులు, ప్రార్ధనాస్థలాలకు సమీపంలో ఉన్నవాటిని తొలగించాలి..’ అని డిమాండ్ చేస్తున్నాయి. నిర్భయ సెల్ ఏర్పాటు చేయాలి ‘ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లు, కళాశాలలు, తదితర అన్ని విద్యాసంస్థల్లో బాలికలు, యువతులు నిశ్చింతగా చదువుకొనేందుకు అనువైన వాతావరణం, మౌలిక సదుపాయాలు కల్పించాలి. అన్ని విద్యాసంస్థల్లో ఇందుకోసం ప్రత్యేంగా 2013 నిర్భయ చట్టానికి అనుగుణంగా నిర్భయ సెల్ ఏర్పాటు చేయాలి. కానీ ఇప్పటివరకు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అమ్మాయిల అవసరాలకు అనుగుణమైన మౌలిక సదుపాయాలు కల్పించాలి. టాయిలెట్లు, రక్షిత మంచినీళ్లు, పౌష్టికాహారం అందజేయాలి. చాలామంది పిల్లలు ముఖ్యంగా బాలికలు తీవ్రమైన పోషకాహార లేమితో బాధపడుతున్నారు. అమ్మా యిల్లో రక్తహీనత ఒక సవాల్‌గా మారింది. ఈ నేపథ్యంలో స్కూళ్లలో తృణ ధాన్యా లతో కూడిన పోషకాహారాన్ని అందజేయాలి. స్కూళ్లలో తప్పనిసరిగా చైల్డ్ హెల్త్ కేర్ రికార్డులను అమలు చేయాలి. ఇందులో ఉపాధ్యాయులు, ఆరోగ్యకార్యకర్తలు, అంగన్వాడీ టీచర్లు భాగస్వాములు కావాలి. యుక్త వయస్సు బాలికలకు చక్కటి ఆరోగ్య విద్య అందజేయాలి. శానిటరీ ప్యాడ్స్, న్యాప్కిన్స్ అందుబాటులో ఉంచాలి. యుక్త వయస్సులో వచ్చే మార్పుల గురించి అమ్మాయిలకు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించే విధంగా జెండర్ సెన్సిటైజేషన్ వర్క్‌షాపులను ఏర్పాటు చేయాలి. వృత్తి విద్యాకోర్సుల్లో శిక్షణ ఇప్పించి అమ్మాయిలు ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందుకొనేలా చర్యలు తీసుకోవాలి. స్వీయ రక్షణ కు నిరంతర శిక్షణ ఉండాలి. ఈ మేరకు మేనిఫెస్టోలో పొందుపరచాలి..’ అని పలు సంఘాలు, సంస్థలు సూచిస్తున్నాయి. మెరుగైన ప్రజా రవాణా అవసరం ‘ప్రస్తుతం గ్రేటర్లో వివిధ రకాల రవాణా సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. కానీ మెట్రోతో సహా అన్ని సేవలు రాత్రి 11కే ముగుస్తాయి. దీంతో రాత్రివేళల్లో విధులు నిర్వహించే సాఫ్ట్వేర్ ఉద్యోగినులు, కాల్సెంటర్లలో పని చేసే అమ్మాయిలు, రాత్రి పూట ఆలస్యంగా ఇళ్లకు చేరవలసిన సమయాల్లో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆటోలు, క్యాబ్‌లలో మహిళల భద్రత ప్రశ్నార్ధకంగానే ఉంది. రాత్రి 9 దాటితే ఇలాంటి వాహనాల్లో ప్రయాణం చేయడం దుస్సాహసమే. ఈ పరిస్థితుల్లో సిటీ బస్సులు 24 గంటల పాటు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలి..’ అని మహిళా సంఘాలు డిమాండ్ చేసు ్తన్నాయి. రాజకీయ పార్టీలు ఈ అంశాలు దృష్టిలో ఉంచుకోవాలని కోరుతున్నాయి. అవకాశం ఇస్తే.. అమలు చేసి చూపిస్తాం ‘అమ్మాయిలకు ఉచిత విద్య. వైద్యం కేటాయిస్తే చాలు సాధికారత అనేది దానంతట అదే వస్తుందని మేము నమ్ముతున్నాం. విద్యాపరంగా బలోపేతమైతే..కెరీర్ పరంగా నిర్ణయాలు తీసుకొని జీవితంలో స్థిరపడగలుగుతారు. రాష్ట్రంలో బీజేపీకి ఒక్కసారి అవకాశం లభిస్తే దీనిని అమలు చేయడం ద్వారా చేసి చూపేందుకు సిద్ధంగా ఉన్నాం. జాతీయస్థాయిలో బీజేపీ ఇచ్చిన మేనిఫెస్టోను ఒకసారి పరిశీలిస్తే...అనేక కీలకమైన అంశాలు పూర్తిస్థాయిలో అమలుచేసే ప్రయత్నాలు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చేస్తోంది. అందులో భాగంగానే మహిళా సాధికారతను సంబంధించిన గతంలో ఇచ్చిన హామీని అమలుచేసేందుకు పూనుకున్నాము. – గీతామూర్తి, బీజేపీ మహిళామోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు మహిళలకు పెద్దపీట వేసేది కాంగ్రెస్ పార్టీనే.. ‘తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక మహిళల హక్కులకు భంగం కలుగుతోంది. దిశ లాంటి ఘటనలు తరచూ చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్ర కేబినెట్సహా ఏ అంశంలోనూ మహిళలకు బీఆర్ఎస్ తగిన ప్రాధాన్యత కల్పించలేదు. కాంగ్రెస్ పార్టీ చరిత్ర చూస్తే మహిళలకు పెద్దపీట వేసేది తామేనని అర్థమవుతుంది. మహిళలను ప్రధానిగా, రాష్ట్రపతిగా చేసింది కాంగ్రెస్ పార్టీనే. జాతీయ పార్టీ అధ్యక్షురాలిగా కూడా బాధ్యతలు అప్పగించింది కూడా మేమే. రాబోయే ఎన్నికల్లో ప్రజలకు మేమిచ్చిన ఆరు గ్యారంటీల్లో కూడా మహిళాసాధికారత కోసం పథకాలు ప్రకటించాం. ప్రతి మహిళకు నెలకు రూ.2,500 నగదు, రూ.500కే గ్యాస్ సిలిండర్, ఆసరా పింఛన్ల పెంపు, చదువుకునే విద్యారి్థనులకు మోటారు సైకిళ్లు లాంటి పథకాలతో రాష్ట్రంలో మహిళాభ్యున్నతికి పాటుపడతాం’ – మచ్చా వరలక్ష్మి, గ్రేటర్ హైదరాబాద్ మహిళాకాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు -
దంపతులను బలి తీసుకున్న పాతకక్షలు
అయ్యంకి(మొవ్వ): గ్రామ పంచాయతీ కార్యాలయ ఆవరణలో జరిగిన జంట హత్యలు కృష్ణాజిల్లాలో కలకలం రేపాయి. ఆస్తి తగాదాలు, పాత కక్షలు భార్య భర్తలను బలితీసుకున్నాయి. మొవ్వ మండలం అయ్యంకి గ్రామంలో గురువారం చోటు చేసుకున్న ఘటన వివరాలు ఇలా ఉన్నాయి. అయ్యంకి గ్రామానికి చెందిన వీరంకి చిన ఆంజనేయులుకు కుమారులు వీరంకి వీరకృష్ణ, వీరంకి పూర్ణచంద్రరావు, కుమార్తె అమ్ములు ఉన్నారు. ఆంజనేయులుకి గ్రామంలో 3.01 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమి వల్ల ఏర్పడిన వివాదాల కారణంగా 2008లో తండ్రి చినఆంజనేయులును, 2012లో తమ్ముడు పూర్ణచంద్రరావును వీరకృష్ణ హత్య చేశాడనే ఆరోపణలొచ్చాయి. అయితే ఈ కేసుల్లో సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో కోర్టు కేసును కొట్టివేసింది. కాగా, పూర్ణచంద్రరావు హత్యానంతరం అతడి భార్య స్వర్ణ, ముగ్గురు కుమారులు గణేశ్, లోకేశ్, భువనేశ్ అయ్యంకి గ్రామం విడిచి వెళ్లిపోయారు. ఇటీవల స్వర్ణ తన పొలానికి పట్టాదారు పాసు పుస్తకానికి అప్లయ్ చేయగా లింక్ డాక్యుమెంట్స్ లేవంటూ వీఆర్వో, ఆర్ఐలు రిజక్ట్ చేశారు. దీనిపై వివరణ కోరేందుకు తాజాగా ఆమె తన కుమారులు ముగు్గరితో కలిసి గురువారం మధ్యాహ్నం అయ్యంకిలోని వీఆర్వో కార్యాలయానికి వచ్చింది. ఈ సందర్భంగా పాస్‌పుస్తకాల విషయంలో స్వర్ణ కుటుంబానికి, అక్కడే ఉన్న వీరకృష్ణకు మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో కోపోద్రిక్తులైన స్వర్ణ కుమారులు వెంట తెచ్చుకున్న కత్తులతో పెదనాన్న వీరకృష్ణను విచక్షణా రహితంగా నరికి హత్య చేశారు. అనంతరం గ్రామంలో జరుగుతున్న అన్న సమారాధన కార్యక్రమం వద్ద ఉన్న వీరకృష్ణ భార్య వరలక్ష్మిని సైతం కత్తులతో పొడిచి హత్యచేసి పరారయ్యారు. గుడివాడ డీఎస్పీ శ్రీకాంత్, పామర్రు సీఐ ఎన్.వెంకటనారాయణ, కూచిపూడి ఎస్ఐ డి.సందీప్ ఘటనా స్థలానికి వచ్చి పరిశీలించారు. వారు మీడియాతో మాట్లాడుతూ.. పక్కా ప్లాన్‌తోనే వీరకృష్ణ, వరలక్ష్మి దంపతుల హత్య జరిగినట్లు తెలిపారు. వీరకృష్ణ తమ్ముడి భార్య స్వర్ణ, ఆమె కొడుకులే హత్యలకు కారణమని వెల్లడించారు. నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. మృతులకు ఓ కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
కోట బొమ్మాళి పాట
మలయాళ హిట్ ఫిల్మ్ ‘నాయట్టు’ (2021)కు తెలుగు రీమేక్‌గా ‘కోట బొమ్మాళి పీఎస్’ చిత్రం రూపొందుతోంది. శ్రీకాంత్ మేకా, వరలక్ష్మీ శరత్‌కుమార్ ప్రధాన పాత్రల్లో రాహుల్ విజయ్, శివానీ రాజశేఖర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. తేజ మార్ని దర్శకత్వంలో బన్నీ వాసు, విద్యా కొప్పినీడి నిర్మించిన ఈ చిత్రం త్వరలోనే విడుదల కానుంది. తాజాగా ఈ సినిమాలో ఉన్న శ్రీకాకుళం ఫోక్ సాంగ్‌ను ఈ నెల 11న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించి, కొత్త పొస్టర్‌ను విడుదల చేసింది యూనిట్. ‘‘పూర్తి స్థాయి ఫోక్ సాంగ్‌గా రానున్న ఈ పాట ప్రేక్షకులను అలరించే విధంగా ఉంటుంది’’ అన్నారు దర్శక–నిర్మాతలు. ఈ చిత్రానికి సంగీతం: రంజిన్ రాజ్, మిధున్ ముకుందన్. -
అత్తింటివారే హింసించి, ఉరేసి చంపారని.. తల్లి ఫిర్యాదు..
కరీంనగర్: కరీంనగర్‌లోని వివేకానందపురి కాలనీలో నివాసముంటున్న ఓ మహిళ అనుమానాస్పద స్థితిలో మృతిచెందినట్లు త్రీటౌన్ పోలీసులు తెలిపారు. వారి వివరాల ప్రకారం.. రామగుండం మండలంలోని వీర్లపల్లికి చెందిన వరలక్ష్మి, గట్టెపల్లికి చెందిన సూత్రాల వరుణ్కుమార్లకు 13 ఏళ్ల క్రితం వివాహమైంది. ప్రస్తుతం కరీంనగర్‌లోని వివేకానందపురి కాలనీలో నివాసం ఉంటున్నారు. ఈ దంపతులకు ఒక కుమారుడు, కూతురు ఉన్నారు. వరుణ్‌కుమార్ మద్యానికి బానిసై, అప్పులు చేశాడు. వాటిని తీర్చేందుకు తల్లిగారింటి నుంచి డబ్బులు, ఆస్తులు తీసుకురావాలని తన కుటుంబసభ్యులతో కలిసి భార్య వరలక్ష్మిని వేధించసాగాడు. ఈ విషయాన్ని ఆమె తరచూ పుట్టింటివారికి చెప్పుకొని, బాధపడేది. మంగళవారం రాత్రి ఇంట్లో అందరూ నిద్రించిన తర్వాత ఉరేసుకుంది. కాగా, తమ కూతుర్ని ఆమె భర్త వరుణ్‌కుమార్, అతని కుటుంబసభ్యులు హింసించి, ఉరేసి చంపారని మృతురాలి తల్లి పూల జయమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
న్యాయం చేయండంటూ జడ్జి ముందు ఏడ్చేసిన నటి
తిరువళ్లూరు: నామ్ తమిళర్ కట్చి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, సినీ నటుడు సీమాన్ వివాహం చేసుకుంటానని నమ్మించి మోసం చేసినట్టు ఆరోపణలు చేసిన సినీనటి విజయలక్ష్మి తిరువళ్లూరు మహిళా కోర్టు న్యాయమూర్తి పవిత్ర ఎదుట హాజరై వాగ్మూలం ఇచ్చారు. దీంతో పాటు ఆధారాలను న్యాయమూర్తికి సమర్పించి తనకు న్యాయం చేయాలని కోరారు. నామ్ తమిళర్ కట్చి పార్టీ నేత సీమాన్ తన సహచర నటి విజయలక్ష్మిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసినట్లు ప్రధాన ఆరోపణ. అయితే సీమాన్ మరో యువతిని వివాహం చేసుకున్నాడు. ఆందోళన చేపట్టిన నటి దీంతో విజయలక్ష్మి 2011లో వలసరవాక్కం పోలీస్ స్టేసన్‌లో సీమాన్‌పై లైంగిక వేధింపులు, అత్యాచారం చేసినట్టు ఫిర్యాదు చేశారు. ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఈ కేసు పెండింగ్‌లో ఉండటంతో పది రోజుల క్రితం విజయలక్ష్మి ఆందోళన బాటపట్టారు. తనకు అన్యాయం జరిగిందని, పోలీసులకు ఫిర్యాదు చేసినా అరెస్టు చేయలేదని ఆరోపణలు చేయడం కలకలం రేపింది. తానూ, సీమాన్ సంవత్సరాల పాటు సహజీవనం చేశామని, చివరకు అతడు తనను మోసం చేశాడని ఆమె మీడియాకు వివరించారు. పోలీస్ స్టేషన్లో 6 గంటలు విచారణ ఈ ఆరోపణలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారిన నేపథ్యంలో వలసరవాక్కం పోలీసులు అప్రమత్తమయ్యారు. వలసరవాక్కం డిప్యూటీ కమిషనర్ ఉమయాల్, అసిస్టెంట్ కమిషనర్ గౌతమ్, సీఐలు మహ్మద్బర్గతుల్లా, రాజ్యలక్ష్మి.. విజయలక్ష్మిని శుక్రవారం ఉదయం పోలీస్ స్టేషన్‌కు తరలించి ఆరు గంటల పాటు విచారణ జరిపారు. అనంతరం తిరువళ్లూరు మహిళా కోర్టు న్యాయమూర్తి పవిత్ర ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి పవిత్ర.. విజయలక్ష్మిని రెండు గంటల పాటు విచారించారు. ఆధారాలు సమర్పించిన నటి గతంలో చేసిన ఆరోపణలకు ఆధారాలను ఇవ్వాలని న్యాయమూర్తి కోరగా అందుకు సంబంధించిన ఆధారాలను సమర్పించారు. తనకు సీమాన్ నుంచి ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించడంతో పాటు అతనిపై చర్యలు తీసుకోవాలని ఆమె కంటతడిపెట్టారు. బాధితురాలు విజయలక్ష్మి ఇచ్చిన వాంగ్మూలాన్ని రికార్డు చేసుకున్న న్యాయమూర్తి ఆమెకు ధైర్యం చెప్పారు. అనంతరం బందోబస్తు నడుమ విజయలక్ష్మిని కారులో చైన్నెకు తరలించారు. చదవండి: ప్రముఖ నటి అపర్ణ మృతికి భర్తే కారణం.. ఏం జరిగిందంటే -
అమెరికాలో వరలక్ష్మి వ్రతం ఆచరించిన హీరోయిన్ లయ (ఫోటోలు)
-
వరలక్ష్మి కుటుంబానికి పరామర్శ
సింహాచలం: జీవీఎంసీ 95వ వార్డు పరిధి సుజాతనగర్లో ఇటీవల హత్యకు గురైన వరలక్ష్మి కుటుంబాన్ని శనివారం పవన్ కల్యాణ్ పరామర్శించారు. ఆమె ఇంటికి వెళ్లి వరలక్ష్మి భర్త గోపాలకృష్ణమూర్తి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. సింహాచలం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద 98వ వార్డు జనసేన నాయకులు పంచ గ్రామాల భూ సమస్యను పవన్ దృష్టికి తీసుకెళ్లారు. ఎల్జీ పాలిమర్స్ గ్యాస్ లీకేజీకి సంబంధించి యువతపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని కోరుతూ అప్పన్నపాలెం కూడలిలో పలువురు ఆయన్ని కలిశారు. ఆ పార్టీ నాయకులు నాదెండ్ల మనోహర్, పంచకర్ల రమేష్‌బాబు, తమ్మిరెడ్డి శివశంకర్, పంచకర్ల సందీప్ తదితరులు పాల్గొన్నారు. సీబీసీఎన్సీ భూముల పరిశీలన బీచ్‌రోడ్డు: సిరిపురంలోని సీబీసీఎన్సీ భూములను జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పరిశీలించారు. అనంతరం అక్కడ విలేకరులతో మాట్లాడుతూ విశాఖ ప్రజలు ఓటేస్తేనే ఎంపీగా ఎన్నికై న ఎంవీవీ ఇప్పుడు వేరే చోట వ్యాపారం చేస్తానడం సరికాదన్నారు. అలాంటప్పుడు ఎంపీ పదవికి రాజీనామా చేసి వెళ్లిపోవాలన్నారు ఎంవీవీ కుటుంబం కిడ్నాప్ వెనుక, సీబీసీఎన్సీ భూములతో సంబంధం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. ప్రశాంతమైన విశాఖలో గొడవలు పెడుతున్నారని ఆరోపించారు. జనసేన కార్యకర్తల వీరంగం పవన్ కల్యాణ్‌ను చూడడానికి వచ్చిన జనసేన కార్యకర్తలు వీరంగం సృష్టించారు. పోలీసులపై దురుసగా ప్రవర్తించి వారి సహనాన్ని పరీక్షించారు. ఓ కార్యకర్త పోలీసులను దూషిస్తూ.. వారిపైకి దూసుకెళ్లాడు. దీంతో పోలీసులు అతన్ని మందలించారు. మరో వైపు సీబీసీఎన్సీ లోపలకు వెళ్లేందుకు కార్యకర్తలు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఆ పార్టీ కార్యకర్తలు ఎంత రెచ్చగొట్టినా పోలీసులు శాంతియుతంగా తమ విధులను నిర్వర్తించారు. -
ఆమెపాటకు అరవై ఏళ్లు
వరలక్ష్మికి గాత్రం దేవుడిచ్చిన వరం. గురువులు లేరు... శిక్షణ లేదు. రేడియో ఆమెకుపాటలు నేర్పింది. రేడియో ఆమెచేతపాడించుకుంది. ఆలయాలు ఆమెపాటలకు వేదికనిచ్చాయి. ఇప్పుడామె ముంబయిలో తెలుగు స్వరం. వరలక్ష్మి నారాయణమ్ పుట్టిల్లు గుంటూరు జిల్లాలోని బ్రాహ్మణ కోడూరు. రేడియోలో వచ్చినపాటలు వింటూపాడడం నేర్చుకున్నారు. అందుకే కాబోలుపాటపాడాలనే అభిలాష ఉన్న వాళ్లను ఏర్చికూర్చి, వాళ్లకుపాడడంలో మెళకువలు నేర్పించి, వారిని ఒక వేదిక మీదకు తీసుకువచ్చిపాడించారు. ఘంటసాల జయంతి రోజున ఘంటసాలపాటలుపాడడానికి మహామహులైన గాయకులు పో టీ పడుతుంటారు. కరతాళ ధ్వనులలో ఉ΄÷్పంగిపో తుంటారు. జనం వారినే చూస్తారు, వారికే హారతులు పడుతుంటారు. కానీ...పాడాలనే తపన ఉన్న అనేక మంది ఆశావహుల ముఖాలను చూశారామె. వారిలో గృహిణులున్నారు. డాక్టర్లు, లాయర్లు, లెక్చరర్లు కూడా ఉన్నారు. ఇలాంటి గానాభిలాషులతో ఘంటసాల జయంతిని ప్రత్యేకంగా నిర్వహించేవారు వరలక్ష్మి. బీఈడీ చేసిన వరలక్ష్మిపాఠాలు చెప్పడంలో స్వరం మాధుర్యం కోల్పోతుందేమోనన్న భయంతోపాటల కోసంపాఠాల ఉద్యోగానికి దూరమయ్యారు.పాటపాడక పో తే తోచదు. ఇప్పుడు ముంబయిలో నివసిస్తున్నప్పటికీ అక్కడి తెలుగు వారిని ఒక చోటకు చేర్చడానికిపాటనే మాధ్యమంగా చేసుకున్నారామె. అరవై ఐదేళ్ల వరలక్ష్మి అరవై ఏళ్ల తనపాటల ప్రస్థానాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. ► పాట చాలా ఇచ్చింది! ‘‘నేనుపాట కోసం జీవితాన్ని అంకితం చేశాననే ప్రశంస సంతోషంగా ఉంటుంది. కానీపాటకు నేను చేసిన సేవకంటేపాట నాకిచ్చిన గుర్తింపు, గౌరవమే పెద్దది.పాట నాకెంతో ఇచ్చింది. ఐదేళ్ల వయసులో గుంటూరులోని బ్రహ్మానందరెడ్డి స్టేడియంలో ఘంటసాల గారితో కలిసి ‘ఆకాశవీథిలో అందాల జాబిలి’పాడాను. నాలో గాయని ఉందని గుర్తించిన స్కూల్ టీచర్లు ఏ కార్యక్రమం అయినా నాతోపాడించేవారు. ఇక కాలేజ్‌లో మ్యూజిక్ ఒక సబ్జెక్ట్‌గా తీసుకున్నాను. మా సరోజిని మేడమ్ ఎక్కడ పో టీలు జరిగినా నన్ను పంపేవారు. సినీనటి సుమలత మ్యూజిక్‌లో నా క్లాస్మేట్. ఆ పరిచయం ఉన్నప్పటికీ నేను సినిమా గానం వైపు వెళ్లలేదు. రేడియోలో ‘బి గ్రేడ్’ సింగర్‌గా సెలెక్ట్ అయ్యాను. ‘ఈ మాసపుపాట, లలిత గీతాలు’ లెక్కలేనన్నిపాడాను. టీవీలో తరిగొండ వెంగమాట కీర్తనలు, సమస్త దేవతా కీర్తనలనుపాడడంతోపాటు బాణీలు కూడా కట్టాను. ఆరు సొంత ఆల్బమ్‌లు చేశాను. మా రోజుల్లో ఇప్పుడున్నన్ని సౌకర్యాల్లేవు. చాలా మంది మహిళలకు తమపాటలను రికార్డు చేసుకోవాలనే కోరిక ఉన్నప్పటికీ ఇంట్లో సహకారం లేక ఆశను చంపేసుకునేవారు. అలా నా దృష్టికి వచ్చిన వారందరి చేత సొంత ఆల్బమ్‌లు చేయించగలిగాను. పెళ్లి తర్వాత మా వారి ఉద్యోగరీత్యా మచిలీపట్నంలో ఉన్నంత కాలం నాపాటయానం ఇన్నర్ వీల్ సర్వీస్‌తో కలగలిసిపో యి సాగింది. మా అబ్బాయి చదువు కోసం తిరుపతికి మారాం. అప్పుడు మరో మలుపు తీసుకుంది. తిరుపతిలో ఉన్నంత కాలం ‘ఘంటసాల స్వరాభిషేకం’ కార్యక్రమంలో వందల మందితో అన్నమాచార్య కీర్తనలు, సాధారణపాటలుపాడించాను. వీటన్నింటిలో నాకు అత్యంత సంతోషాన్నిచ్చిన సంఘటన తిరుమలలో జరిగింది. ► గిరులు ప్రతిధ్వనించాయి తిరుమల రేడియో స్టేషన్ ్రపారంభోత్సవానికి ఆహ్వానించారు. వామన చరిత్రపారాయణం చేశాను. తిరుమలలోనే మరో సంఘటన వేదపాఠశాలలో జరిగింది. మా వదిన తిరుప్పావైపాటలను తెలుగులో రాశారు. ఆపాటలకు నేను ట్యూన్ కట్టాను. ముప్పైవపాట ట్యూన్ చేస్తున్నప్పుడు అనుకోకుండా తిరుపతిలోనే ఉన్నాను. వేదపాఠశాల నుంచి ఆహ్వానం వచ్చింది. గోవిందనామాలతో మొదలుపెట్టి తిరుప్పావైపాశురాలన్నీపాడాను. అప్పుడు వేదపాఠశాల గురువులు, ఐదు వందల మంది విద్యార్థులు గొంతుకల్లో పలికిన ఆశీర్వచనం తిరుమల గిరుల్లో ప్రతిధ్వనించింది.పాటను కమర్షియల్‌గా మార్చకుండా కళగా గౌరవిస్తే భగవంతుడు తనవంతుగా ఇనుమిక్కిలిగా ఇస్తాడని నమ్ముతాను. రెమ్యూనరేషన్ ఇవ్వలేని వాళ్ల కోసం సొంత ఖర్చులతో వెళ్లిపాడిన సందర్భాలున్నాయి. అందుకే నాకు ఆహ్వానాలు కూడా ఎక్కువే వస్తుంటాయి. తెలుగు నేల మీద ఆలయాలన్నీ నాపాటను ఆహ్వానం పలికాయనే చెప్పాలి. ఆర్కెస్ట్రాతో వెళ్తే తప్పనిసరిగా ఖర్చులుంటాయి. అందుకే చెన్నైకి వెళ్లి ట్రాక్‌లు రికార్డు చేయించుకున్నాను. నేను, నా ఫోన్ ఉంటే చాలు. ఎక్కడికైనా వెళ్లిపాడతాను. దేశవిదేశాల్లోనూ నా స్వరం వినిపించే అవకాశం వచ్చింది. ► మెండైన ప్రోత్సాహం పాట కోసం నేను టీచర్ ఉద్యోగాన్ని వదులుకుంటానంటే మా వారు రెండోమాటకు తావులేకుండా ్రపో త్సహించారు. ఆయన కెమిస్ట్రీ ప్రోఫెసర్‌గా రిటైరయ్యారు. మా అబ్బాయికి రిలయెన్స్‌లో ఉద్యోగం. తనుపాడతాడు కానీ వృత్తిగా కాదు. మనుమరాళ్లిద్దరికీ మంచి గొంతు ఉంది. వాళ్లకు నేర్పించాలనే ప్రయత్నం చేస్తున్నాను. కానీ పెరటిచెట్టు వైద్యానికి పనికిరాదన్నట్లు నా దగ్గర క్రమశిక్షణగా కూర్చునిపాడలేకపో తున్నారు. రెండుపాటలుపాడి ‘ఇక ఆడుకుంటాం నానమ్మా’ అని వెళ్లిపో తారు’’ అన్నారామె నవ్వుతూ. అరవై ఐదేళ్ల వయసులో కూడా ఆమె స్వరంలో మాధుర్యం ఏ మాత్రం తగ్గలేదు. ‘పాట కోసం గొంతు సవరించుకోని రోజు నాకు అనారోగ్యం వచ్చినట్లు. ఇంత వరకు ఒక్కరోజు కూడా ముసుగుపెట్టి పడుకున్నది లేదు.పాటలోనే నా ఆరోగ్యం,పాటతోనే నా జీవితం’ అన్నారు వరలక్ష్మి నారాయణమ్. – వాకా మంజులారెడ్డి -
లవ్ మ్యారేజ్.. నా భర్త బతికున్నాడో లేదో కూడా తెలీదు: నటి
మూడు దశాబ్దాలపాటు వెండితెరపై తన నటనతో అలరించారు సీనియర్ నటి పీఆర్ వరలక్ష్మి. సుమారు 800 సినిమాల్లో నటించిన ఆమె కమల్ హాసన్, జెమిని గణేశన్, ఎన్టీఆర్, కృష్ణ వంటి ఎంతోమంది స్టార్ హీరోలతో నటించారు. తమిళ, తెలుగు, మలయాళ, హిందీ భాషల్లో అలరించిన ఆమె వెండితెరపై కనిపించి చాలాకాలమే అయింది. బిగ్‌స్క్రీన్ నుంచి బుల్లితెరకు షిఫ్ట్ అయిన ఆమె ప్రస్తుతం తమిళ సీరియల్స్‌లో నటిస్తున్నారు. తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. 'నాకు సాయం చేసే అలవాటు ఎక్కువ. రోజూ ఎంతోకొంత దానం చేయకపోతే నిద్రపట్టేదే కాదు. అలా అందరికీ సాయం చేసుకుంటూ పోవడం వల్ల కొంత ఆస్తి పోయింది. సినిమాల కోసం ఇల్లు అమ్ముకున్నాను, కోట్లు ఖర్చు పెట్టాను. అలా మరికొంత కరిగిపోయింది. ఇప్పుడు సంపాదిస్తోంది నా ఖర్చులకు సరిపోతుంది. అంతేకానీ నాకు వందల కోట్లు లేవు. నాది లవ్ మ్యారేజ్. ఏడేళ్లు ప్రేమించుకున్నాం. ఇంట్లో ఒప్పుకోకపోతే ఇంటి నుంచి పారిపోయి మరీ పెళ్లి చేసుకున్నాం. నా భర్త మంచి మనిషి, గోల్డ్ మెడలిస్ట్. కానీ మామధ్య ఏదైనా చిన్న గొడవయ్యిందంటే ఏడాది దాకా మాట్లాడే వాడు కాదు. అలా ఓసారి ఇల్లు అమ్మే విషయంలో మా ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగింది. అది కాస్తా పెద్దదిగా మారడంతో మా మధ్య దూరం పెరిగింది. ఆయన నన్ను వదిలేసి అమెరికా వెళ్లిపోయాడు. 30 ఏళ్లవుతోంది.. ఒక్కసారి కూడా టచ్‌లోకి రాలేదు. బతికున్నాడో లేదో కూడా తెలియదు. అయినా... తనంతట తానుగా నన్ను వెతుక్కుంటూ వస్తే సరి కానీ ఆయన ఎక్కడున్నాడో అని మేము వెతుక్కుంటూ వెళ్లడం వద్దనుకున్నాను. కానీ చిన్న గొడవ వల్ల బంగారం లాంటి మనిషికి దూరమయ్యానని బాధపడుతుంటా' అని చెప్పుకొచ్చారు వరలక్ష్మి. చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేసే సినిమాలివే! -
అందరూ అలా పిలవడంతో చాలా బాధపడేదాన్ని: వరలక్ష్మి
సినీ ఇండస్ట్రీలో అప్పట్లో స్టార్ నటిగా వెలుగొందిన వారిలో బేబీ వరలక్ష్మీ ఒకరు. మొదట 1973లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించిన ఆమె దాదాపు 30 ఏళ్లపాటు ఇండస్ట్రీలో కొనసాగారు. ఆ తర్వాత సినీ పరిశ్రమకు చాలా దూరంగా ఉన్నారు. ఇప్పుడు మరోసారి సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. బేబీ వరలక్ష్మి తెలుగులో ఎక్కువగా హీరోలకు చెల్లెలి పాత్రలో నటించింది. ఆ తర్వాత కోలీవుడ్, బాలీవుడ్‌లోనూ పలు సినిమాల్లో హీరోయిన్గా నటించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూకు హాజరైన కెరీర్ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. తన జీవితంలో ఎదురైనా పలు చేదు అనుభవాలను వివరించారు. సూపర్ స్టార్ కృష్ణ చనిపోయినప్పుడు తాను బాగా ఏడ్చానని ఆమె తెలిపారు. అయితే ఈ రేప్ సీన్స్‌లో నటించిన కారణంగా తాను అనేక అవమానాలకు గురైనట్లు వెల్లడించారు. కొంతమంది నన్ను రేపుల వరలక్ష్మి అని పిలిచినప్పుడు చాలా బాధపడినట్లు తెలిపింది. కొంతమంది సహనటులు అలా పిలిస్తే.. తనకు నచ్చేది కాదని గుర్తు చేసుకుంది. అనంతరం తన అస్తుల విషయాల గురించి కూడా ఆమె స్పందించింది. అయితే తమకు చెన్నైలో తనకు కోట్ల ఆస్తులు ఉన్నాయన్న వార్తల్లో ఎలాంటి నిజం లేదన్నారు. అప్పట్లో చైల్డ్ ఆర్టిస్టులకు చాలా తక్కువగా పారితోషికాలు ఉండేవని.. శాలిని అధిక పారితోషికం తీసుకుందని తెలిపింది. ఆ తర్వాత తెలుగులో హీరోయిన్లతో సమానంగా సినిమాలు చేసిన వరలక్ష్మి.. పారితోషికం భారీగానే తీసుకున్నట్లు పేర్కొంది. అప్పట్లో మా పారితోషికాలు తన స్కూల్ ఫీజులకు కూడా సరిపోయేవి కాదని బేబీ వరలక్ష్మి తెలిపింది. తన తండ్రి స్కూల్ ఫీజులు కట్టడానికి చాలా ఇబ్బందులు పడేవారని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత చెల్లెలు పాత్రలు చేశాక.. పారితోషికాలు బాగా అందుకున్నట్లు తెలిపింది. తనకు కోట్ల ఆస్తులు ఏమీ లేవని మినిమం ఆస్తులు సంపాదించుకొని ప్రస్తుతం సంతోషంగానే ఉన్నట్లు చెప్పుకొచ్చింది. అయితే ఈ తరం హీరోలకు తల్లి పాత్రల్లో నటించాలన్న కోరికను బయటపెట్టారు. -
రాష్ట్రపతి ముర్ముకు ఎంపీపీ లేఖ
ఏన్కూరు: ఖమ్మం జిల్లా ఏన్కూరు మండలం కొత్తమేడేపల్లిలోని ఆదివాసీ, గిరిజనుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎంపీపీ అరెం వరలక్ష్మి భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ముకు గురువారం లేఖ రాశారు. గ్రామానికి చెందిన రెండేళ్ల బాలికకు సరైన వైద్యం అందకపోవడంతో ఇటీవల మృతి చెందగా, అంబులెన్స్ లేక ద్విచక్ర వాహనంపై మృతదేహాన్ని తీసుకొచ్చారు. ఈ మేరకు కొత్తమేడేపల్లితో పాటు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెంలోని ఆదివాసీ, గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేలా చూడడంతో పాటు అటవీహక్కుల చట్టాల అమలు తీరును పర్యవేక్షించాలని ఎంపీపీ ఆ లేఖలో రాష్ట్రపతిని కోరారు. -
ప్రియునికి ప్రియురాలి తండ్రి షరతు.. లాడ్జ్‌లో రూం తీసుకొని..
మైసూరు: పెళ్లికి పెద్దలు అంగీకరించలేదని విరక్తి చెందిన ప్రేమికులు ఉరి వేసుకుని తనువు చాలించారు. ఈ విషాద ఘటన మైసూరులో జరిగింది. చామరాజనగర జిల్లా గుండ్లుపేట తాలూకా బొమ్మలాపుర గ్రామానికి చెందిన బీజీ సతీశ్ (21), వరలక్ష్మి (20) అనే ఇద్దరు మృతులు. వీరు గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. సతీశ్‌తో పెళ్లికి వరలక్ష్మి కుటుంబం అంగీకరించలేదు. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించిన తర్వాతనే తమ కూతురును ఇచ్చి పెళ్లి చేస్తామని తెలిపారు. బీఏ చదివిన సతీశ్ పోలీసు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. యువతి నర్సింగ్ చదువుతోంది. కాగా, సతీశ్ మరోసారి పెళ్లి ప్రస్తావన తీసుకురాగా, మొదట ఉద్యోగం తెచ్చుకో అని ప్రియురాలి తండ్రి సిద్ధలింగ తేల్చి చెప్పడంతో ప్రేమ జంట మనస్తాపానికి గురైంది. మైసూరుకు వచ్చిన జంట మంగళవారం సాయంత్రం లాడ్జ్‌లో రూం తీసుకున్నారు. బుధవారం ఉదయం ఎంతకీ బయటకు రాకపోవడంతో సిబ్బంది కిటికీ నుంచి చూడగా గదిలో కొక్కీకి ఉరి వేసుకుని చనిపోయి ఉన్నారు. లాడ్జ్ యజమాని లష్కర్ ఏరియా పోలీసులకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసుకున్నారు. చదవండి: (జైళ్లో నేత్ర.. నిర్మానుష్య బంగ్లాలో చోరీ) నదిలో దూకిన మరో ప్రేమజంట మైసూరు: తమ ప్రేమను ఇంట్లో పెద్దవాళ్లు అంగీకరించలేదని ప్రేమజంట కపిలా నదిలోకి దూకింది. నంజనగూడు తాలూకా ముడికట్టె వద్ద జరిగింది. చామరాజనగర జిల్లా సోమవారపేట గ్రామ నివాసి అభి (19), చామరాజనగరకు చెందిన 17 ఏళ్ల బాలిక ప్రేమించుకున్నారు. బాలిక కాలేజీలో చదువుకుంటుండగా, అభి పెట్రోల్ బంక్‌లో పనిచేస్తున్నాడు. వీరి ప్రేమను తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. బుద్ధిగా ఉండాలని మందలించారు. దీంతో యువ జంట ఆవేదనకు గురై కపిలా నదిలోకి దూకి ఆత్మహత్యకు యత్నించారు. నదిలో తెప్పలు నడుపుతున్నవారు ప్రేమ జంటను రక్షించడంతో గండం తప్పింది. ఇద్దరిని నంజనగూడు ఆస్పత్రిలో చేర్పించారు. పట్టణ పోలీసు స్టేషన్లో కేసు నమోదు అయింది. -
‘స్పై’ కెమెరాలపై ‘స్పై’..మూడో కన్నుతో చూడొద్దు!
స్పై కెమెరాల ద్వారా జరిగే అరాచకాలకు అడ్డుకట్ట వేయాలని ‘యాంటీ రెడ్ ఐ’ పేరుతో ఐదేళ్ల క్రితం ముందుకు వచ్చారు హైదరాబాద్ వాసి వరలక్ష్మి. స్కూళ్లు, కాలేజీలు, కార్యాలయాల్లో ప్రోగ్రామ్‌లు నిర్వహిస్తూ ‘అమ్మాయిలూ జాగ్రత్తగా ఉండండి’ అని చెబుతూ వచ్చారు. ‘‘ఈ క్రమంలోనే జనంలోకి వెళుతున్నకొద్దీ మహిళలు, పిల్లలపై జరుగుతున్న దాడులు, వేధింపులు, హింస.. ఏ స్థాయిలో ఉందో అర్థమైంది. విషయాలు తెలుస్తున్నకొద్దీ నేరాలకు అడ్డుకట్ట వేయలేమా.. అనే ఆలోచన ఎక్కువైంది’’ అంటారు వరలక్ష్మి. ఆ దిశగానే మహిళల రక్షణ విషయంలో అనేక కోణాల్లో పరిశీలించి ‘వాయిస్ ఆఫ్ భారత్’ ను తీసుకొచ్చాను అని వివరించారు. మహిళలు, పిల్లల రక్షణ కోసం చట్టాలు కఠినతరం చేయాలంటూ నినదించే వరలక్ష్మి ‘సాక్షితో పంచుకున్న విషయాలు... ‘‘మహిళల రక్షణపై దాదాపు వందమంది సెలబ్రిటీలు, స్త్రీ, పురుషుల వాయిస్‌ను 45 రోజులు పాటు వీడియో రూపంలో రికార్డు చేశాను. వారందరూ మాట్లాడిన విషయాలో ముఖ్యమైన పాయింట్స్‌ను క్రోడీకరించారు. అడ్వకేట్ అభిప్రాయాన్ని కూడా తీసుకొని 24 ముఖ్యమైన పాయింట్ల జాబితాను తీసుకొచ్చాను. రాష్ట్ర స్థాయి నుంచి కేంద్ర స్థాయి వరకు అధికారులను సంప్రదించి, ఆ జాబితాను అమలు పరిచాలని కోరుతున్నాను. రోజు రోజుకూ నేరాలుపెరుగుతున్న నేపథ్యంలో మహిళల రక్షణ కోసం ఏర్పాటు చేసిన ఒక ఎజెండా ఇది. 2017లో ‘యాంటీ రెడ్ ఐ’ పేరుతో జనంలోకి వెళ్లినప్పుడు కొత్త కొత్త సమస్యలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఆగస్టు 15, 2020 నుంచి పబ్లిక్ నుంచి వాయిస్ తీసుకోవడం మొదలుపెట్టాను. తెలంగాణ, ఆంధ్రాలోని అన్ని రాజకీయ పార్టీలు, పోలీసు డిపార్ట్మెంట్ నుంచి కూడా వాయిస్ తీసుకున్నాం. తెలుగు రాష్ట్రాల్లో మహిళలు, పిల్లలపై అఘాయిత్యాలకు అడ్డుకట్ట వేయడానికి, నిరోధించడానికే నా ప్రయత్నం అంతా. దీంట్లో భాగంగానే మహిళలకు శిక్షణా తరగతులు, క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్స్, బాలకార్మికులకు సంబంధించినవి, హెచ్.ఐ.వి/ఎయిడ్స్ అవగాహన, ఆరోగ్య శిబిరాలు.. ఇవన్నీ ఒక దగ్గర చేర్చడానికి ‘హెవెన్ హోమ్ సొసైటీ’ పేరుతో ఎన్జీవోను ఏర్పాటు చేశాను. సీసీ కెమెరాలు, పుటేజీ ‘వాయిస్ ఆఫ్ భారత్’లో భాగంగా గ్రామణస్థాయి నుంచి నా కార్యాచరణను మొదలుపెట్టాను. అప్పుడే పిల్లలు, మహిళలపై అఘాయిత్యాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయనేది అర్ధమైంది. ఏదైనా నేరం జరిగిన వార్త తెలిసినప్పుడు ‘అయ్యో’ అనేసి ఊరుకుంటున్నాం. కానీ, చాలా వరకు గురుకులాలు, కార్యాలయాలు, పాఠశాలల్లో... సీసీ కెమెరాల ఏర్పాటు, వాటికి సంబంధించిన పుటేజీ రికార్డులో ఉండటం అనేది ఏ మాత్రం జరగడం లేదు. ఎక్కడా రికార్డు కాకపోవడంతో నేరాలు కూడా వెలుగు చూడటం లేదు. నేరస్థులు నిర్భయంగా బయట తిరుగుతున్నారు. మిస్సింగ్ అయిన కథనాలెన్నో.. లాక్డౌన్ తర్వాత వరుస చిన్నారులు మిస్సింగ్ కథనాలు ఎక్కువగా వినవస్తున్నాయి. ఇటీవల హైదరాబాద్ దమ్మాయిగూడలో నలుగురు పిల్లలు మిస్సింగ్ న్యూస్ ప్రధానమైంది. అందులో ఒక చిన్నారిని అత్యంత దారుణంగా రేప్ చేసి, చంపారు. మరో రెండు కేసులు వెలుగులోకే రాలేదు. ఇలాంటి వాటికి అడ్డుకట్ట రావాలంటే అన్నిచోట్లా సిసి కెమెరాల ఏర్పాట్లు పెంచాలి. సెక్షన్లు త్వరగా అమల్లో పెట్టాలి. పార్టీలతో సంబంధంలో లేకుండా మహిళల రక్షణకు సంబంధించిన విషయాలన్నీ వారి ఎజెండాలో పెట్టాలి. ప్రతి మహిళా ఆలోచించాల్సిన తరుణం ఇది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పిల్లలు, మహిళల భద్రత విషయాల పట్ల వెంటనే స్పందించి, అమలులో పెట్టాలి. అఘాయిత్యాలు చోటు చేసుకున్నాక కాదు రక్షణ గురించి ఆలోచించడం కాదు, ముందే బతికుండటానికి రక్షణ కావాలన్నదే ‘వాయిస్ ఆఫ్ భారత్’ నినాదం. మహమ్మారి టైమ్ కరోనా టైమ్‌లో బయట తిరిగే వారి సంఖ్య తగ్గింది, క్రైమ్ తగ్గింది అనుకుంటున్నారు. నిజానికి పరిస్థితి అలా లేదు. దీనికి సంబంధించిన డేటా కోసం అన్ని పోలీసు విభాగాల్లోనూ వివరాలను సేకరించాను. ఒక్కో పోలీస్ స్టేషన్ పరిధిలో కనీసం ఐదు కేసులు ఫైల్ అవుతున్నాయి. గృహహింస అయితే మరీ దారుణం. కరోనా కారణంగా ఎవరి ప్రాణాలు వారు కాపాడుకోవడంలో మునిగిపోయి ఈ తరహా క్రైమ్ వినడానికి, చెప్పుకోవడానికి ఎవరూ పట్టించుకోవడం లేదు. మూడో కంటితో చూడొద్దు... యాంటీ రెడ్ ఐ షాపింగ్ మాల్స్, కాంప్లెక్సులు, హోటల్ గదులు, అద్దె ఇల్లు.. ఇలా ప్రతి చోట అమ్మాయిలు, మహిళలను స్పై కామ్ ద్వారా నగ్న వీడియోలు, ఫొటోలు తీసి వాటిని సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేసే నేరగాళ్లు పెరిగారు. దీనివల్ల జరిగే అనర్థాలకు అడ్డుకట్టవేసే ఉద్దేశంతోనే మూడో కన్నుతో చూడొద్దు అని ‘యాంటీ రెడ్ ఐ’ ఏర్పాటు చేశాను. దాదాపు ఐదేళ్లుగా ఈ స్పై కెమరా నేరాలకు సంబంధించి వర్క్ చేస్తున్నాను. ఎంతోమంది సాయంగా! మహిళల భద్రతకు సంబంధించిన ‘యాప్’ ను తీసుకురావాలని ప్రభుత్వాలను కోరుతూ, మహిళల రక్షణకు సంబంధించిన విషయాలను ప్రింట్ చేస్తూ వాటిని అధికారులకు అందజేస్తూ వస్తున్నాను. వేధింపులు, అఘాయిత్యాలకు గురైన బాధితులకు సాయం చేయమంటూ వేడుకోళ్లు వస్తూనే ఉంటాయి. దానికి తగినట్టుగానే అడ్డుకోవడానికి ‘చంపేస్తాం’ అంటూ ఎన్నో బెదిరింపులు వచ్చాయి. ఇలాంటప్పుడు కుటుంబం శ్రేయస్సు గురించి ఆలోచించి, విడిగా ఉంటూ ఈ పనులు చూస్తున్నాను. ఈ సంస్థ ముందుకెళ్లడానికి నా స్నేహితుల సాయమే నాకు కొండంత అండగా నిలుస్తోంది’’ అని వివరించారు వరలక్ష్మి. – నిర్మలారెడ్డి, సాక్షి ఫీచర్స్ ప్రతినిధి ఫొటోలు: రాజేష్ రెడ్డి నోముల -
పోలీస్ కస్టడీకి వరలక్ష్మి హత్య కేసు నిందితుడు అఖిల్
-
వరలక్ష్మి హత్య కేసు: పోలీస్ కస్టడీకి అఖిల్
సాక్షి, విశాఖపట్నం : విశాఖలో సంచలనం రేకెత్తించిన ఇంటర్మీడియట్ విద్యార్థిని వరలక్ష్మి హత్య కేసులో నిందితుడు అఖిల్ సాయిని పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. అందులో భాగంగా బుధవారం నుంచి విచారణ కొనసాగించారు. ముఖ్యంగా ఒక మైనర్ బాలికను హత్య చేయడం వెనుక అఖిల్ అనుసరించిన అంశాలను పోలీసులు సేకరించారు. నిందితుడు ప్రేమ పేరిట బాలికను నిర్మానుష్య ప్రాంతానికి రప్పించడమే కాక హత్య నేరాన్ని మరొకరిపై నెట్టే ప్రయత్నం జరిగింది. వీటిపై ఫోరెన్సిక్ నిపుణుల సహకారంతో కొన్ని ఆధారాలను పోలీసులు సేకరించారు. నిందితునిపై త్వరితగతిన శిక్ష పడే రీతిలో పోలీసులు సాంకేతికపరమైన ఆధారాలు ఈ కేసులో సేకరిస్తున్నట్లు తెలిసింది. విశాఖ దీక్ష ఏసీపీ ప్రేమ్ కాజల్ స్వయంగా నిందితుడిని విచారించినట్లు తెలుస్తోంది. కస్టడీ గడువు ముగియడంతో అగనంపూడి ప్రాథమిక వైద్యశాలలో పరీక్షలు నిర్వహించి పోలీసులు కోర్టులో హాజరు పరిచారు. చదవండి: వరలక్ష్మి హత్య కేసులో మరో ట్విస్ట్ -
వరలక్ష్మి హత్య కేసులో మరో ట్విస్ట్
గాజువాక(విశాఖపట్నం): స్థానిక శ్రీనగర్‌కు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థిని వరలక్ష్మి హత్య కేసులో మరో ఇద్దరు నిందితులను గాజువాక పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. ప్రేమోన్మాది అఖిల్‌సాయి వెంకట్ చేతిలో వరలక్ష్మి హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీసులు సంఘటన జరిగిన రోజే నిందితుడు అఖిల్‌సాయి వెంకట్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో తాజాగా కొప్పెర్ల హరి రామకృష్ణరాజు, తంగెళ్ల చిన్న అప్పన్న అనే మరో ఇద్దరిని కూడా అరెస్టు చేశారు. పోలీసుల కథనం ప్రకారం.. వరలక్ష్మితో చనువుగా ఉంటున్నాడనే కారణంతో ఆమె సోదరు డు ఇటీవల వంగపండు రామునాయుడు అనే వ్యక్తితో గొడవపడ్డాడు. మరోసారి తన చెల్లెలతో మాట్లాడినట్టు తెలిస్తే బాగుండదని హెచ్చరించాడు. రెండేళ్ల క్రితం హత్యకు గురైన రౌడీషీటర్ కుమారుడు హరి రామకృష్ణరాజుతో ఈ విషయాన్ని చెప్పాడు. దీన్ని అదనుగా తీసుకున్న హరి ఇటీవల రామునాయుడుకు ఫోన్ చేసి షీలానగర్ వచ్చి తనను కలవా లని, లేనిపక్షంలో ఇబ్బంది పడతావని హెచ్చరించాడు. అతడి ని కలిసిన రామునాయుడుని రూ.10వేలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. తాను అడిగిన డబ్బులు ఇస్తే ఎవరినుంచీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తానని చెప్పాడు. దీంతో రాము నాయుడు అతడికి దఫదఫాలుగా రూ.7వేలు ఇచ్చాడు. ఉప్పర కాలనీ నివాసి, హరి స్నేహితుడు చిన్న అప్పన్న అనే వ్యక్తికి కూడా రూ.1000 ఇచ్చాడు. వరలక్ష్మి హత్య కేసులో విచారణ ప్రారంభించిన పోలీసులకు రామునాయుడు ఈ విషయాలు చెప్పడంతో హరి, చిన్న అప్పన్నలను కూడా అరెస్టు చేసినట్టు గాజువాక సీఐ మల్లేశ్వరరావు తెలిపారు. ఈ కేసులో మొత్తం ముగ్గురు నిందితులను అరెస్టు చేశామని ఎస్ఐ గణేష్ తెలిపారు. -
వరలక్ష్మిని చంపేందుకు క్రైమ్ సినిమాలు చూశాడు..
అమ్మాయిని ప్రేమించాడు. ఆమెతోనే జీవితమనుకున్నాడు. కానీ అతడు అనుకుంది జరగలేదు. ఆమె అతడిని స్నేహితుడిగా మాత్రమే చూసింది. తట్టుకోలేకపోయాడు. కక్ష పెంచుకున్నాడు. తనకు దక్కని ప్రేమ మరొకరికి దక్కకూడదని నిశ్చయించుకున్నాడు. అలా తనలోని ప్రేమికుడు కాస్తా రాక్షసుడిగా మారాడు. ప్రేమికురాలిని హతురాలిగా మార్చేందుకు క్రైమ్ సినిమాలు చూశాడు. నేరం చేసి తప్పించుకోవడమూ నేర్చుకున్నాడు. కానీ అది సినిమా, ఇది నిజ జీవితమని గుర్తించలేకపోయాడు. యువతిని పొట్టనపెట్టుకున్నాడే కానీ హత్యా ఘాతుకం నుంచి తప్పించుకోలేకపోయాడు. సాక్షి, విశాఖపట్నం: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన వరలక్ష్మి హత్య కేసులో సంచలన నిజాలు బయటపెడుతున్నాయి. నిందితుడు అఖిల్ సాయి వెంకట్ తనకు దూరమైన వరలక్ష్మి ఎవరికీ దక్కకూడదనే కోపంతో ఈ హత్యకు పథకం వేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. హత్య చేయడంతో పాటు, నేరం బయటపడకుండా ఉండేందుకు అతడు పాపులర్ క్రిమినల్ సినిమాలను చూశాడు. ఓ పాపులర్ సినిమాలో హత్య చేసిన తర్వాత చుట్టూ కారం చల్లితే డాగ్ స్క్వాడ్ కూడా పసిగట్టని సీన్లను చూసినట్టు నిందితుడు వెల్లడించాడు. దీంతో పక్కా పథకం ప్రకారం ముందుగానే కారం కొనుగోలు చేసి, అనంతరం ఆమెను నిర్మానుష్య ప్రదేశానికి రప్పించి, బ్లేడుతో కోసి, ఎటువంటి ఆధారాలు లభించకుండా చుట్టూ కారం చల్లాలని భావించాడు. అలాగే 'దృశ్యం' సినిమాలో చేసినట్లు పోలీసులను తప్పుదారి పట్టించిన మరొకరిపై నేరాన్ని మోపే ప్రయత్నం కూడా చేశాడని తేలింది. (చదవండి: వరలక్ష్మి హత్యకేసులో మరింత లోతుగా విచారణ) మరికొన్ని రోజుల్లో ఛార్జిషీట్ దాఖలు చేస్తాము కాగా గాజువాక శ్రీనగర్‌లోని సుందరయ్య కాలనీకి చెందిన ఇంటర్ విద్యార్థిని వరలక్ష్మి (17)పై చిట్టినాయుడు కాలనీకి చెందిన అఖిల్‌సాయి వెంకట్ (21) శనివారం రాత్రి బ్లేడ్‌తో దాడి చేసి.. అతి కిరాతకంగా గొంతుకోసి చంపేసిన విషయం తెలిసిందే. హత్య జరిగిన ప్రాంతంలో పోలీసులు నేడు (గురువారం) మరోసారి సీన్ రీ కన్స్ట్రక్షన్ చేశారు. చుట్టుపక్కల పరిసరాలలో కొందరి నుంచి సాక్ష్యాలు కూడా సేకరించారు. నిందితుడిపై హత్యానేరంతోపాటు మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన అభియోగంపై యాక్ట్ జత చేశారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన అనంతరం ఏసీపీ ప్రేమ్ కాజల్ మాట్లాడుతూ కొద్ది రోజుల్లోనే ఈ కేసుకు సంబంధించి చార్జిషీట్ దాఖలు చేస్తామని తెలిపారు. నిందితుడిపై పోక్సో యాక్ట్ అమలు చేస్తామని పేర్కొన్నారు. (చదవండి: చదువుల తల్లిని చిదిమేశాడు) -
రామ్‌తో చనువుగా ఉండటాన్ని భరించలేక..
సాక్షి, విశాఖపట్నం : ఉన్మాది చేతిలో హత్యకు గురైన వరలక్ష్మి కేసును విశాఖ పోలీసులు మరింత లోతుగా విచారణ కొనసాగిస్తున్నారు. దీనిలో భాగంగా ఇప్పటికే ప్రధాన నిందితుడు అఖిల్ సాయి కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపించారు. అదే సమయంలో ఇతరుల ప్రమేయంపై కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో హోంమంత్రి ఆదేశాల మేరకు విచారణను మరింత లోతుగా కొనసాగిస్తున్నారు. వరలక్ష్మి మరో యువకుడు రామ్‌తో చనువుగా ఉండటాన్ని భరించలేక అఖిల్ సాయి హత్య చేసినట్లు నిర్ధారణ అయింది. చదవండి: హత్యకేసులో సెంట్రల్ జైలుకి అఖిల్.. ఈ హత్యకు ముందు అఖిల్ సాయి గాజువాకలో రౌడీషీటర్ గేదెల రాజు కొడుకు సూర్యనారాయణ రాజుతో కలిసి రామును బెదిరించడమే కాకుండా తెలుగు తల్లి ఫ్లై ఓవర్ వద్ద దాడి కూడా చేసినట్లు గుర్తించారు. ఆ సమయంలో వరలక్ష్మి సోదరుడు జై ప్రకాష్ కూడా ఉన్నారు. వరలక్ష్మితో రాము సన్నిహితంగా ఉంటున్నాడని చెప్పి వరలక్ష్మి సోదరుడు జై ప్రకాష్‌ను రెచ్చ గొట్టి ఈ దాడికి పాల్పడ్డాడు. అయితే వరలక్ష్మి హత్యలో ఈ రౌడీషీటర్ గేదెల రాజు కొడుకు ప్రమేయం ఏ మేరకు ఉందన్న కోణంలో పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. -
నేరస్తులపై కఠిన చర్యలు
సాక్షి, విశాఖపట్నం: వరలక్ష్మి కేసులో నేరస్తులు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని, దిశ చట్టం ప్రకారం ఏడు రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి చార్జిషీటు వేస్తామని రాష్ట్ర హోం మంత్రి మేకతోటి సుచరిత చెప్పారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గాజువాక మండలం చినగంట్యాడ సుందరయ్య కాలనీలో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన వరలక్ష్మి కుటుంబాన్ని మంత్రి సుచరిత సోమవారం పరామర్శించారు. సీఎం వైఎస్ జగన్ ప్రకటించిన ఆర్థిక సాయానికి సంబంధించిన రూ.10 లక్షల చెక్కును వరలక్ష్మి తల్లిదండ్రులు పద్మప్రియ, సత్యగురునాథ్కు కలెక్టర్ వినయ్‌చంద్, గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డితో కలిసి ఆమె అందించారు. ప్రభుత్వం తరఫున అండగా ఉంటామని వరలక్ష్మి కుటుంబసభ్యులకు హామీ ఇచ్చారు. అనంతరం సుచరిత మీడియాతో మాట్లాడారు. ఈ ఘటనను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్రంగా పరిగణించినట్లు తెలిపారు. తక్షణమే వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించాలని ఆదేశించినట్లు వెల్లడించారు. రాష్ట్రంలో మహిళల భద్రత కోసం తీసుకొచ్చిన దిశ చట్టం స్ఫూర్తితో నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు చేపడతామన్నారు. నిందితుడు అఖిల్ సాయిని రిమాండ్‌కు తరలించారని.. అతని తండ్రి, వారి కుటుంబసభ్యులపై బైండోవర్ కేసులు నమోదు చేసినట్లు మంత్రి తెలిపారు. వరలక్ష్మి కుటుంబసభ్యులకు రూ.10 లక్షల చెక్కు అందజేస్తున్న హోంమంత్రి సుచరిత దిశ యాప్‌లో ఫిర్యాదు చేయండి.. చిత్తూరులో చిన్నారిపై హత్యాచారం ఘటనలో నిందితుడికి 7 నెలల్లోనే ఉరిశిక్ష ఖరారైందని.. విజయవాడలో 4 నెలల్లోనే నిందితుడికి ఉరిశిక్ష పడిందని హోం మంత్రి సుచరిత గుర్తు చేశారు. పాఠశాల స్థాయిలోనే మగపిల్లలకు అమ్మాయిలతో ఎలా ప్రవర్తించాలో అవగాహన కల్పించడంతో పాటు చట్టాలను కూడా వివరించేందుకు తగు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రతి విద్యార్థినీ దిశ యాప్, ఏపీ పోలీస్ సేవా యాప్ డౌన్లోడ్ చేసుకునేలా ప్రత్యేక డ్రైవ్ చేపడతామని చెప్పారు. ఇలాంటి ఘటనలపై ఫిర్యాదు వస్తే వెంటనే స్పందించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో విశాఖ సీపీ మనీష్‌కుమార్ సిన్హా, దిశ చట్టం ప్రత్యేకాధికారులు కృతికా శుక్లా, దీపికా ఎం.పాటిల్, డీసీపీ ఐశ్వర్య రస్తోగి, సౌత్ ఏసీపీ రామాంజనేయరెడ్డి, ఆర్డీవో కిశోర్ తదితరులు పాల్గొన్నారు.